సినిమాలు మానేసి సన్యాసం తీసుకున్న నాగార్జున హీరోయిన్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో హిట్ సినిమాలు చేసిన ఓ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమాలు వదిలేయడమే కాదు, తన లైఫ్ లో పెళ్లి, ప్రేమ లాంటి రిలేషన్షిప్ లను పక్కన పెట్టి బ్రహ్మ కుమారిగా మారిపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ గుర్తు పట్టారా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ లో వెలుగు వెలిగిన చాలామంది హీరోయిన్లు ఆతరువాత కనిపించకుండాపోయారు. వారిలో కొంత మంది రకరకాలుగా సెటిల్ అయ్యారు. రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నవారు లేకపోలేదు. కొంత మంది పెళ్లిళ్లు చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యారు. అయితే కొంత మంది మాత్రం అసలు ఏం చేస్తున్నారు కూడా తెలియకుండా మాయం అయిపోయారు. ఇక ఓ హీరోయిన్ మాత్రం డిఫరెంట్ గా ఆలోచించింది. సన్యాసం తీసుకుని బ్రహ్మకుమారిగా మారిపోయింది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు. గ్రేసీ సింగ్. ఈ పేరు చెపితే ఎవరికి గుర్తు రాదు కాని.. నాగార్జున సంతోషం సినిమాలో హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకు వస్తుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. కాస్త గుర్తుండిపోయే మూవీస్ ను చేసింది గ్రేసీ సింగ్. తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించి, బాలీవుడ్‌లో ‘లగాన్’, ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ వంటి హిట్ చిత్రాల్లో కనిపించిన గ్రేసీ సింగ్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పింది.
గ్రేసీ సింగ్ తన కెరీర్‌లో నాగార్జున, మోహన్ బాబు, శ్రీకాంత్, అబ్బాస్, ఆకాష్, అర్జున్ లాంటి ప్రముఖ హీరోలతో కలిసి పని చేసింది. తెలుగులో సంతోషం సినిమాతో పాటు తప్పు చేసి పప్పు కూడు, రామ రామ కృష్ణ కృష్ణ, రామ్ దేవ్ వంటి చిత్రాల్లో కూడా ఆమె మెరిసింది. అయితే గత దశాబ్దకాలంగా ఆమె తెరపై కనిపించలేదు.
ఇప్పుడు గ్రేసీ సింగ్ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. పెళ్లి చేసుకోకుండా లైఫ్ టైమ్ బ్యాచిలర్ గా మారిపోయింది. ఆమె ప్రస్తుతం బ్రహ్మ కుమారీస్ సంస్థలో సభ్యురాలిగా కొనసాగుతోంది. తన జీవితం మొత్తం ధ్యానం, సేవ, యోగా వంటి కార్యక్రమాలకు అంకితమిచ్చిన గ్రేసీ, ఇప్పుడు పూర్తిగా బ్రహ్మ కుమారీగా మారిపోయింది.
ఇక గ్రేసీ సింగ్ ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అందులో ఆమె మాట్లాడుతూ – “ఇక్కడ నాకు అపారమైన ఆనందం, శాంతి లభిస్తోంది. నా అంతరాత్మకు ఇదే అవసరమైనదిగా అనిపిస్తుంది” అని చెప్పింది. ఇప్పుడు ఆమె ఆ సంస్థ ద్వారా నిర్వహించబడే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది. గ్రేసీ సింగ్ ప్రస్తుతం తాను ఎంచుకున్న మార్గంతో సంతృప్తిగా ఉన్నట్టు స్పష్టం చేసింది. జీవితంలో శాంతిని మించిన సంపద ఇంకేమీ లేదని చెబుతోంది. ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ మార్పుపై ఆడియన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.