Namitha: బోల్డ్ అండ్ రొమాంటిక్.. బేబీ బంప్ తో నమిత, భర్తతో హాట్ ఫోజులు వైరల్
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత. నమిత బొద్దుగా ఉన్నప్పటికీ విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత. నమిత బొద్దుగా ఉన్నప్పటికీ విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ పై హాట్ గా కనిపిస్తూ గ్లామర్ డాల్ గా మారింది.
తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లో అయినప్పటికీ తన అందంతో షేక్ చేసింది. బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో నమిత అందాలని కుర్రాళ్ళు మరచిపోలేరు.
తమిళనాడులో అయితే నమిత కోసం అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. నమిత వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంది.
కొన్నేళ్ల క్రితం నమిత..వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం అన్యోన్యంగా జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో నమిత తరచుగా తన భర్తతో ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం నమిత గర్భవతి అనే విషయం తెలిసిందే. ఇటీవలే నమిత తాను త్వరలో తల్లిని కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బేబీ బంప్ ఫొటోలతో ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చింది. తాజాగా నమిత మరోసారి తన ఫోటోస్ షేర్ చేసింది. ఈ సారి తన భర్తతో రొమాంటిక్ గా, బోల్డ్ గా ఉన్న పిక్స్ షేర్ చేసింది. వైట్ హాట్ డ్రెస్ లో నమిత బేబీ బంప్ చూపిస్తూ భర్తతో ముద్దుల్లో మునిగితేలుతోంది.
నమిత, వీరేంద్ర మధ్య తొలిసారి పరిచయం అయిన రోజు సందర్భంగా ఈ ఫోటోస్ షేర్ చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కాస్త జోరు తగ్గినప్పటికీ నమిత నటన కొనసాగిస్తోంది.