ఇన్నేళ్లకు బాలయ్యకి అసలు సిసలైన డైరెక్టర్ దొరికాడు, ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ
Nandamuri Balakrishna: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సీనియర్ హీరోల్లో టాప్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా నాలుగు హిట్లు సాధించారు. చివరగా సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రం మంచి విజయం సాధించింది.

Nandamuri Balakrishna
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సీనియర్ హీరోల్లో టాప్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా నాలుగు హిట్లు సాధించారు. చివరగా సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం బాలయ్య తనకు అచ్చొచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాలుగో చిత్రంలో నటిస్తున్నారు. అఖండ 2 వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతోంది.
మరోవైపు బాలయ్యతో వీర సింహారెడ్డి చిత్రం తెరకెక్కించిన గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలో నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. మాస్ చిత్రాలు తెరకెక్కించే దర్శకులు చాలా మంది ఉన్నారు. కానీ మాస్ కథలని స్టైలిష్ గా తెరకెక్కించే దర్శకులు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో హరీష్ శంకర్ ఒకరు.
Harish Shankar
హరీష్ శంకర్, బాలకృష్ణ కాంబినేషన్ ఆల్మోస్ట్ సెట్ అయినట్లు సమాచారం. బాలయ్య కోసం హరీష్ శంకర్ తన రీమేక్ కథలని పక్కన పెట్టి ఒరిజినల్ స్టోరీ రాశారట. హరీష్ శంకర్ కథ వినిపించగా బాలయ్య ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది.
హరీష్ శంకర్ చివరగా రూపొందించిన మిస్టర్ బచ్చన్ చిత్రం డిజాస్టర్ అయింది. దీనితో హరీష్ బాలయ్య మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వన్ లైన్ డైలాగులు రాయడంలో హరీష్ కి మంచి పట్టు ఉంది. అలాంటిది హరీష్, బాలయ్య కాంబినేషన్ లో మూవీ అంటే ప్రారంభం నుంచే అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఈ చిత్రాన్ని శాండల్ వుడ్ కి చెందిన కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ లో యష్ టాక్సిక్, విజయ్ జన నాయగన్ చిత్రాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం పూర్తి చేయాల్సి ఉంది. కానీ పవన్ బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రానికి బ్రేక్ పడింది.