- Home
- Entertainment
- నాగార్జున హీరోయిన్లలో ఆ కొలతలు చూస్తాడా?.. అనుష్క, టబులని ఎంకరేజ్ చేయడం వెనక కారణం అదేనా?
నాగార్జున హీరోయిన్లలో ఆ కొలతలు చూస్తాడా?.. అనుష్క, టబులని ఎంకరేజ్ చేయడం వెనక కారణం అదేనా?
నాగార్జున ఎంతో మంది హీరోయిన్లని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు. అయితే ఆయన హీరోయిన్‌ని ఎంపిక చేసే ముందు ఆ కొలతలు చూసుకుంటాడట.

కింగ్ నాగార్జున మన్మథుడిలా చెలామణి అవుతున్నారు. కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పిలుస్తారు. హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో ఆయన తర్వాతే ఏ హీరో అయినా అనే ముద్ర పడిపోయింది. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇచ్చే అందం ఆయన సొంతం. ఆరు పదులు దాటిని ముప్పై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు నాగ్. ఇప్పటికీ అదే జోరు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన `నా సామి రంగ`లోనూ ఆ ఎలిమెంట్లలో రెచ్చిపోయాడు.
అయితే తన సినిమాల్లో హీరోయిన్లు తీసుకోవాలంటే ఆయన కచ్చితంగా కొన్ని ఎలిమెంట్లని ఫాలో అవుతాడట. హీరోయిన్లలో ఆ కొలతలు చూస్తాడట. అనుష్క, టబు వంటి హీరోయిన్లని ఎంకరేజ్ చేయడం వెనుక కారణం అదేనట. మరి ఇంతకి హీరోయిన్లలో చూస్తే ఆ కొలతలేంటి అనేది చూస్తే, అది ఆయన హైట్. నాగార్జున టాప్ హీరోయిన్లకి ప్రయారిటీ ఇస్తాడట.
నాగార్జున హైట్ ఎక్కువగా ఉంటాడు. సినిమాలో జోడీ కావాలంటే తన హైట్‌కి తగ్గ హీరోయిన్లని చూసుకుంటాడట. అందులో భాగంగానే టాల్ హీరోయిన్లని కోరుకుంటాడట. ఈ విషయాన్ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో తెలిపారు. టాల్ హీరోయిన్లని తీసుకోవడానికి కారణం అడగ్గా, తన హైట్‌కి మ్యాచ్ అయ్యే హీరోయిన్లతో నటించాలని తాను కోరుకుంటానని తెలిపారు. అలా అయితేనే తెరపై చూసినప్పుడు జోడీ బాగుంటుందన్నారు.
తాను నటించిన సినిమాల్లో చాలా మంది హీరోయిన్లు టాల్‌గానే ఉంటారని, అనుష్క, టబు, త్రిష, మమతా మోహన్ దాస్ వంటి హీరోయిన్లని ఆయన ఈ లక్షణాన్ని పరిగణలోకి తీసుకొనే ఎంపిక చేసినట్టు తెలిపారు. తన మ్యాచింగ్‌కి ఆయన ప్రయారిటీ ఇస్తానని చెప్పడం విశేషం. అదే కారణంతో టాల్ హీరోయిన్లని తీసుకుంటాడట మన్మథుడు. `సూపర్`, `రగడ`, `ఢమరుకం`, `డాన్` చిత్రాల్లో అనుష్కతో, `కింగ్`లో త్రిషతో, `నిన్నే పెళ్లాడతా`, `ఆవిడే మా ఆవిడా` చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పటి తరం హీరోయిన్ల గురించి ఆయన మాట్లాడుతూ, తనతో చేసేందుకు చాలా మంది కథానాయికలు నో చెబుతున్నారట. జోడీ కోసం అడిగితే ముఖం మీదే సార్ నాగ చైతన్యతో చేయాలనుకుంటున్నామని అంటున్నారట. పెద్ద హీరోలతో చేస్తే యంగ్ హీరోలతో నటించే ఆఫర్లు రావనే ఉద్దేశ్యంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారని తెలిపారు నాగ్. ఈ విషయంలో తమకు సమస్యలున్నట్టు చెప్పారు.
నాగార్జున ఈ సంక్రాంతికి హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత `నా సామిరంగ` సినిమాతో సక్సెస్ దక్కింది. ఇప్పుడు కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుందట. అలాగే ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల చిత్రంలో నటిస్తున్నారు. దీనికి `కుబేర` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.