MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?

Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?

సావిత్రి జీవిత నాశనం కావడానికి ఆమె భర్త, నటుడు జెమినీ గణేషన్‌, తమిళనాడుకి చెందిన ఓ పొలిటీషియన్‌ కారణమంటుంటారు. కానీ వీరిద్దరు కాకుండా మరో వ్యక్తి కూడా ఉన్నాడట. ఈ సంచలన విషయం బయటకు వచ్చింది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 06 2025, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎవర్‌ గ్రీన్‌ మహానటి సావిత్రి
Image Credit : Facebook/@mahanatiSavitri

ఎవర్‌ గ్రీన్‌ మహానటి సావిత్రి

మహానటి సావిత్రి మనకు దూరమై 44ఏళ్లు అవుతుంది. కానీ సావిత్రి ఇప్పటికీ మనల్ని తన సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఆమెకి సంబంధించిన చర్చ ఏదో రూపంలో జరుగుతూనే ఉంది. ఎవర్‌ గ్రీన్‌ నటిగా ఓ వెలుగు వెలిగింది సావిత్రి. హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కానీ కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంది. అప్పుడు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు ధీటుగా నటించి మెప్పించింది. సావిత్రితో సీన్‌ అంటే ఎస్వీఆర్‌, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు కూడా సీన్‌ పేపర్‌ ముందుగానే చూసుకునేవారట. ఆమెతో పోటీ పడటం కోసం ఆరాటపడేవారట. అదే సమయంలో భయపడేవారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
విషాదంగా ముగిసిన సావిత్రి జీవితం
Image Credit : Facebook/@mahanatiSavitri

విషాదంగా ముగిసిన సావిత్రి జీవితం

అంతటి గొప్ప నటిగా రాణించి వెలిగిన సావిత్రి జీవితం విషాదంగా ముగిసిన విషయం తెలిసింది. మందుకు బానిసై కోమాలోకి వెళ్లి చాలా దారుణమైన స్థితిలో ఆమె కన్నుమూశారు. అద్దాల మేడలో బంగారు అభరణాలతో, వెండి వైడుర్యాలతో వెలిగిన ఆమె రేకుల షెడ్డులో చివరి రోజులను గడిపే పరిస్థితి వచ్చింది. వేల కోట్లు సంపాదించిన సావిత్రి చివరికి ఏమీ లేకుండా పోయింది. కానీ ఆమె ఆస్తులను ఇప్పుడు ఆమె వారసులు అనుభవిస్తున్నారు. వాటి విలువ వందల, వేల కోట్లు ఉంటుందని సమాచారం.

36
సావిత్రి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌ మాత్రమే కాదు
Image Credit : Facebook/@mahanatiSavitri

సావిత్రి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌ మాత్రమే కాదు

ఇదిలా ఉంటే సావిత్రి లైఫ్‌ నాశనం కావడానికి అంతా అనుకునేది భర్త జెమినీ గణేషన్‌ మోసం చేయడమే అనుకుంటారు. ఆయన తనని కాదని మరో అమ్మాయితో తిరగడాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని చెబుతుంటారు. దీని కారణంగానే మందుకు బానిసైందని టాక్‌ నడుస్తోంది. దీనికితోడు సావిత్రి కొన్ని సినిమాల దర్శకత్వం వహించింది. నిర్మించింది. వాటి ద్వారా చాలా నష్టంపోయింది. కొందరు మోసం చేశారు. డబ్బులు తీసుకున్న వారు మోసం చేశారు. సినిమాల్లో సంపాదించినది తన బంధువుల పేరుతో భూములు కొట్టే వాళ్లు మోసం చేశారు. ఇలా ప్రతి దశలో మోసానికి గురయ్యంది సావిత్రి. ఆమె మంచితనం, ఆమాయకత్వమే ఈ మోసానికి కారణమంటుంటారు.

