- Home
- Entertainment
- Nagarjuna: బిగ్ బాస్ ఏం పీకలేడు అనుకున్నావా.. కోపంతో ఊగిపోయిన నాగార్జున, రౌడీ వేషాలు, చిల్లర కామెంట్లకు ఇచ్చిపడేశాడుగా
Nagarjuna: బిగ్ బాస్ ఏం పీకలేడు అనుకున్నావా.. కోపంతో ఊగిపోయిన నాగార్జున, రౌడీ వేషాలు, చిల్లర కామెంట్లకు ఇచ్చిపడేశాడుగా
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ స్టేజ్ పై ఉగ్రరూపం చూపించాడు కింగ్ నాగార్జున. లాస్ట్ వీక్ హౌస్‌లో జరిగిన పరిణామాలు, కంటెస్టెంట్స్ చేసిన ఓవర్ యాక్షన్‌ను ప్రస్తావిస్తూ ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాడు. హౌస్‌లో పిచ్చివేషాలు వేసిన ఎవరినీ వదిలిపెట్టలేదు.

కంటెస్టెంట్స్ కు ఇచ్చిపడేసిన నాగార్జున..
బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారం హౌస్‌మేట్స్ మధ్య జరిగే పోటీలు, వివాదాలు, గ్రూపిజం, నామినేషన్ల వేడి వారాంతానికి చేరేసరికి పతాక స్థాయికి చేరుకుంటాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ 'కింగ్' నాగార్జున ఎంట్రీ ఇచ్చి తప్పులు చేసిన కంటెస్టెంట్లకు క్లాస్ పీకడం, హౌస్‌లో జరిగిన పరిణామాలపై నిలదీయడం ఆనవాయితీ. తాజా ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హౌస్‌లో నిబంధనల ఉల్లంఘన, శృతిమించిన ప్రవర్తన, పర్సనల్ కామెంట్స్‌పై నాగ్ క్లాస్ అండ్ వార్నింగ్స్ ఈ ఎపిసోడ్ కుహైలెట్ అయ్యాయి.
ఇది బిగ్ బాస్ హౌసా? వీధి రౌడీల స్థావరమా?
వీకెండ్ ఎపిసోడ్‌లో హౌస్ అట్మాస్ఫియర్ ఒక్కసారిగా వేడెక్కింది. సీరియస్ లుక్‌తో స్టేజ్ మీదికి వచ్చిన నాగార్జున కంటెస్టెంట్లపై విరుచుకుపడ్డారు. "అసలు హౌస్‌లో ఏం జరుగుతోంది? వాట్ ది హెల్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? ఇది బిగ్ బాస్ హౌసా లేక వీధి రౌడీలు ఆడే స్థావరమా?" అని ప్రశ్నిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.
కంటెస్టెంట్లు టాస్క్‌లలో ఒకరినొకరు నెట్టేసుకోవడం, ఫిజికల్‌గా గాయపరుచుకోవడం, బూతులు తిట్టుకోవడంపై నాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం "రోహిత్, త్రిగుణ్, అమన్... గెట్ అవుట్ ఆఫ్ ది లివింగ్ రూమ్!" అంటూ వారిని లివింగ్ ఏరియా నుంచి గార్డెన్ ఏరియాకు పొమ్మన్నారు.
బిగ్ బాస్ ఏం పీకలేడు అనుకున్నావా? రోహిత్ కామెంట్ల రచ్చ..
రోహిత్ చేసిన పనికి నాగార్జునకు బాగా కోపం వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లోని సభ్యులందరూ బిగ్ బాస్‌ను, హౌస్‌ను గౌరవిస్తామని చెప్పి లోపలికి వచ్చారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ప్రసారం కాని ఒక ఎక్స్‌క్లూజివ్ వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు.
అందులో రోహిత్, చరణ్‌తో మాట్లాడుతూ బిగ్ బాస్ నియమాలను చులకనగా మాట్లాడటంతో పాటు, అసభ్య పదం వాడినట్లు కనిపెట్టారు. చరణ్‌ను సీక్రెట్ రూమ్‌కు పిలిచి నాగార్జున కన్‌ఫర్మ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ వీడియో చూపించి రోహిత్‌ను నిలదీశారు నాగ్.
