- Home
- Entertainment
- Nagarjuna on Thandel : నాగచైతన్య నువ్వు హద్దులు దాటేశావ్.. `తండేల్` సక్సెస్‌పై నాగార్జున ఎమోషనల్ కామెంట్
Nagarjuna on Thandel : నాగచైతన్య నువ్వు హద్దులు దాటేశావ్.. `తండేల్` సక్సెస్‌పై నాగార్జున ఎమోషనల్ కామెంట్
Nagarjuna on Thandel : నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `తండేల్` మూవీ విజయవంతంగా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జున ట్వీట్ చేశారు. ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Nagarjuna on Thandel : నాగచైతన్య చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. `బంగార్రాజు` వంటి యావరేజ్ హిట్ తర్వాత ఇప్పుడు `తండేల్`తో సక్సెస్ అందుకున్నారు. వరుసగా మూడు, నాలుగు ఫెయిల్యూర్స్ తర్వాత ఆయనకు విజయం దక్కింది.
`లవ్ స్టోరీ` తర్వాత సాయిపల్లవితో కలిసి నటించిన `తండేల్` మూవీ బ్లాక్ బస్టర్ దిశగా రన్ అవుతుంది. ఈ మూవీ భారీ కలెక్షన్లని రాబట్టబోతుంది. ఇప్పటికే ఇది రెండు రోజుల్లోనే 41కోట్లు వసూలు చేసింది. మూడో రోజుతో సుమారు రూ.60కోట్లు దాటిందని సమాచారం.
ఇదిలా ఉంటే `తండేల్` సక్సెస్‌పై నాగచైతన్య తండ్రి, స్టార్ హీరో నాగార్జున స్పందించారు. ఆయన ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా చైతూని చూసి గర్వపడుతూ ఆయన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ట్వీట్‌లో నాగార్జున చెబుతూ, `మై డియర్ సన్ నాగచైతన్య నిన్ను చూసి గర్వ పడుతున్నా` అని స్టార్ట్ చేశారు. నువ్వు హద్దులు దాటేశావ్, సవాళ్లని ఎదుర్కోవడం, కళని నీ హృదయాన్ని అంకితం చేయడం నేను చూశాను. `తండేల్` జస్ట్ ఒకసినిమా కాదు, నీ అవిశ్రాంత అభిరుచికి, పెద్ద కలలు కనే ధైర్యానికి, నీ కృషికి నిదర్శనం` అని చెప్పారు నాగ్.
Naga Chaitanya
ఈ సందర్భంగా అక్కినేని అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీరు మా కుటుంబంలా మాకు అండగా నిలిచారు. `తండేల్` విజయం మాది కాదు మీదు. మీ అంతులేని ప్రేమ, సపోర్ట్ కి ధన్యవాదాలు అన్నారు నాగార్జున. అలాగే టీమ్‌ని ఆయన అభినందించారు. అల్లు అరవింద్, బన్నీవాస్‌లకు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున, సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు.
మీరు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ని మేధావిగా వర్ణించి, అద్భుతం చేశావని, `తండేల్`ని మరపురాని మూవీగా నిలిపినందుకు దర్శకుడు చందూ మొండేటిని అభినందించారు నాగార్జున.
Thandel Movie Review
నాగార్జున ట్వీట్ వైరల్ అవుతుంది. చైతూ విషయంలో నాగ్ ఎంత సంతోషిస్తున్నారో ఈ ట్వీట్‌ని బట్టి అర్థమవుతుంది. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతుంది.
ఈ క్రమంలో దీనిపై చైతూ కూడా స్పందించి నాగ్‌కి థ్యాంక్స్ చెప్పారు. `థ్యాంక్యూ నాన్న, మీ అభినందనలే మాకు నిజమైన విజయం` అని తెలిపారు. ప్రస్తుతం `తండేల్` సక్సెస్‌టూర్‌లో ఉన్నారు చైతన్య. దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలతో కలిసి ఆయన థియేటర్ విజిట్ చేస్తున్నారు.
also read: రవితేజ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా? ఫెయిల్యూర్ డైరెక్టర్‌కి లైఫ్ ఇచ్చేందుకు నిర్ణయం?