- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న మహేష్‌బాబు వైఫ్.. నమ్రత కసి చూపులకు కుర్రకారుకి పిచ్చెక్కిపోవాల్సిందే..
బ్లాక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న మహేష్‌బాబు వైఫ్.. నమ్రత కసి చూపులకు కుర్రకారుకి పిచ్చెక్కిపోవాల్సిందే..
సీనియర్ బ్యూటీ నమ్రత శిరోద్కర్.. సినిమాలు మానేసి పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తుంది. ఓ వైపు పిల్లలు, మరోవైపు మహేష్ బిజినెస్, డేట్స్ వ్యవహారాలు చూసుకుంటుంది.

మహేష్‌బాబుకి సంబంధించి, వారి ఫ్యామిలీకి సంబంధించి తెరవెనుక అన్నీ తానై చూసుకుంటుంది నమ్రత. అత్యంత బిజీగా గడుపుతుంది. అయితే ఇంతటి బిజీలోనూ ఆమె సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. మరే స్టార్ హీరో వైఫ్ కి కూడా సాధ్యం కాని విధంగా ఆమె అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది.
నమ్రత ఇటీవల యాడ్స్ చేస్తుంది. తాను కూడా జ్యూవెల్లరి యాడ్స్ లో కనిపిస్తుంది. తాజాగా ఆమె ఓ నగలకు సంబంధించి ప్రమోట్ చేసింది. అయితే ఇందుకోసం ఆమె ధరించిన డ్రెస్, ఇచ్చిన పోజులు మాత్రం మంటలు పుట్టించేలా ఉండటం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ లో నమ్రత నయా ఫోటోలు పంచుకుంది.
ఇందులో బ్రాక్ డ్రెస్‌లో మెరిసిపోతుంది నమ్రత. బాడీకి హత్తుకున్న డ్రెస్‌లో హోయలు పోయింది. సెగలు రేపే పోజులిస్తూ కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. కసి చూపులతో టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. నమ్రత ఇలాంటి హాట్ పోజులివ్వడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
అయితే ఐదు పదులు దాటిన ఈ బ్యూటీ సినిమాలు మానేసి చాలా కాలం అయినా, ఇప్పుడు హీరోయిన్లకి పోటీ ఇస్తుంది. ఫిట్‌నెస్ పరంగానూ తగ్గేదెలే అంటోంది. తరచూ జిమ్‌లో శ్రమిస్తుంటుంది. వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటోంది. మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉంటుంది.
Namrata Shirodkar
దీంతోపాటు తరచూ గ్లామర్ ఫోటో షూట్లు చేస్తుంది. తన ఫిట్‌నెస్‌ని, అందాన్ని ఆవిష్కరిస్తుంది. ఐదు పదుల వయసులోనూ తన అందం తగ్గలేదనే విషయాన్ని చాటి చెబుతుంది. యంగ్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తుంది నమ్రత. తాను ఇల్లాలు అయినా అందం విషయంలో తగ్గేదెలే అనిపించుకుంటుందీ మహేష్ వైఫ్.
Namrata Shirodkar
నమ్రత, మహేష్‌బాబు `వంశీ` చిత్ర సమయంలో ప్రేమించుకున్న విసయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకి వీరి పెళ్లిని సూపర్ స్టార్ కృష్ణ అంగీకరించారు. ఆ తర్వాత వీరంతా కలిసిపోయారు. వీరికి కుమారు గౌతమ్, కూతురు సితార ఉన్నారు. సితార ఓ వైపు స్టడీస్‌లో, మరోవైపు యాడ్స్ చేస్తూ రాణిస్తుంది. గౌతమ్ స్టడీస్‌లో దూసుకుపోతున్నాడు.