రోహిత్ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షోను, హౌస్‌ను డిస్రెస్పెక్ట్ చేయడం ఎంతమాత్రం సహించేది కాదని, ఇటువంటి ప్రవర్తన ఏమాత్రం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. "బిగ్ బాస్ నన్ను ఏమీ పీకలేడు" అనే ఉద్దేశంతో మాట్లాడటం సరైంది కాదని మండిపడ్డారు. ఇటువంటి భావజాలం ఉన్నవారికి ఈ ఇంట్లో స్థానం లేదని స్పష్టం చేశారు.
రోహిత్‌ను "ప్లీజ్ లీవ్ మై హౌస్" అని ఆదేశిస్తూ బయటకు పొమ్మన్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి కఠిన హెచ్చరికలు అరుదుగా కనిపిస్తాయి. నాగార్జున తీసుకున్న ఈ తీవ్రమైన నిర్ణయం హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లకు , ప్రేక్షకులకు పెద్ద షాక్‌గా మారింది. తరువాత రోహిత్ బిగ్ బాస్ కు క్షమాపణలు చెప్పడంతో.. ఎల్లో కార్డుతో వార్నింగ్ ఇచ్చి.. రోహిత్ ను లోపలికి పిలిచాడు నాగ్.
ముకేశ్ మాటల తీరును నిలదీసిన నాగ్..
హౌస్‌లో ముకేశ్ మాట్లాడిన విధానంపై నాగార్జున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "కెప్టెన్షిప్ అనే వర్డ్‌ని మెయింటెన్ చేస్తున్నావా?" అని ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేలా మాట్లాడటం, చిన్నదో వైపు పెద్దదోవైపు అని అనడంపై ముకేశ్‌ను నాగార్జున ప్రశ్నించారు.
దీనిపై వివరణ ఇచ్చేందుకు ముకేశ్ ప్రయత్నించగా, హౌస్‌లోని దేబ్‌జాని, ఝాన్సీ కూడా అతని ప్రవర్తనను తప్పుబట్టారు. మాట జారితే ప్రేక్షకులు క్షమించరని, అందరికీ క్షమాపణ చెప్పాల్సిందేనని నాగార్జున స్పష్టం చేశారు.
కెప్టెన్ అపూర్వపై విరుచుకుపడిన నాగ్: "నువ్వు కెప్టెన్సీకే పనికిరావు"
హౌస్ మేట్స్ అందరినీ సమానంగా చూడాల్సిన కెప్టెన్ అపూర్వ ప్రవర్తనపై నాగార్జున సీరియస్ అయ్యారు. కెప్టెన్సీ రూమ్‌ను సొంతానికి, నచ్చిన గ్రూప్‌కే పరిమితం చేశారనే కోణంలో ఆమెను నిలదీశారు. "కెప్టెన్ రూమ్‌ను నువ్వు వాడిన విధానం కరెక్ట్ అని అనుకుంటున్నావా? నువ్వు మొత్తం హౌస్‌కి కెప్టెన్వా లేక కేవలం నీ రెడ్ టీమ్‌కి మాత్రమే కెప్టెన్వా? అసలు నువ్వు కెప్టెన్సీ బాధ్యతలకు ఏమాత్రం పనికిరావు!" అని సూటిగా విమర్శించారు. దీనికి అపూర్వ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి, పరిస్థితులను వివరించడానికి ప్రయత్నించినప్పటికీ నాగార్జున ఆమె వివరణను అంగీకరించకుండా కఠినంగానే ఇచ్చిపడేశారు.
అమన్‌కు యెల్లో కార్డ్ హెచ్చరిక
టాస్కుల సమయంలో అతిగా వ్యవహరిస్తూ, భౌతిక దాడులకు దిగుతున్న అమన్ వైఖరిపై నాగార్జున కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమన్‌కు నేరుగా 'యెల్లో కార్డ్' ఇస్తూ హెచ్చరించారు. "ఇది బిగ్ బాస్ హౌసా లేక బస్తీలో జరిగే గొడవా?" అని ప్రశ్నిస్తూ, ఆటలో తీవ్రమైన గాయాలు అయ్యేలా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. మరొకసారి ఇలాంటి ప్రవర్తన రిపిట్ అయితే, ఎటువంటి ప్రశ్నలు అడగకుండా, సమాధానాలు వినకుండా నేరుగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తానని తీవ్రంగా హెచ్చరించారు.
