చైతన్యను నేను పెంచలేదు, అఖిల్ వలె తను అలాంటి వాడు కాదు... స్టెప్ మదర్ అమల కామెంట్స్!
nagarjuna wife amala comments on step son naga chaitanya ksr నాగార్జున సతీమణి అమల కొడుకు అఖిల్, చైతన్యలను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చైతన్యను నేను పెంచలేదన్న అమల... అఖిల్ తో అతని అనుబంధం ఎలాంటిదో చెప్పుకొచ్చింది.
Amala Akkineni
కింగ్ నాగార్జునకు రెండు వివాహాలు. దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో ఆయనకు మొదటి వివాహం జరిగింది. వీరి సంతానం నాగ చైతన్య. మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. అనంతరం 1992లో హీరోయిన్ అమలను నాగార్జున రెండో వివాహం చేసుకున్నాడు.
లక్ష్మి కూడా రెండో వివాహం చేసుకుని చెన్నై లో సెటిల్ అయ్యింది. నాగ చైతన్య తల్లి వద్దే పెరిగాడు. అప్పుడప్పుడు నాన్న నాగార్జున వద్దకు వస్తూ ఉండేవాడట. నాగ చైతన్యను నాగార్జునే లాంచ్ చేశాడు. అక్కినేని వారసుడిగా వెండితెరకు పరిచయం చేశాడు.
రెండో భార్య అమలకు అఖిల్ పుట్టాడు. అఖిల్ సైతం హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సవతి తల్లి అమలతో అఖిల్ కి ఉన్న అనుబంధం గురించి తెలిసింది తక్కువే. ఎందుకంటే వీరు పెద్దగా కలిసి కనిపించిన దాఖలాలు లేవు. కేవలం ఫ్యామిలీ అందరు కలిసిన స్పెషల్ ఈవెంట్స్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు.
తాజా ఇంటర్వ్యూలో అమల స్టెప్ సన్ నాగ చైతన్య గురించి స్పందించారు. అమల మాట్లాడుతూ... నాగ చైతన్య నా వద్ద పెరగలేదు. చెన్నైలో వాళ్ళ అమ్మ వద్దే ఉండేవాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. నాన్నతోనే ఎక్కువ గడిపేవాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి.
అఖిల్-నాగ చైతన్య మధ్య మంచి బాండింగ్ ఉండేది. అఖిల్ కి చైతన్య ఓ మంచి అన్నయ్య. ఇక్కడికి వస్తే చైతూ వెనకాలే అఖిల్ తిరిగేవాడు. చిన్నప్పుడు చైతు ఎప్పుడు వస్తాడా అని అఖిల్ ఎదురు చూసేవాడు. నాగ చైతన్య నాటీ కాదు. అఖిల్ మాత్రం హైపర్ యాక్టీవ్.
వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతుంటే నాకు గుండెల్లో దడ మొదలవుతుంది. నాగార్జున మాదిరే చిత్ర ఫలితం నుండి ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడతారు... అని అమల వెల్లడించారు. ఆమె మాటలను బట్టి చూస్తే... చైతూకి అమలతో బలమైన అనుబంధం లేకపోయినా... అఖిల్ తో ఉందని తెలుస్తుంది.
నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది.