- Home
- Entertainment
- Nagarjuna: ఇండియాలో అత్యంత సంపన్నుడు నాగ్.. స్టూడియోలు, కార్లు, బిజినెస్‌లు.. వేలకోట్లకు అధిపతి..
Nagarjuna: ఇండియాలో అత్యంత సంపన్నుడు నాగ్.. స్టూడియోలు, కార్లు, బిజినెస్‌లు.. వేలకోట్లకు అధిపతి..
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున.. వేల కోట్లకు అధిపతి. ఆయనకు చాలా వరకు నాన్న ఏఎన్నార్ నుంచి వస్తే, తను స్వతహాగా బాగానే కూడపెట్టారు. ఇండియన్ రిచెస్ట్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నారు.

కింగ్ నాగార్జున నేడు 64వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మన్మథుడు నాగ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రధానమైనది ఆస్తులు. సినిమా స్టార్స్ ఆస్తుల వివరాలు ఆడియెన్స్ లో, జనాల్లో ఒకరకమైన క్యూరియాటి ఉంటుంది. అందుకే నాగ్‌కి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాగార్జున ఆస్తుల విలువ తెలిస్తే మాత్రం నిజంగానే మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే. వేల కోట్లకి అధిపతిగా రాణిస్తున్నారు నాగ్. ఓ వైపు హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, బ్రాండ్ అంబాసిడర్‌గా, హోస్ట్ గా, డిస్ట్రిబ్యూటర్‌గా, రియల్ ఎస్టేట్ రంగంలోనూ సంపాదిస్తున్నారు నాగ్. మల్టీ బిజినెస్‌లు ఆయన సొంతం. అందుకే ఆయన ఆస్తులు, సంపాదన ఆశ్చర్యపరిచేలా ఉంటుంది.
నిజానికి నాగార్జున హీరోగా తీసుకునే పారితోషికం తక్కువే. మిగిలిన స్టార్స్ కంటే తక్కువగానే తీసుకుంటారు. ఒక్కో సినిమాకి ఆయనకు పది కోట్ల లోపే తీసుకుంటారు. బిగ్ బాస్ షోకి కూడా 20కోట్ల లోపే ఉంటుంది. నటన ద్వారా నాగార్జునకి వచ్చేది ముప్పై, నలభై కోట్ల లోపే. అయితే కమర్షియల్ యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తాడు. ఆయనకు గతంలో ఐదారు ప్రొడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసేవారు. ఒక్కో యాడ్‌కి రెండు మూడు కోట్లు పారితోషికం తీసుకునేవారు. ఇప్పుడు తగ్గిపోయాయి. కళ్యాణ్ జ్యూవెల్లరీకి మాత్రమే చేస్తున్నారని సమాచారం.
ఇక స్టూడియోస్ ద్వారా బాగానే సంపాదిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు మూడు స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్, ఎన్ కన్వెన్షన్ సెంటర్. వీటిల్లో సినిమా ఓపెనింగ్‌లు, షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సీజీ వర్క్ జరుగుతుంటాయి. టీవీ షోస్ కూడా ఇందులోనే చేస్తుంటారు. అన్నపూర్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సినిమాలు నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నిర్మాతగా పెద్దగా లాభాలు లేవు. చాలా వరకు తగ్గించారు.
దీంతోపాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫిల్మ్ స్కూల్‌ని నడిపిస్తున్నారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, స్టాండర్డ్స్ ని అందిస్తున్నారు. ఇది కూడా బాగానే రన్ అవుతుంది. వీటి ద్వారా కోట్ల లాభాలు పొందుతున్నారు. రియల్ ఎస్టేట్ మరో ప్రధానమైన వ్యాపారం. దీని ద్వారా బాగానే సంపాదిస్తున్నారు నాగ్. భారీగా ఆస్తులు కొనిపెట్టారు. వీటితోపాటు పబ్‌లు, హోటల్స్ కూడా రన్ చేశారు. కానీ ఇప్పుడు తగ్గినట్టు సమాచారం.
నాగార్జునకి లగ్జరీ కార్లున్నాయి. బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ 7 సిరీస్, బెంజ్ కార్లున్నాయి. రేంజ్ రోవర్, స్పోర్ట్స్ కార్లున్నాయి. ఒక జెట్ ఫ్లైట్ కూడా ఉంది. అలాగే హైదరాబాద్‌లో ఉన్న లగ్జరీ ఇళ్లు విలువ రూ.యాభై కోట్లు ఉంటుందని టాక్. వీటన్ని విలువల వంద కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయితే మొత్తం నాగార్జున ఆస్తుల విలువ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వారసత్వంగా వచ్చిన స్టూడియోలు, రియల్ ఎస్టేట్స్ లతో సహా సొంతంగా సంపాదించిందన్నీ కలిపితే మూడు నుంచి నాలుగు వేల కోట్లకు నాగార్జున అధిపతి అవుతారు.
హీరోగా వరుస ఫెయిల్యూర్స్ చూస్తున్నారు నాగ్. ఇటీవల ఆయన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. గతేడాది `ది ఘోస్ట్` చిత్రంతో వచ్చారు. అది డిజప్పాయింట్ చేసింది. దీంతో కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు నాగార్జున. ప్రస్తుతం ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా `నా సామి రంగ` అనే చిత్రాన్ని ప్రకటించారు. దీంతోపాటు ధనుష్, శేఖర్ కమ్ముల చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్‌లో `బిగ్ బాస్ 7` సీజన్ ప్రారంభం కాబోతుంది.