- Home
- Entertainment
- Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం
Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం
బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ మారిపోయాడు. ప్రారంభంలో తనూజని అనుకున్నారు. మధ్యలో ఇమ్మాన్యుయెల్‌ని చేయాలనుకున్నారు. మరి ఇప్పుడు ఎవరిని విజేతని చేయాలనుకుంటున్నారో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 9 బెస్ట్ ఎంటర్‌టైనర్ ఇమ్మాన్యుయెల్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఇంకా మూడు రోజులే ఉంది. ఈ సీజన్‌లో బిగ్ బాస్ షో ప్రారంభంలో తేలిపోయినా క్రమంగా రసవత్తరంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా పదో వారం తర్వాత ఆద్యంతం రక్తికట్టేలా సాగింది. షోని బాగా ఎంటర్‌టైన్ చేసిందంటే ఇమ్మాన్యుయెల్ అనే చెప్పాలి. ఆయన లేకపోతే మరింత బోరింగ్‌గా ఉండేదని చెప్పడంలో, షో డిజాస్టర్ అయ్యేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బుధవారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కూడా ఇమ్మాన్యుయెల్ చేసిన ఎంటర్టైన్‌మెంట్‌ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
కళ్యాణ్ పడాల విన్నర్ కావాలని ఆడియెన్స్ డిమాండ్
ఇక ఫైనల్ వీక్ నడుస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు విన్నర్‌కి సంబంధించిన ప్రిడిక్షన్ ఎక్కువైపోయింది. 9వ సీజన్ విన్నర్ ఎవరనేదానిపై ఎవరికి వాళ్లు అంచనా వేస్తున్నారు. ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అందరి నుంచి వినిపించే మాట కళ్యాణ్ పడాల ఈ సారి విన్నర్ అని. ఆయనకు ఓటింగ్ పడుతున్న తీరుని చూసి ఈ సీజన్ విజేత అంటున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ఇదే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తోంది. ఏసియానెట్ ఇంతకు ముందే చెప్పినట్టు బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది ముందే నిర్ణయిస్తారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు ముందుగా ఒకరిని ఫిక్స్ అవుతారు. వాళ్లు ఎవరిని చేయాలనుకుంటే వాళ్లనే విన్నర్‌గా ప్రకటిస్తారు. ఓటింగ్‌తో పనిలేదు. కాకపోతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరనేది అంచనా వేసుకుని వాళ్లు ఓ నిర్ణయానికి వస్తారని విశ్వసనీయ సమాచారం.
బిగ్ బాస్ నిర్వాహకులు మొదట అనుకున్న విన్నర్ తనూజ
ఈ క్రమంలో ఇప్పుడు ఈ సీజన్ విన్నర్ ఎవరనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో క్రేజీ విషయం లీక్ అయ్యింది. ఈ సీజన్ విన్నర్‌ని ముందుగానే నిర్ణయించారట. అయితే అందులో చిన్న మార్పు చేసినట్టు సమాచారం. బిగ్ బాస్ విన్నర్ కి సంబంధించి మొదట తనూజని చేయాలనుకున్నారు. ఆమె స్టార్ మా బిడ్డ. ఎందుకంటే తనూజ స్టార్ మాలోనే సీరియల్స్ చేసింది. మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు షోలో కూడా ఆమెకి పాజిటివ్ నేమ్ ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ముద్ర పడింది. దీనికితోడు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు లేడీ కంటెస్టెంట్‌కి కప్ ఇవ్వలేదు. కేవలం ఓటీటీ షోలోనే ఇచ్చారు. ఒకసారి శ్రీముఖి రన్నరప్ అయ్యింది. దీంతో ఈ సారి తనూజకి ఇవ్వాలని అనుకున్నారట.
ఆ తర్వాత టైటిల్ రేసులోకి ఇమ్మాన్యుయెల్
ఆ తర్వాత నిర్వాహకుల ఆలోచన మారిపోయింది. అన్ని సీజన్లతో పోల్చితే ఈ సీజన్‌లో ఇమ్మాన్యుయెల్ బాగా ఎంటర్టైన్ చేశాడు. బెస్ట్ ఎంటర్టైనర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చివరి వారంలో కూడా హౌజ్‌ని అల్లాడిస్తున్నాడు. దీంతో ఆయన్ని విన్నర్‌ని చేయాలని భావించారట. కానీ ఇప్పుడు చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. ఇమ్మాన్యుయెల్ ని రన్నరప్‌గానే చేయబోతున్నారట. విన్నర్ మారిపోయాడని తెలుస్తోంది.
తనూజనే ఈ సీజన్ విన్నర్?
ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకుల ఆలోచన ప్రకారం తనూజనే విన్నర్ అని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనూజని విన్నర్‌గా ఫిక్స్ అయ్యారట. అయితే ఇదే నిర్ణయానికి కట్టుపడి ఉంటారా? లేక చివరి నిమిషంలో ఏదైనా మార్పు చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే ఆడియెన్స్ నుంచి ఒత్తిడి వేరేలా ఉంది. అంతా కళ్యాణ్ పడాల విన్నర్‌గా చెబుతున్నారు. ఓటింగ్ ఆయనకే ఎక్కువగా పడుతుంది. దీంతో చివరి నిమిషంలో తమ ఆలోచన మార్చుకుంటారా? అనేది చూడాలి.
ఆడియెన్స్ ఓటింగ్‌తో నిర్వాహకులు పనిలేదా?
అయితే జనం అంతా కళ్యాణ్‌ని విన్నర్‌గా చూడాలనుకుంటుంది. ఆయన కోసం చాలా మంది స్వతంత్య్రంగా ఓటింగ్ చేస్తున్నారు. ఈ సారి కూడా కామన్ మ్యాన్ విన్నర్‌గా కావాలనుకుంటున్నారు. అదే జరిగితే బిగ్ బాస్ షోకి కూడా క్రేజ్ పెరుగుతుంది. గతంలో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినప్పుడు షోకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. భారీ రీటింగ్‌ని తీసుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడియెన్స్ డిమాండ్‌ని కాదని తనూజని విన్నర్ ని చేస్తే తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పైగా స్టార్ మా బిడ్డనే విన్నర్‌ని చేసుకున్నారనే కామెంట్లు వస్తాయి. మరి దీన్ని సీరియస్‌గా తీసుకుంటారా? లేక తాము అనుకున్న నిర్ణయానికి కట్టబడి ఉంటారా? అనేది చూడాలి. అదే సమయంలో తనూజని విన్నర్‌ని చేస్తే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినవాళ్లు అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

