- Home
- Entertainment
- Bigg Boss 9 Winner: బిగ్ బాస్ విన్నర్‌ని కన్ఫమ్ చేసిన భరణి, సుమన్ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి
Bigg Boss 9 Winner: బిగ్ బాస్ విన్నర్‌ని కన్ఫమ్ చేసిన భరణి, సుమన్ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ విన్నర్ ఎవరు అనేదే ఇప్పుడు అందరిని వెంటాడుతున్న ప్రశ్న. అయితే కళ్యాణ్ పేరు బలంగా వినిపిస్తోంది. భరణి, సుమన్ శెట్టి కూడా ఇదే చెప్పడం విశేషం.

బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరు?
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఫైనల్‌కి ఇక వారమే ఉంది. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భరణి ఎలిమినేషన్‌తో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోయిన విషయం తెలిసిందే. కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజనా గల్రానీ ఫైనల్‌కి చేరుకున్నారు. వీరిలోనే ఒకరు విన్నర్‌గా నిలవబోతున్నారు. అది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
తనూజ పేరు తెరపైకి
మొన్నటి వరకు తనూజ పేరు వినిపించింది. ఆమెకి విన్నర్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయని, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అన్నారు. తనూజ విన్నర్ అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతూ వచ్చారు. ఆ తర్వాత గేమ్ కళ్యాణ్ పడాల వైపు తిరిగింది. ఆయన మొదటి ఫైనలిస్ట్ కావడం, ఇటీవల కాలంలో అత్యధిక ఓటింగ్ రావడంతో కళ్యాణ్‌కి ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ వారం అంతా కళ్యాణ్ చుట్టూనే చర్చ జరిగింది.
విన్నర్ ఎవరో చెప్పిన భరణి, సుమన్ శెట్టి
ఈ క్రమంలో ఇప్పుడు భరణి, సుమన్ శెట్టి కూడా ఇదే ప్రకటించారు. భరణి ఈ ఆదివారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆయన వెళ్తూ విన్నర్ ఎవరో తెలిపారు. బిగ్ బాస్ బజ్‌లో పాల్గొన్న భరణిని సరదాగా ఆడుతున్నారు శివాజీ. ఇందులో టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లలో ఎవరి స్థానం ఎంత అనేది తెలపాలని హోస్ట్ శివాజీ అడిగారు. దీనికి టాప్ 5 సంజనా అని, టాప్ 4 డీమాన్ పవన్ అని, టాప్ 3 ఇమ్మాన్యుయెల్ అని తెలిపారు. ఇక టాప్ 1 మొదట కళ్యాణ్‌కి ఇచ్చాడు భరణి. ఆ తర్వాత తనూజకి కూడా అదే స్థానం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. దీంతో కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని, లీస్ట్ కేసులో తనూజకి ఛాన్స్ ఉందని భరణి తన అభిప్రాయంగా పంచుకున్నారు.
కళ్యాణ్ ఈ సీజన్ విన్నర్
ఆయనే కాదు సుమన్ శెట్టి కూడా అదే విషయం తెలిపారు. ఆయన కూడా అందరు బాగా ఆడాలని, జాగ్రత్త అని తెలిపారు. కానీ కళ్యాణ్ విషయంలోనే సుమన్ శెట్టి కప్ అనే పదాన్ని వాడాడు. కప్ కొట్టుకొని రావాలి, వచ్చాక మనం బ్యాంకాక్ వెళ్దామనే విషయాన్ని సుమన్ శెట్టి చెప్పారు. దీంతో ఈ ఇద్దరు కామన్‌గా కళ్యాణ్ పేరుని వెల్లడించారు. వీరే కాదు, సోషల్ మీడియాలోనూ అదే చర్చ జరుగుతుంది. కళ్యాణ్ పడాలకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. భరణి.. బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌ని కన్ఫమ్ చేశాడని చెప్పారు. కామన్ మ్యాన్ దే ఈ సారి కూడా విజయం అంటున్నారు.
నాగార్జునకి కొత్త తలనొప్పి
కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, కామన్ ఆడియెన్స్, నెటిజన్లు కూడా కళ్యాణ్ పేరుని బలంగా మెన్షన్ చేస్తున్నారు. ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఇది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఇదే ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులకు, హోస్ట్ నాగార్జునకి పెద్ద తలనొప్పిగా మారింది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సారి ఇమ్మాన్యుయెల్ ని చేయాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు కళ్యాణ్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఇది అటు నిర్వాహకులకు, టు నాగార్జునకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఏం చేయాలో ఆలోచనలో పడ్డారట. మరి దీనికి ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.

