- Home
- Entertainment
- Bigg Boss Telugu 7: శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్, యావర్, సందీప్‌ల నిజస్వరూపాలు బయటపెట్టిన నాగ్..ఫైరింగ్
Bigg Boss Telugu 7: శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్, యావర్, సందీప్‌ల నిజస్వరూపాలు బయటపెట్టిన నాగ్..ఫైరింగ్
బిగ్ బాస్ తెలుగు 7 షో.. ఎనిమిదో వారం పూర్తి వేడి వేడిగా సాగింది. హోస్ట్ నాగార్జున వచ్చి ఈ వారం తప్పు చేసిన వారి దుమ్ముదులిపాడు, వారి నిజ స్వరూపాలు బయటపెట్టాడు.

బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ఎనిమిదో వారం చివరి దశకు చేరుకుంది. శనివారం ఎపిసోడ్ చాలా హాట్ హాట్ గా సాగింది. హోస్ట్ నాగార్జున వచ్చి ఈ వారం హౌజ్‌లో జరిగిన పొరపాట్లని, కంటెస్టెంట్లు చేసిన తప్పులను నిలదీసి కడిగిపడేశాడు. ఈ రోజు ఎపిసోడ్ మొత్తం హౌజ్ మేట్స్ మిస్టేక్స్ పైనే సాగడం విశేషం. ఒక్కొక్కరిని దుమ్ముదులిపేశాడు నాగ్. పిన్ టూ పిన్ ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ, వారి తప్పులను నిలదీస్తూ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. రెండు రూపాలు చూపించిన వారి అసలుస్వరూపాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు.
ప్రధానంగా శోభా శెట్టి, ప్రియాంక, యావర్, అమర్ దీప్, సందీప్‌లను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. తేజాని సైతం వదల్లేదు. యావర్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే శివాజీకి గట్టిగా చెప్పాడు. బయటకు వెళ్లిపోతా అంటూ చేసే కామెంట్లని నాగ్ నిలదీశాడు. ఎందుకు పడే పడే ఈ మాటలు వాడుతున్నావని, అలాగే కొట్టేసి వెళ్లిపోతా అనే సందర్భాన్ని లేవనెత్తాడు. తనలో వచ్చే ఫ్రస్టేషన్ అని శివాజీ చెప్పే ప్రయత్నం చేయగా, నిజాయితీగా, అంతే బోల్డ్ గా హౌజ్‌లో జరిగే విషయాలను చెప్పాలని, కంటెస్టెంట్లకి చెప్పాలని తెలిపారు నాగ్.
ఇందులో యావర్ విషయంలో శోభా శెట్టి చేసిన `పిచ్చోడా` కామెంట్లపై ప్రశ్నించారు నాగ్. నామినేషన్ల సమయంలో ఆ ఫ్లోలో తాను అలా వాగానని ఆమె తెలిపింది. కానీ గతంలో భోలే నిన్ను అన్నప్పుడు క్షమించనని చెప్పి,ఇప్పుడు అదే మాటని యావర్ పై పదే పదే ఎందుకు వాడావంటూ, అప్పుడు లేనిది, ఇప్పుడు ఎలా వచ్చిందంటూ ఉతికి ఆరేశాడు నాగ్. యావర్ హిట్లర్ అన్నాడని శోభా రియాక్ట్ అయిన దానికి నాగ్ క్లారిటీ ఇస్తూ ఆమె దుమ్ము దులిపేశాడు. అలాగే యావర్ చేసిన దానికి వార్నింగ్ ఇచ్చాడు. హౌజ్ ప్రాపర్టీ నాశనం చేయడం సరికాదని, పిచ్చోడిలా బిహేవ్ చేయకూడదని గట్టిగా చెప్పారు,తన ఆట తగ్గిపోతుందని తెలిపారు.
మరోవైపు నామినేషన్లలో ప్రశాంత్‌పై అమర్ దీప్ చేసిన కామెంట్లని ప్రస్తావించారు నాగ్. ఆ సమయంలో కూర్చీని తన్నడం, ప్రశాంత్‌ని ఈ నా కొడుకు అని మాట్లాడటంపై నాగ్ ఫైర్ అయ్యాడు. అంతగా అరుస్తుంటే, ప్రియాంక, శోభ, కెప్టెన్ అర్జున్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో శోభా శెట్టి విషయంలో యావర్ చేసిన దానికి మాట్లాడిన ప్రియాంక ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉందని ప్రశ్నించారు నాగ్. దీంతో ప్రియాంక ముఖం వాడిపోయింది.
దీంతోపాటు బ్రెయిన్ టాస్క్ లో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలు చేసిన మిస్టేక్ని ప్రశ్నించాడు. దానికి సంచాలక్గా చేసిన గౌతమ్‌ని మందలించాడు. ఇక రతికకి గట్టిగా ఇచ్చిపడేశాడు. ఇప్పటికే ఆమె ఎలిమినేట్ అయిన మళ్లీ హౌజ్‌లోకి వచ్చింది. బాగా ఆడతానని చెప్పింది. కానీ హౌజ్‌లో పాత విషయాలను చర్చించుకుంటూ కబుర్లు చెబుతుంది. దీనిపై గట్టిగా ఫైర్ అయ్యాడు నాగ్. సెకండ్ ఛాన్స్ ఇస్తే ఇదా నువ్వు చేసేది, పాత విషయాలను ఎందుకు తవ్వుకుంటున్నావని, ఈ వారం ఆట ఏదని మందలించాడు.
ఇక చివరికి సందీప్ మాస్టర్ వంతు రాగా, బొంగులో డాన్సు, బొంగులో కొరియోగ్రఫీ అంటూ ప్రశాంత్‌పై సందీప్ చేసిన కామెంట్లని ప్రశ్నించాడు నాగ్. ఆ పదం వాడటం తప్పు అని స్పష్టం చేశాడు. ఇలా చేయోద్దని వార్నింగ్ ఇచ్చాడు. వీరందరి జెండాలను నాగ్ విరగ్గొట్టాడు. హౌజ్‌లో కొందరి నిజ స్వరూపాలను నాగ్ బయటపెట్టారు. ఇక బాగా ఆడిన అర్జున్, ప్రశాంత్, అశ్విని, ప్రియాంక జెండాలను మాత్రం నిలబెట్టాడు. భోలే ఇంకా బాగా ఆడాలని తెలిపారు. ఈ వారం నామినేషన్లలో ఎనిమిది మంది ఉండగా, గౌతమ్, ప్రియాంకలు సేవ్ అయ్యారు.