- Home
- Entertainment
- చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
మెగాస్టార్ చిరంజీవి అంటే.. ఇండస్ట్రీలో అందరికి గౌవరం ఎక్కువ. ఆయన మాటంటే స్టార్ డైరెక్టర్లు కూడా నో చెప్పారు. కానీ ఫస్ట్ టైమ్ మెగామూవీ చేస్తోన్న అనిల్ రావిపూడి మాత్రం.. చిరు మాటకు నో చెప్పారట. ఇంతకీ విషయం ఏంటంటే?

రిలీజ్ కు రెడీగా.. మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఫ్యామిలీ , కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకు బ్రాండ్ గా ఉన్న అనిల్ రావిపూడి.. మెగాస్టార్ తో అద్భుతమైన సినిమాను అందించబోతున్నాడు. మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రూపొందిస్తున్న ఈసినిమాలో సౌత్ లేడీ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ ఒ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు.
సంక్రాంతి సెంటిమెంట్
ఈ ఏడాది ప్రారంభంలో.. పొంగల్ కానుకగా విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాను అందించాడు అనిల్. ఈ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడం, అందులోనూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించడంతో.. మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ నే రిపీట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు, చిరంజీవి ఈ సినిమాలో వింటేజ్ లుక్‌లో కనిపిస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2026 సంక్రాంతికి మెగా పండగ చేసుకోవడం కోసం భిమానులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా.
చిరంజీవి మాటకు నో చెప్పిన అనిల్ రావిపూడి
ఇక ఈసినిమాకు సబంధంచిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికి కాస్త భయం, గౌరవం ఉంటుంది. దర్శకులు ఆయనకు ఎదురుచెప్పడానికి భయపడుతుంటారు. అటువంటిది అనిల్ రావిపూడి చిరంజీవిమాటలకు నో చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి ఓ ఈవెంట్ లో వెల్లడించారు. మన శంకరవర ప్రసాదు గారు సినిమాకు సబంధించిన ఓ ఈవెంట్‌లో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఆ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి చిరంజీవి లుక్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ..
“ఈ సినిమా కోసం చిరంజీవి గారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ట్రై చేద్దాం అన్నారు. నేను దానికి నో చెప్పాను. ఆయన బయట ఎలా ఉన్నారో సినిమాలోనూ అలానే చూపించడానికి ట్రై చేశాను. ఆయనకీ కూడా అదే చెప్పాను. 25 ఏళ్ల క్రితం ఎంత స్లిమ్‌గా, అందంగా ఉన్నారో ఇప్పుడూ ఆయన అలానే ఉన్నారు” అని తెలిపారు. దర్శకుడు చేసిన ఈ కామెంట్స్ లో మెగాఅభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.
మెగా అభిమానుల ఎదురుచూపులు
ఇక సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం. రిలీజ్ అయిన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కలిసి కాలు కదిపిని స్పెషల్ సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈమూవీ ఈసంక్రాంతి బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్.

