పెళ్ళికి పిలవడానికి చిరంజీవి ఇంటికి వెళ్లి..స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన లెజెండ్రీ నటి, అసలేం జరిగిందంటే
మెగాస్టార్ చిరంజీవికి అలనాటి లెజెండ్రీ నటీనటుల నుంచి ఈ తరం నటుల వరకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి అందరితో ఆప్యాయంగా ఉంటారు. అయితే కొందరితో ఇండస్ట్రీలో చిరంజీవికి విభేదాలు కూడా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవికి అలనాటి లెజెండ్రీ నటీనటుల నుంచి ఈ తరం నటుల వరకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి అందరితో ఆప్యాయంగా ఉంటారు. అయితే కొందరితో ఇండస్ట్రీలో చిరంజీవికి విభేదాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో చిరంజీవి చిత్ర పరిశ్రమకి చెందిన వారి నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి, దివంగత లెజెండ్రీ నటి జమున మధ్య ఒకసారి ఊహించని సంఘటన జరిగింది. జమున గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, మహానటి సావిత్రి తరహాలో జమున కూడా గొప్ప గుర్తింపు పొందారు. చలాకీ పల్లెటూరి అమ్మాయి తరహా పాత్రలతో అప్పట్లో జమున ప్రేక్షకులని మెప్పించారు. పౌరాణికాల్లో సత్యభామ పాత్రకి అందం తెచ్చిన నటి జమున. జమున రాజమండ్రి ఎంపీగా కూడా పనిచేసి రాజకీయాల్లో రాణించారు.
ఎలాంటి విషయాన్ని అయినా ఎవరితో అయినా నిర్మొహమాటంగా చెప్పే ధైర్యం ఆమెకి ఉంది. ఆమె జెమిని గణేశన్ లాంటి అగ్ర నటులకు సైతం అప్పట్లో వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయట. ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో జమున.. చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించే హక్కు సామాన్య ప్రజల, సెలెబ్రిటీలు అందరికీ ఉంది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం. అలాంటి సినిమావాళ్లు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి. ఏ.. సినిమావాళ్లు పరిపాలన చేయకూడదా అని జమున అన్నారు.
ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణం రాజు, నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్టీఆర్ సీఎం అయ్యారు. నేను, కృష్ణ, కృష్ణం రాజు ఎంపీలు అయ్యాం. మేమంతా సక్సెస్ అయ్యాం. అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడు వేరు. కానీ ప్రస్తుత రాజకీయాలు కమర్షియల్ అయిపోయాయి. కోటి రూపాయలు ఖర్చు చేస్తే 20 కోట్లు సంపాదిస్తున్నారు. రాజకీయాలు అలా అయిపోయాయి. చిరంజీవి గారి విషయంలో నేను బాధపడ్డాను.
ఇప్పటి రాజకీయాల్లోకి సినిమా వాళ్ళు రాకపోవడమే బెటర్ అని నేను చెబుతాను. ఎందుకంటే కుళ్ళు, కుత్రంత్రాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమావాళ్లు నిలదొక్కుకోవడం కష్టం. చిరంజీవి గారు రాజకీయాల్లో వస్తున్నారని తెలిసినప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్లాను. మా అమ్మాయి పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి వేళా. చిరంజీవి గారిని ధైర్యంగా హెచ్చరించా. చిరంజీవి గారు.. మీకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు, మీరు గొప్ప ఆర్టిస్ట్.. దానిపైనే ఫోకస్ చేయండి. దయచేసి ఈ కుళ్ళు రాజకీయాల్లోకి రావద్దు. ఇబ్బంది పడతారు అని హెచ్చరించా.. ఆయన నవ్వేసి ఊరుకున్నారు.
మాట వినకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఏమైందో తెలుసు కదా అని జమున తెలిపారు. ఈ కుళ్ళు రాజకీయాలని కడగడం సినిమావాళ్ళకు సాధ్యం కాదు. ప్రజలు కూడా అలా బతకాల్సిందే అంటూ జమున ఆవేదన వ్యక్తం చేశారు.