‘కూలీ’లో నాగ్ విలన్ కాదు కానీ..అంతకు మించి
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని విలన్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం.
కింగ్ నాగార్జున కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వైవిధ్యమే ఆయన్ను సుదీర్ధకాలం హీరోగా నిలబెట్టింది. ఈ వయస్సులో కూడా నవ మన్మధుడులా మెరిసిపోయే ఆయన ఇప్పుడు కొత్త పాత్రలు,కథలు కోసం పరితపిస్తూంటారు. రోజూ కొత్త కథలు వింటూంటారు. ఏ మాత్రం స్పార్క్ ఉన్నా వెంటనే ప్రాజెక్టు సైన్ చేసేస్తారు.
ఈ క్రమంలో ఇప్పటిదాకా చేయని ఓ కొత్త పాత్రలో మెరవనున్నారని కోలీవుడ్ సమాచారం..హీరోగా, నిర్మాతగా నాగార్జున ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇక రియాల్టీ షోల హోస్ట్‌గానూ మెరిసారు. తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో కుబేరా సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో నాగార్జునతో పాటు ధనుష్ కూడా ఉన్నాడు. ఇక నాగార్జున ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ఆ సినిమా మరేదో కాదు తమళ సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కూలీ’. ఈ సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్ లో నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా, నాగార్జున కూడా ఉంటారనేది తాజా అప్డేట్.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని విలన్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. విలన్ క్యారక్టర్ అదీ రజనీకి దీటుగా ఉండే పాత్ర కావడంతో నాగార్జున కూడా ఓకే చెప్పారంటున్నారు.
Nagarjuna Akkineni
ఈ సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ గా కనిపించనున్నారు. ఆయన్ని ఎదుర్కొనే పోలీస్ గా కనపడతారు అంటున్నారు. అయితే చాలా కర్కసమైన పాత్ర అని, చాలా వైలెంట్ గా ఉండి ఎదుటివారిలో దడ పుట్టించేలా డిజైన్ చేసారని చెప్పుకున్నారు. కరెప్టెడ్, క్రూయిల్ కలగలిసిన పాత్ర నాగ్ ది అని చెన్నై వర్గాల సమాచారం. రజనీ పాత్రను ముప్పు తిప్పలు పెడుతూ ఆ పాత్ర సాగుతుందని అంటున్నారు. నాగ్ నుంచిరజనీ తప్పించుకుని అతనికి ట్విస్ట్ ఇచ్చే సీన్స్ సెకండాఫ్ లో ఉంటాయంటున్నారు. నాగ్ కెరీర్ లో ఇది కొత్త అధ్యాయం అంటున్నారు. ఇది కనుక క్లిక్ అయితే ఆ తరహా పాత్రలు సైతం ఇక నాగ్ ని వెతుక్కుంటూ వస్తాయి.
Nagarjuna-Amala
ఇక లోకేష్ కనకరాజ్ కు ఓ హాబిట్ ఉంది. విలన్ పాత్రల్లో పేరున్న ఆర్టిస్ట్ లను పెడుతూంటారు. మాస్టర్, విక్రమ్ లో లో విజయ్ సేతుపతి, లియోలో సంజయ్ దత్, అలాగే విక్రమ్ చివర్లో వచ్చే సూర్య కూడా నెగిటివ్ పాత్రలో కనిపిస్తారు. అర్జున్ సైతం లియోలో నెగిటివ్ క్యారక్టర్ లో కనపడ్డారు. దాంతో నాగార్జున ని సైతం ఏ రేంజిలో చూపెడతారనే ఆసక్తి అంతటా మొదలైంది. అన్బరివు స్టంట్స్, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇది. రజనీ 171వ సినిమా ఇది. ఇందులో నటిస్తున్నస్టార్స్ గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో తెలుగు హీరో నాగార్జున ఓ కీలక పాత్రని పోషిస్తున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఆ మధ్యన లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్‌కి వచ్చి నాగార్జునతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఇందులో రజనీకాంత్‌కి కూతురు పాత్ర కోసం శ్రుతిహాసన్ ఎంపికైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.