- Home
- Entertainment
- Janhvi Kapoor: ఫేక్ వీడియోపై జాన్వీ కపూర్ సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్
Janhvi Kapoor: ఫేక్ వీడియోపై జాన్వీ కపూర్ సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్
Janhvi Kapoor: ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే పాటకు సంబంధించిన ఏఐ ఫేక్ వీడియోపై హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి షేర్ చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తీవ్రంగా స్పందించిన జాన్వీ కపూర్..
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' పాటను ఏఐ టెక్నాలజీతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంపై నటి జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం, వాటిని షేర్ చేయడం, ప్రమోట్ చేయడం ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయడమే అని ఆమె మండిపడ్డారు. ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాన్వీ హెచ్చరించారు.
ఆందోళనకరంగా ఏఐ టెక్నాలజీ..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ వీడియోల హవానే నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో రకరకాల ఏఐ కంటెంట్ వైరల్ అవుతోంది. టెక్నాలజీ ఎన్నో రంగాల్లో కొత్త అవకాశాలను తీసుకొచ్చినా, కొందరు దాన్ని ఇలా తప్పుగా వాడుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చ..
ఏఐ టెక్నాలజీని వాడి నటీనటుల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసే కేసులు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కేవలం ఫొటోలకే పరిమితం కాకుండా, 'దేవర' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'చుట్టమల్లే'ను కూడా ఏఐతో అసభ్యంగా మార్ఫింగ్ చేశారు. ఈ విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ ఏఐ వీడియోపై ఇప్పటికే 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఇలాంటి పనులకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని తారక్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు 'చుట్టమల్లే' వివాదంపై జాన్వీ కపూర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఏఐ టెక్నాలజీని ఇలా తప్పుగా వాడుకోవడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో విజ్ఞప్తి..
ఏఐతో క్రియేట్ చేసిన ఇలాంటి ఫేక్ వీడియోలను దయచేసి ఎవరూ తయారు చేయొద్దని జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా కోరారు. వాటిని ఇతరులకు షేర్ చేయొద్దని, ప్రమోట్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది ఏఐ టెక్నాలజీని స్పష్టంగా దుర్వినియోగం చేయడమేనని, ఇలాంటి పనులు చేసే వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని జాన్వీ కపూర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ నీచుల్ని అస్సలు వదలను ఎన్టీఆర్ వార్నింగ్
చుట్టమల్లె మార్ఫింగ్ వీడియోను రూపొందించిన వారిని తాను వదిలిపెట్టబోనని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఈ వీడియోను రూపొందించిన వారితో పాటు దాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వారిపై కూడా సాధ్యమైన ప్రతి చట్టపరమైన చర్య తీసుకుంటానని తెలిపారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ చూడవద్దని, షేర్ చేయవద్దని, దానితో ఎలాంటి విధంగానూ స్పందించవద్దని ప్రజలను కోరారు. ఈ రోజు మరొకరి తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె బాధితురాలైతే రేపు అదే పరిస్థితి మన కుటుంబంలోని మహిళలకు ఎదురుకావచ్చని ఎన్టీఆర్ హెచ్చరించారు.

