Bigg Boss Telugu 7: తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్ మెంట్.. సందీప్, అమర్ దీప్‌ల దుమ్ముదులిపిన నాగార్జున
బిగ్ బాస్ తెలుగు కి సంబంధించి వీకెండ్ వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్లని ఓ ఆట ఆడుకుంటాడు. శనివారం గేమ్‌లో కూడా అందరి కంటెస్టెంట్లని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.
బిగ్ బాస్ తెలుగు కి సంబంధించి వీకెండ్ వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్లని ఓ ఆట ఆడుకుంటాడు. తప్పొప్పుల లెక్క తేలుస్తూ కంటెస్టెంట్ల బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. శనివారం గేమ్‌లో కూడా హోస్ట్ నాగార్జున అదే చేశాడు. అందరి కంటెస్టెంట్లని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. బాగా చేసిన వారిని ప్రశంసించాడు. ఈ వారం ఏం తప్పు చేశారు, ఎక్కడ రాంగ్ జరిగిందో అంతా తేల్చే పనిలో పడ్డారు. విడుదలైన ప్రోమోలను బట్టి చూస్తే ఈ సారి కూడా నాగ్.. గట్టిగానే ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సందీప్, అమర్ దీప్‌ల దుమ్ముదులిపారు.
ఇందులో స్మైల్ టాస్క్ విషయంలో శోభా శెట్టి స్టాండ్ తీసుకోలేదని చెప్పాడు నాగ్. దీని కారణంగానే తన బడ్డీ ప్రియాంక నష్టపోయినట్టు చెప్పారు. అయితే ప్రియాంక ఏదో సైగలు చేస్తుండగా కాస్త సీరియస్ అయ్యాడు నాగ్. అయినా ఫైనల్ రిజల్ట్ తేడా వచ్చిందని, స్టాండ్ తీసుకోకపోవడం బిగ్ మిస్టేక్ అని స్పష్టం చేశాడు.
అనంతరం శుభ శ్రీ, గౌతమ్ పెయిర్‌ని ఆడుకున్నారు. నీతో మాట్లాడనని చెబితే అది మానిప్యులేషనా? అని ప్రశ్నించాడు నాగ్. దీనికి శుభ శ్రీ స్పందిస్తూ, నా సైడ్ నుంచి ఏదైనా చెబుతూ ఆయన తీసుకోవడానికి రెడీగా లేడనిచెబుతుంది. దీనికి గౌతమ్ స్పందిస్తూ, ఒక సెంటిమీటర్ అయితే పడిపోయేది, ఆమె తోసేసింది అని తెలిపారు. దీనికి నాగ్ రియాక్ట్ అవుతూ చూశాం గౌతమ్.. స్పందన లేకుండా అలా ఉండిపోయావని నిలదీశాడు.
మరోవైపు శివాజీ, ప్రశాంత్‌ల విషయానికి వస్తే, ఫ్రూట్ నింజా టాస్క్ లో ప్రశాంత్ ఓవైపు చెబుతూనే ఉన్నాడు అక్కడ తొక్కలు వేశారని, వదిలెయ్ రా అని ఎలా అంటావ్ అని ప్రశ్నించగా, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే నాతోని కాదు సర్ అన్నాడు శివాజీ. తొక్కలు వేసింది చూడలేదని, తీయడం మాత్రం చూసినట్టు చెప్పాడు శివాజీ. సంచాలక్‌కి చెప్పాలి కదా అనగా, అమర్ దీప్‌కి ఏం చెప్పలేం సర్, ఏం చేసినా మొదట్నుంచి ఒక నెగటివ్ థాట్‌తో ఉంటున్నాడని చెప్పాడు శివాజీ.
మరో ప్రోమోలో తేజ, యావర్‌లపై ప్రశంసలు కురిపించారు నాగ్. తేజ ఎంటర్‌టైన్ చేస్తానని మాటిచ్చావ్, ఎంటర్‌టైన్ చేశావని తెలిపారు.మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేసింది. ఈ ఇద్దరి విషయంలో హౌజ్‌లో నవ్వులు పూయించాడు నాగ్. అనంతరం సందీప్, అమర్ దీప్‌ల గొడవ లేవనెత్తాడు. వారిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.
అమర్ దీప్, సందీప్‌లకు సంబంధించి మూడు తప్పులను లేవనెత్తారు నాగ్. ఫ్రూట్ నింజా టాస్క్ లో వాళ్లు చేసిన దాన్ని ప్రధానంగా లేవనెత్తాడు. అందులో ఎంత తొండిగా గేమ్ ఆడారో, ఎంతటి దారుణంగా వాళ్లు బిహేవ్ చేశారో తెలిపారు. విజువల్స్ చూపించి మరీ వారి దుమ్ముదులిపాడు నాగార్జున.
ఆ టాస్క్ లో అమర్ దీపే సంచాలక్ అని, కానీ ఆ పని చేయలేదని తెలిపారు. అంతేకాదు మాటి మాటికి బొక్కలో జడ్జ్ మెంట్ అని వాదిస్తుంటావని, కానీ మీరు చేసిందేంటి అని నిలదీశాడు. అంతేకాదు ఫైనల్‌గా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తొక్కలో సంచాలక్, బొక్కలో జడ్జ్ మెంట్ అని షాకింగ్ కామెంట్ చేశాడు.
మరోవైపు ఇంకో ప్రోమోలో ఇప్పటి వరకు హౌజ్‌లో నలుగురు ఎలిమినేట్ అయ్యారని, ప్రస్తుతం పది మంది ఉన్నారని, ఇందులో హౌజ్‌లో ఉండేందుకు అర్హత లేని లీస్ట్ ముగ్గురు ఎవరో తేల్చాలని చెప్పాడు నాగార్జున. కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే వీరిలో ఎక్కువగా అమర్ దీప్, తేజ, ప్రియాంక, శివాజీ, సందీప్‌ల పేర్లు ఎక్కువగా వచ్చాయి. ఫైనల్‌గా ఆ ముగ్గురు ఎవరో రేపు వెల్లడిస్తామని నాగ్ చెప్పారు. అలాగే రేపు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అయితే రేపే కొత్త కంటెస్టెంట్లని తీసుకురాబోతున్నారని తెలుస్తుంది.