46
పొలిటీషియన్‌ కన్ను
Image Credit : Facebook/@mahanatiSavitri

పొలిటీషియన్‌ కన్ను

ఇదిలా ఉంటే భర్త జెమినీ గణేషన్‌తో గొడవల సమయంలోనే తమిళనాడులోని ఓ రాజకీయ నాయకుడు ఆమెపై మోజుపడ్డాడని సావిత్రి వద్ద పనిచేసిన ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన సంచలన నిజాలను వెల్లడించారు. జెమినీ గణేషన్‌.. సావిత్రిని మూడో భార్యగా చేసుకున్నాడట. అప్పటికే ఆయనకు అలిమేలు, పుష్పవల్లి ఉన్నారని, మొదట ఆ విషయం సావిత్రికి తెలియదని, ఆ తర్వాత తెలిసినా ఏం చేయలేకపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా సావిత్రి లైఫ్‌ డిస్టర్బ్ కావడానికి జెమినీ గణేషన్‌ మాత్రమే కాదు, మరో రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడని తెలిపారు. జెమినీ గణేషన్‌తో గొడవ అనంతరం ఒంటరిగానే ఒంటరిగానే ఉంది. ఆ సమయంలోనే ఓ పొలిటీషియన్‌ ఆమెపై కన్నేశాడట. తనని లోబరుచుకోవాలని చూశాడట. అందుకు సావిత్రి నో చెప్పిందట. దీంతో ఆమెపై కక్ష్య కట్టాడని, అందువల్లే ఐటీ రైడ్స్ చేయించాడని తెలిపారు సీనియర్‌ జర్నలిస్ట్ రామారావు.

56
మూడో వ్యక్తి ఎవరు
Image Credit : Facebook/@mahanatiSavitri

మూడో వ్యక్తి ఎవరు

ఓ వైపు భర్త మోసం, మరోవైపు ఈ ఐటీ రైడ్స్ తో ఉక్కిరిబిక్కిరయ్యింది సావిత్రి. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడింది. ఆ డిప్రెషన్‌లోనే మందుకి బానిసైందని ఆయన తెలిపారు. అయితే వీరిద్దరే కాదు, మరో అజ్ఞాత వ్యక్తి కూడా సావిత్రి జీవితంలో ఉన్నాడట. మలయాళ కెమెరామెన్‌ శేఖర్‌ అనే వ్యక్తి కూడా సావిత్రి జీవితం తలక్రిందులు కావడానికి కారణమట. ఈ విషయాన్ని వింజమూరి వెంకట అప్పారావు అనే వ్యక్తి తన ఫేస్‌ బుక్‌లో రాసుకొచ్చారు.

66
కెమెరామెన్‌ శేఖర్‌ ఎవరు?
Image Credit : times of india

కెమెరామెన్‌ శేఖర్‌ ఎవరు?

``సావిత్రి దుస్థితికి కారణం జెమినీ గణేశన్ అని చాల మందికి ఒక అపోహ, అది కాకుండా ఆవిడా చనిపోయేటప్పుడు జెమిని పక్కనే ఉన్నాడు. పెద్ద కూతురు కూడా ఉంది. సావిత్రి తాగుడు కు బానిస కావడం వల్ల ఆమె ఆ స్థితికి దిగజారిపోయింది. ఆర్థికంగా దెబ్బతినడం అన్నది కూడా నిజం. సినిమాలు సొంతంగా దర్శకత్వంతోపాటు దానికి కారణం ఇంకో వ్యక్తి(శేఖర్ కెమరామెన్ ..మలయాళీ )అన్న సంగతి అప్పటి విలేకరులకు తెలుసు`` అని వెల్లడించారు. మరి ఆ శేఖర్‌ అనే వ్యక్తి ఏం చేశాడు? ఎలా మోసం చేశాడనేది తెలియాల్సి ఉంది. నేడు శనివారం(డిసెంబర్‌ 6) సావిత్రి 90వ జయంతి. ఈ సందర్భంగా ఈ అరుదైన విషయం బయటకు వచ్చింది. అయితే సావిత్రమ్మ 90వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో వేడుకలను నిర్వహిస్తున్నారు ఆమె కూతురు విజయ చాముండేశ్వరి. ఈ సందర్భంగా `మహానటి` సినిమాని తీసిన దర్శక, నిర్మాతలను ఆమె సత్కరించబోతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సావిత్రి (నటి)
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image2
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image3
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Related Stories
Recommended image1
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం
Recommended image2
Akhanda 2 Release పై మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన నిర్మాతలు.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved