బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ మధ్య జరిగిన వివాదం..చరిత్రలో మరచిపోలేరు, కాంప్రమైజ్ కాకుండా చాలా దూరం వెళ్లారు
సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ కలసి అనేక చిత్రాల్లో నటించారు. ఒకరిపై ఒకరికి ఎంతో ఆప్యాయత ఉండేది. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అల్లూరి సీతా రామరాజు చిత్రం నుంచి ఇద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఏర్పడ్డాయి.
సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ కలసి అనేక చిత్రాల్లో నటించారు. ఒకరిపై ఒకరికి ఎంతో ఆప్యాయత ఉండేది. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అల్లూరి సీతా రామరాజు చిత్రం నుంచి ఇద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య వివాదం రెండు కుటుంబాల మధ్య వైరానికి దారితీసింది.
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ మధ్య కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనని అటు ఘట్టమనేని అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు చరిత్రలో మరచిపోలేరు. ఒక సినిమా టైటిల్ విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు 1987లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రమేష్ బాబు సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
రమేష్ బాబు తొలి చిత్రం కోసం సూపర్ స్టార్ కృష్ణ బేతాబ్ అనే హిందీ మూవీ రైట్స్ కొన్నారు. ఆ చిత్రానికి సామ్రాట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో కూడా సామ్రాట్ అనే చిత్రం అనౌన్స్ అయింది. టైటిల్ విషయంలో బాలకృష్ణ, కృష్ణ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య మంచి సఖ్యత ఉండిఉంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యేవారు. కానీ అప్పటికే ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి.
దీనితో కృష్ణ కాంప్రమైజ్ కావడానికి ససేమిరా అన్నారు. టైటిల్ కోసం ఏకంగా కోర్టుకి వెళ్లారు. విచారణ జరిపిన కోర్టు కృష్ణ గారికే సామ్రాట్ టైటిల్ హక్కులు ఉంటాయని తీర్పు ఇచ్చింది. దీనితో బాలకృష్ణ చేసేది లేక తన చిత్రానికి 'సాహస సామ్రాట్' అని టైటిల్ మార్చుకున్నారు.
ఈ రెండు చిత్రాలు 1987లోనే విడుదలయ్యాయి. రమేష్ బాబు ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించారు. రమేష్ బాబుకి బ్రేక్ ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. దీనితో రమేష్ బాబు హీరోగా, నటుడిగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. మహేష్ బాబు నటించిన అర్జున్, దూకుడు, అతిథి లాంటి చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా కూడా పనిచేశారు. 2022లో రమేష్ బాబు అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే.