MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venu Swamy: వేణు ఉడుగుల కోసం వేణు స్వామి తన లైఫ్‌లో ఫస్ట్ టైమ్‌ చేసిన పని ఇదే.. చంద్రయాన్‌ గ్లింప్స్ ఎలా ఉందంటే?

Venu Swamy: వేణు ఉడుగుల కోసం వేణు స్వామి తన లైఫ్‌లో ఫస్ట్ టైమ్‌ చేసిన పని ఇదే.. చంద్రయాన్‌ గ్లింప్స్ ఎలా ఉందంటే?

ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి తాజాగా `చంద్రయాన్‌` మూవీ గ్లింప్స్ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చారు. ఇలా ఆయన సినిమా ఫంక్షన్‌కి అతిథిగా రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అది కూడా వేణు ఉడుగుల కోసం.

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 03 2026, 09:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేణు ఉడుగుల కోసం ఫస్ట్ టైమ్‌ వేణు స్వామి
Image Credit : Asianet News

వేణు ఉడుగుల కోసం ఫస్ట్ టైమ్‌ వేణు స్వామి

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఒకప్పుడు సినిమాల ఓపెనింగ్‌లకు పూజలు చేసేవారు. ఇప్పుడు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా మారిపోయారు. ఈ క్రమంలో ఆయన తన కెరీర్‌లో మొదటిసారి ఒక పనిచేశారు. ఒక మూవీకి గెస్ట్ గా రావడం. అది వేణు ఉడుగుల మూవీకి కావడం విశేషం. ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల సమర్పణలో తాజాగా `చంద్రయాన్‌` మూవీ రూపొందింది. వేణు ఉడుగుల అంతకు ముందు `రాజు వెడ్స్ రాంబాయి`కి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన సమర్పణలోనే `చంద్రయాన్‌` మూవీ తెరకెక్కింది. ఇందులో శివకుమార్‌ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్‌, లోకేష్‌, బలగం సత్యనారాయణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనాథ్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వంలో సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చంద్రయాన్‌ గ్లింప్స్ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

చంద్రయాన్‌ గ్లింప్స్ ఎలా ఉందంటే?

`చంద్రయాన్‌` మూవీ గ్లింప్స్ ని రిలీజ్‌ చేశారు. దీనికి వేణు స్వామి గెస్ట్ గా రావడం విశేషం. సినిమా ఈవెంట్లకి గెస్ట్ గా రావడం ఆయనకిది ఫస్ట్ టైమ్‌ కావడం విశేషం. అది కూడా వేణు ఉడుగుల కోసం. ఇక చంద్రయాన్‌ గ్లింప్స్ బాగుంది. ఊర్లో కొందరు ఫ్రెండ్స్ కలిసి చంద్రయాన్‌ ప్రయోగం చేయాలనుకుంటారు. రాకెట్‌ తయారు చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకుంటారు. మరి అది సక్సెస్‌ అయ్యిందా విఫలమయ్యిందా అనేది ఆసక్తికరం. టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది, ఫన్నీగా ఉంది. సినిమా కూడా ఇన్నోసెన్సీతో కూడిన కామెడీ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. వేణు ఉడుగుల సమర్పణలో వస్తోన్న మూవీ కావడంతో కచ్చితంగా ఇందులో మంచి కంటెంట్‌ ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. ఇక ఈ నెల 30న ఆడియెన్స్ ముందుకు సినిమా రాబోతుంది.

34
వేణు స్వామి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Image Credit : Asianet News

వేణు స్వామి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

ఈ క్రమంలో తాజాగా చంద్రయాన్‌ గ్లింప్స్ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన వేణు స్వామి మాట్లాడుతూ, ఈ మధ్య చిన్న చిత్రాలు తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాంటి హిట్ అవుతుంది. ఎందుకంటే గొప్ప నక్షత్రాల్లో పుట్టిన వారు ఈ సినిమా టీమ్ లో ఉన్నారు. మనం ప్రతి రోజూ చంద్రుడు, సూర్యుడిని చూస్తుంటాం. వేణు ఉడుగుల ప్రొడ్యూసర్ గా మారితే చంద్రుడు, డైరెక్టర్ గా మారితే సూర్యుడు అనుకోవచ్చు. మా కాంబోలో త్వరలో ఒక పెద్ద సినిమా చేయబోతున్నాం. కృతిక నక్షత్రయుక్త పౌర్ణమి కార్తీకమాసం అక్టోబర్ 30న రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోంది` అని తెలిపారు.

44
చంద్రయాన్‌ సినిమాపై వేణు ఉడుగుల కామెంట్‌
Image Credit : Asianet News

చంద్రయాన్‌ సినిమాపై వేణు ఉడుగుల కామెంట్‌

సమర్పకులు వేణు ఊడుగుల మాట్లాడుతూ, ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో పార్ట్ కావాలని అనిపించింది. ఈ టీమ్ నిజాయితీగా, ప్యాషన్ తో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారని నమ్మాను. ఇది రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. ఒక అర్థవంతమైన సినిమా. అలాగే ఈ చిత్రాన్ని కమర్షియల్ ఇంపాక్ట్ ఉన్న ట్రీట్‌ మెంట్ తో రూపొందించారు. వీళ్ల ప్రయత్నం అద్భుతంగా అనిపించింది. అమాయకులైన ఒక నలుగురు యువకులు రాకెట్ తయారు చేసుకుని స్పేస్ లోకి వెళ్లడం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

సైన్స్ తెలియకుండా, పెద్దగా చదువుకోకుండా ఏదో సాధించాలనే తపనతో నలుగురు యువకులు రాకెట్ తయారుచేయడం, స్పేస్ లోకి వెళ్లడం వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి. స్పేస్ లోకి వెళ్లేందుకు రాకెట్ తయారుచేసి స్పేస్ లోకి లాంఛ్ చేసే క్రమంలో చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. ఈ జర్నీలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, తెలుసుకున్న విషయాలను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ నెల 30న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా` అని అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ - మందమర్రి టు చందమామ, ఆగేది కాదు ఇది ఫుల్ హంగామా. ఈ హంగామా మిమ్మల్ని 2 గంటల 15 నిమిషాలు ఆగకుండా నవ్విస్తుంది. గ్లింప్స్ చూసి మా యాక్టర్స్ అమాయకులు అంటున్నారు. కానీ వీళ్లు అమాయకులే కాదు ధైర్యవంతులు కూడా. ఎవరైనా వీళ్లకు పాకిస్తాన్ మనల్ని ఇబ్బందిపెడుతుంది అంటే దాని మీద బాంబులు వేసి వస్తారు.

ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించరు. అంత ధైర్యవంతులు. వీళ్లు ఏమీ తెలియకుండా రాకెట్ ఎలా చేశారు, స్పేస్ కు ఎలా వెళ్లారు. ఎక్కాలు రాకుండా రాకెట్ కు కావాల్సిన లెక్కలు ఎలా చేశారు అనేది మీరంతా సినిమాలో చూడబోతున్నారు` అని చెప్పారు. ఇందులో టీమ్‌ పాల్గొని తమ ఆనందాన్ని, సినిమా అనుభవాలను పంచుకున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ 4వ వారం ఎలిమినేషన్‌.. గ్లామర్‌ బ్యూటీ ఔట్‌ ?
Recommended image2
Janhvi Kapoor: ఫేక్ వీడియోపై జాన్వీ కపూర్ సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్
Recommended image3
Akshara Haasan:10th క్లాస్ 3 సార్లు ఫెయిల్.. డైరెక్టర్ అవ్వడమే టార్గెట్, కమల్ హాసన్ చిన్న కూతురు ఓపెన్ కామెంట్స్
Related Stories
Recommended image1
Sigma Movie Review: సిగ్మా మూవీ రివ్యూ.. విజమ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ 4వ వారం ఎలిమినేషన్‌.. గ్లామర్‌ బ్యూటీ ఔట్‌ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved