MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijayashanti : చావు బ్రతుకుల్లో ఉండి కూడా విజయశాంతి తో సినిమా చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

Vijayashanti : చావు బ్రతుకుల్లో ఉండి కూడా విజయశాంతి తో సినిమా చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఏహీరోయిన్ చేయని సాహసం చేసింది సీనియర్ తార. విజయశాంతిమాత్రమే సినిమా చేయగలదని నమ్మి.. చావుబ్రతుకుల్లో కూడా ఆమెతో సినిమా చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 26 2026, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
చిన్న వయసులోనే హీరోయిన్ గా..
Image Credit : our own

చిన్న వయసులోనే హీరోయిన్ గా..

దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా తెలుగు వెండితెరను ఏలిన విజయశాంతి చాలా చిన్నవయసులోనే ఇండస్టరీలోకి వచ్చింది. 15 ఏళ్లకే తమిళ సినిమాలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ ను తన అందం, నటనతో మెప్పించింది విజయశాంతి. ఆతరువాత తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అంతే కాదు చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది విజయశాంతి.

27
చిరంజీవి, బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు
Image Credit : stockPhoto

చిరంజీవి, బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు

సౌత్ లో తిరుగులేని ఇమేజ్ ను సాధించిన విజయశాంతి.. టాలీవుడ్ స్టార్ హీరోల జంటగా వరుస సినిమాల్లో మెరిసింది. తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, సుమన్, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ లాంటి హీరోలతో నటించిమెప్పించింది విజయశాంతి. ఇక తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఏకంగా 19 సినిమాలు.. బాలకృష్ణ జంటగా 16 సినిమాల్లో నటించింది. ఇక చిరంజీవి డ్యాన్స్ కు పోటీ ఇచ్చిన హీరోయిన్లలో విజయశాంతి కూడా ఒకరు.

Related Articles

Related image1
Udaya Bhanu : నన్ను తొక్కేశారు, ఇండస్ట్రీలో ఎదగనివ్వలేదు.. యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్
Related image2
Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి
37
చిరంజీవి, బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు
Image Credit : our own

చిరంజీవి, బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు

సౌత్ లో తిరుగులేని ఇమేజ్ ను సాధించిన విజయశాంతి.. టాలీవుడ్ స్టార్ హీరోల జంటగా వరుస సినిమాల్లో మెరిసింది. తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, సుమన్, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ లాంటి హీరోలతో నటించిమెప్పించింది విజయశాంతి. ఇక తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఏకంగా 19 సినిమాలు.. బాలకృష్ణ జంటగా 16 సినిమాల్లో నటించింది. ఇక చిరంజీవి డ్యాన్స్ కు పోటీ ఇచ్చిన హీరోయిన్లలో విజయశాంతి కూడా ఒకరు.

47
మాస్ పాత్రల్లో మెరిసిన విజయశాంతి..
Image Credit : Asianet News

మాస్ పాత్రల్లో మెరిసిన విజయశాంతి..

హీరోయిన్ గా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఆమె లేడీ ఓరియెంటెడ్, మాస్ యాక్షన్ సినిమాల్లో కూడా నటించి విజయం సాధించింది విజయశాంతి. అంతే కాదు విమెన్ సెంట్రిక్ మూవీస్ హిట్ అవ్వవు అనే అపోహ ఉన్న రోజుల్లో.. స్టార్ హీరోల సినిమాలకంటే ఎక్కువ సక్సెస్ సాధించి.. ఎక్కువ హిట్లు కొట్టిన ఘనత విజయశాంతిదే. అందుకే ఆమెను లేడీ అమితాబచ్చ, లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు.

57
విజయశాంతి కి లైఫ్ ఇచ్చిన దర్శకుడు..
Image Credit : Asianet News

విజయశాంతి కి లైఫ్ ఇచ్చిన దర్శకుడు..

