Bigg Boss Telugu 7: నువ్వు పెద్ద పిస్తా.. ఆట సందీప్‌పై నాగార్జున ఫైర్.. హౌజ్‌ని ఆడుకున్న హోస్ట్..
బిగ్ బాస్ తెలుగు 7 మూడో వారం వీకెండ్‌కి చేరుకుంది. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చారు. హౌజ్‌మేట్స్ ని ఓ రౌండ్ ఏసుకున్నాడు. ఎవరు బాగా ఆడారు, ఎవరు సరిగ్గా ఆడలేదు, ఎవరు ఎక్స్ ట్రాలు చేశారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు గేమ్ ఛేంజర్ అనేది నిలదీశాడు నాగార్జున.
మూడో హౌజ్ మేట్‌కి సంబంధించిన పవర్ అస్త్ర కోసం జరిగిన పోటీలకు సంబంధించి సంచాలక్ గా వ్యవహరించిన ఆట సందీప్‌ని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు నాగ్. మొదట.. అమర్ దీప్‌ని నిలదీశాడు. నువ్వు నీ ఆట ఆడుతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా? అంటూ అడగ్గా ఆయన వద్ద ఆన్సర్ లేదు. నీ రీజన్ నువ్వు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు నాగార్జున. ఆ తర్వాత శోభా శెట్టిని ఆడుకున్నాడు. నీ కంటే స్ట్రాంగ్ అని యావర్‌ని సెలక్ట్ చేసుకున్నావ్, అంటే నువ్వు వీక్ అనేగా అర్థం అని తెలిపాడు. ఆ ప్రకారంగా ఆట నుంచి కంటెండర్ నుంచి నువ్వు తప్పుకోవాలని శోభా శెట్టికి చెప్పాడు నాగ్.
ఈ ఆటకి సంచాలక్‌గా వ్యవహరించిన ఆట సందీప్ సరిగ్గా వ్యవహరించడం లేదని నాగార్జున ఫైర్ అయ్యాడు. ఎంపైర్ అనేవాడు ఆట మధ్యలో ఇన్‌వాల్వ్ కాడు, కానీ నువ్వేందుకు పాయింట్స్ ఇస్తున్నావని నిలదీశాడు. సంచాలక్‌గా ఆడావా? పర్సనల్‌గా ఆడావా? అని అడగ్గా, కన్ఫ్యూజ్ అయ్యాను సర్ అని ఆట సందీప్ చెప్పడం ఆశ్చర్యపరిచింది. ఎంపైర్ కన్‌ఫ్యూజ్ అయితే ఆట ఆడడు కదా అని నాగ్ చెప్పడంతో సందీప్ కి మాట రాలేదు.
మొదట అనౌన్స్ మెంట్‌లో సంచాలక్ అని చెప్పలేదని ఆట సందీప్ అని చెప్పగా, నువ్వు కంటెండర్ కాదు, మరి ఎందుకు పిలుస్తారు? నువ్వు పెద్ద పిస్తా అనా? అంటూ ఫైర్ అయ్యాడు నాగ్. దీంతో సందీప్‌కి చెంప పగిలిపోయినంత పనైంది. సందీప్ సంచాలక్‌గా ఫెయిల్ అయ్యాడని చెప్పే వారు చేతులెత్తాలి అనగా, ఐదుగురు చేతులెత్తారు. దీంతో సందీప్ బ్యాటరీ తగ్గించారు. గ్రీన్ నుంచి ఎల్లోకి పవర్‌ని తగ్గించడం ఆయనకు మరో పెద్ద షాకిచ్చింది.
అంతేకాదు హౌజ్‌లో ఎక్స్ ట్రాలు చేసిన వారికి కూడా ఓ ఆట ఆడుకున్నారు నాగ్. టేస్టీ తేజ, ప్రశాంత్‌లకు కూడా క్లాస్ పీకాడు. అమర్ దీప్‌పై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ఎవరు ఎలా ఆడుతున్నారేది చూపించారు. అంతేకాదు ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు గేమ్ ఛేంజర్‌లో చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. పాయింట్ టూ పాయింట్ మాట్లాడించాడు. అందరి బండారాలు బయటపెట్టారు. నాగ్ తనలోని మరో యాంగిల్‌ని చూపించాడని చెప్పాలి.
మూడో హౌజ్ మేట్ కి సంబంధించి ముగ్గురు యావర్, ప్రియాంక, శోభా శెట్టి పోటీలో ఉండగా, ప్రియాంక, శోభా శెట్టి కలిసి యావర్‌ని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరి మధ్య బుల్ రైడ్ టాస్క్ ఇవ్వగా, ఇద్దరిలో ఎవరు హౌజ్‌మేట్ అయ్యారనేది నేడు తేలనుంది. నాగార్జున ప్రకటిస్తారు.