తాత ఏఎన్నార్ రొమాన్స్ ముందు నాగ్ మామ సరిపోడు.. చివరి రోజుల్లో ఆసుపత్రిలో నర్స్ తో కూడా
అక్కినేని హీరోల్లో నాగార్జున పెద్ద రొమాంటిక్ అంటుంటారు. ఇండస్ట్రీలోనే ఆయన్ని రొమాంటిక్ హీరోగా చెబుతుంటారు. కానీ అసలు రొమాంటిక్ ఏఎన్నార్ అట.
అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) తెలుగు సినిమా దశ దిశని మార్చిన నటుల్లో ఒకరు. తొలి తరం నటుడిగా ప్రారంభమై, మూడో తరం నటులతోనూ నటించిన ప్రత్యేకత ఆయన సొంతం. రెండు వందల ఇరవైకి పైగా సినిమాలు చేసి మెప్పించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. పదేళ్ల క్రితం ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు చాలా రొమాంటిక్ అంటుంటారు. అయితే అది స్టార్ట్ అయ్యింది నాగార్జున నుంచి. ఏఎన్నార్ కూడా అలాంటి సరదా సినిమాలు చేశారు? కానీ కొడుకు నాగార్జున మాత్రమే ఆ ట్యాగ్‌ని సొంతం చేసుకున్నారు.
రొమాంటిక్ లవ్ స్టోరీస్‌లో అంతగా రక్తికట్టించడమే అందుకు కారణమని, `నిన్నే పెళ్లాడతా`, `మన్మథుడు`, `సంతోషం` వంటి సినిమాల వల్లే ఆయనకు ఆ ట్యాగ్ దక్కిందని చెప్పొచ్చు. నాగ్ ఎలాంటి సినిమా చేసినా ఆయన మార్క్ రొమాన్స్ ఉండాల్సిందే.
అయితే నాగ్ ఎంత రొమాంటిక్ అయినా, ఆయనకు ఎంత మన్మథుడు అని ట్యాగ్ ఉన్నా, అసలు రొమాంటిక్ నాగ్ కాదట. అక్కినేని నాగేశ్వరరావు అసలైన రొమాంటిక్ అట. తాత ఏఎన్నార్ రొమాన్స్ ముందు నాగ్ మామ తేలిపోవాల్సిందే అంటున్నాడు హీరో సుమంత్. ఏఎన్నార్ పెద్ద కూతురు కొడుకు,
హీరో సుమంత్ అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి మెప్పించిన ఆయన ఇటీవల కాస్త డౌన్ అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుని బలమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. అటు హీరోగా, ఇటు కీలక పాత్రలు చేసి మెప్పిస్తున్నారు.
సుమంత్ అలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు. నాగ్, ఏఎన్నార్‌లు రొమాన్స్ లో ఎవరు తోపు అని అలీ అడగా, ఏమాటకి ఆ మాటే చెప్పాలి, తాను డిప్లామాటిక్‌గా ఆన్సర్ ఇవ్వను అంటూనే తాతనే పెద్ద రొమాంటిక్ అని చెప్పేశాడు సుమంత్.
నాగ్ కంటే ఏఎన్నారే ఆ విషయంలో తోపు అన్నారు. హీరోయిన్లని సరదాగా జోకులు వేస్తారు, చిలిపిగా కామెంట్లు చేస్తాడంటూ వెల్లడించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చివరి రోజుల్లో జరిగిన సంఘటన కూడా బయటపెట్టాడు సుమంత్.
క్యాన్సర్‌తో పోరాడుతున్న ఏఎన్నార్ చనిపోవడానికి ముందు ఆసుపత్రిలో ఉన్నారు. బెడ్‌పై చనిపోయే దశలో కూడా నర్స్ లతో చిలిపిగా మాట్లాడేవాడట. ఆసుపత్రిలో ఏఎన్నార్ ని చూసుకోవడానికి ఇద్దరు నర్సులు ఉండేవారట. ఆ దశలో కూడా వారితో సరసం ఆడేవాడట. వాళ్లతో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే తనకే ముచ్చటేసేదని,
ఆయన చనిపోతాడనే బాధ పోయి ఆ సందర్భాన్ని సరదాగా ఎంజాయ్ చేసేవాడిని అని తెలిపారు సుమంత్. ఆ ఏజ్‌లో, ఆ స్థితిలో కూడా అంత రొమాంటిక్ గా ఉండటం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయేవాడిని అని తెలిపారు సుమంత్. ఈ పాత వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏఎన్నార్ 2014 జనవరి 22న క్యాన్సర్‌తో కన్నుమూసి విషయం తెలిసిందే.
also read: చైతూ-శోభిత పెళ్లి వీడియో 50కోట్లకు అమ్మకం, క్లారిటీ ఇచ్చిన టీమ్.. ఏం చేయబోతున్నారంటే?