శాలినిపై పర్సనల్ కామెంట్స్ - బూతులపై ఫైర్
హౌస్‌లో మాటల హద్దులు దాటి ప్రవర్తించిన శాలిని తీరును నాగార్జున తీవ్రంగా ఖండించారు. టాస్క్ సమయంలో, గొడవల్లో శాలిని వాడిన అభ్యంతరకర పదజాలాన్ని నాగ్ వేదికపై ప్రస్తావించారు. "నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా శాలిని? 'వాట్ ది ఎఫ్ (What the F)' అని అనడం ఏంటి? హౌస్‌లో మీ బిహేవియర్, మాట్లాడే భాష చూసి ఆడియన్స్ అసహ్యించుకుంటే మీరు ఎక్కడ ఉండాలో వాళ్లే డిసైడ్ చేస్తారు!" అని హెచ్చరించారు. ఆవేశంలో నోరు జారానని, ఉద్దేశపూర్వకంగా అనలేదని శాలిని క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించింది.
అమన్, త్రిగుణ్‌లకు ఎల్లో కార్డ్ హెచ్చరికలు
టాస్క్‌లలో దిగజారి ప్రవర్తించిన అమన్, త్రిగుణ్‌లపై కూడా నాగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిజికల్ టాస్క్‌లు, డ్యాగర్స్ దక్కించుకునే క్రమంలో హద్దులు మీరడం, ఇతరులను ఇబ్బంది పెట్టడంపై నాగార్జున కడిగిపారేశారు. ప్రవర్తన మార్చుకోకపోతే 'రెడ్ కార్డ్' ఇచ్చి బయటకు పంపడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అమన్‌కు అప్పటికే ఎల్లో కార్డ్ ఇచ్చాడు నాగార్జున. ఈసారి అమన్ ఏదైనా తప్పు చేస్తే రెడ్ కార్డ్ ఇవ్వడం కాదు.. నేరుగా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
కన్నింగ్ రామ్‌ప్రసాద్‌పై క్లాస్: నామినేషన్ల చర్చపై ఫైర్
హౌస్‌లో కామెడీ పండిస్తూనే వెనుక వ్యూహాలు పన్నుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కమెడియన్ రామ్‌ప్రసాద్‌ను నాగార్జున నేరుగా నిలబెట్టారు. "నువ్వేమైనా పెద్ద పిస్తా అనుకుంటున్నావా? నామినేషన్ల గురించి బయట డిస్కస్ చేయవద్దని పోయిన వారమే స్పష్టంగా చెప్పాను... అయినా సరే నువ్వు అదే తప్పు మళ్లీ చేశావ్. అందుకే నిన్ను బయట ఆడియన్స్ 'కన్నింగ్ రామ్‌ప్రసాద్' అని ఎందుకు అంటున్నారో అర్థమవుతోంది!" అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.
రామ్‌ప్రసాద్ తాను కావాలని చర్చించలేదని, సందర్భానుసారంగా మాట్లాడానని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినా, హోస్ట్ నాగ్ ఆయన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత రామ్‌ప్రసాద్ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా ఇస్తున్నాడని మెచ్చుకున్నారు.
మొత్తానికి ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వకుండా, తప్పు చేసిన ప్రతి కంటెస్టెంట్‌ను ముఖం మీదే నిలదీశారు. నాగ్ ఇచ్చిన ఈ గట్టి డోస్‌తో హౌస్‌మేట్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మూడు ఎల్లో కార్డ్స్ తో ఈశనివారం ఎపిసోడ్ సీరియస్ గా సాగింది. ఈ వార్నింగ్స్ తర్వాత కంటెస్టెంట్ల ఆట తీరు మారే అవకాశం ఉందో లేదో రాబోయే రోజుల్లో తేలనుంది.