విజయశాంతి ఎన్ని సినిమాలు చేసినా.. ఆమె కెరీర్ ను ఓ స్థాయిలోకి తీసుకెళ్లిన దర్శకుడు మాత్రం ఒకరే ఉన్నారు. ఆయన టీ. కృష్ణ. 1885 లో రిలీజ్ అయిన ప్రతిఘటన సినిమాతో విజయశాంతి కెరీర్ ను ఆయన పూర్తిగా మార్చేశారు. ఈసినిమాతోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ప్రాణం పోశారు. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ ను చేసిన దర్శకుడు ఈయన. ప్రస్తుతం టాలీవుడ్ హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ తండ్రి టి. కృష్ణ. కమర్షియల్ హీరోయిన్ గా బిజీగా ఉన్న విజయశాంతి.. డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోతే.. ఎన్నిరోజులైనా వెయిట్ చేస్తానని చెప్పారట కృష్ణ. ఈ సినిమా నువ్వే చేయాలమ్మ.. లేకపోతే అసలు ఈసినిమానే చేయను అని పట్టు పట్టి ప్రతిఘనట తీశారు. ఈసినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

67
చావు బ్రతుకుల్లో ఉండి కూడా..
Image Credit : T Krishna

చావు బ్రతుకుల్లో ఉండి కూడా..

విజయశాంతితో ప్రతిఘటన సినిమా చేసి.. ఆమె ఇమేజ్ ను కంప్లీట్ గా మార్చేశాడు కృష్ణ. ఆయన చేసింద చాలా తక్కవ సినిమాలే అయినా.. ఇండస్ట్రీపై, సమాజాంపై ఆయన ప్రభావం మాత్రం చాలా ఉంది. ఇక కృష్ణ చాలా చిన్నవయసులోనే క్యాన్సర్ తో మరణించారు. ఆయన చివరి సినిమా రేపటి పౌరులు కూడా విజయశాంతితోనే చేశారు. ఈ సినిమా టైమ్ లోనే కృష్ణ ఆరోగ్యం బాగా క్షీణించింది. క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్నా కూడా లెక్క చేయకుండా స్ట్రెచర్ మీద ఉండి ఆయన ఈసినిమాను కంప్లీట్ చేశారు. సినిమా అంటే అంత ప్రాణంగా ఉండేవారు టి.కృష్ణ.

చిన్న వయసులో మరణించిన దర్శకుడు..

ఈమూవీ షూటింగ్ టైమ్ లో విజయశాంతి సీన్ సరిగ్గా చేయలేదని గట్టిగా మందలించారట కూడా. అప్పుడు ఆమె కాస్త టైమ్ తీసుకుని మళ్లీ రీ ఫ్రెష్ అయ్యి.. సింగిల్ టేక్ లో ఆ సీన్ కంప్లీట్ చేసింది. 36 ఏళ్ల అతి చిన్న వయసులో టీ.కృష్ణ క్యాన్సర్ తో మరణించారు. నన్ను చాలా ప్రేమగా.. సొంత చెల్లెలికంటే ఎక్కువగా చూసకునేవారు. ఆయన మాత్రమే కాదు ఆయన ఫ్యామిలీ కూడా నన్న వాళ్ళ ఇంట్ల వ్యక్తిగా ప్రేమించేవారు. నాతండ్రి మరణం తరువాత.. నేను అంతలా బాధపడింది.. కృష్ణగారు చనిపోయిన రోజే '' అని విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

77
విజయశాంతి రీ ఎంట్రీలో...
Image Credit : our own

విజయశాంతి రీ ఎంట్రీలో...

లాంగ్ గ్యాప్ తరువాత 2020లో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె కీలకమైన పాత్రను ఆమె పోషించారు. రీ ఎంట్రీలో చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు విజయశాంతి. వచ్చిన ప్రతీ అవకాశానికి ఒకే చెప్పకుండా సెలక్టీవ్ గా వెళ్తున్నారు. రీసెంట్ గా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఐపీఎస్ వైజయంతిగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాతో మరోసారి ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు విజయశాంతి. సినిమాలు చేసే టైమ్ లేదని ఓ ఇంటర్వ్యలో చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kajol Kiss Scene: 30 ఏళ్ల `నో కిస్సింగ్‌` రూల్ బ్రేక్ చేసిన కాజోల్.. ఆ ముద్దు సీన్ వెనుక సీక్రెట్
Recommended image2
Laila : 30 సెకన్లు కూడా నవ్వు ఆపుకోలేని వింత వ్యాధి, లైలాకు నవ్వే శాపమైందా?
Recommended image3
Sreeleela: పాటలు హిట్టు, సినిమాలు ఫట్టు... శ్రీలీలకు ఏమైంది? బాలీవుడ్‌లో నూ తప్పని బ్యాడ్ లక్
Related Stories
Recommended image1
Udaya Bhanu : నన్ను తొక్కేశారు, ఇండస్ట్రీలో ఎదగనివ్వలేదు.. యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్
Recommended image2
Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved