నాగ చైతన్య తల్లి నాగార్జున పక్కనే కూర్చుందా, ఇన్నేళ్ల తర్వాత ఇద్దరూ మాటలు కలిపారా ? అసలేం జరిగింది..
కింగ్ నాగార్జున తన మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జున అమలని రెండో వివాహం చేసుకున్నారు. లక్ష్మి దగ్గుబాటి కూడా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.
కింగ్ నాగార్జున తన మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జున అమలని రెండో వివాహం చేసుకున్నారు. లక్ష్మి దగ్గుబాటి కూడా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. లక్ష్మి, నాగార్జున ఇద్దరూ నాగ చైతన్య జన్మించాక విడిపోయారు.
Nagarjuna Akkineni
అయితే కొన్ని రోజులుగా నాగ చైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి గురించి ఒక విషయంలో పొరపాటుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష్మి దగ్గుబాటి మీడియాకి ఎక్కువగా కనిపించరు. నాగ చైతన్య ఎప్పుడైనా తన తల్లితో ఉన్న ఫోటో షేర్ చేస్తే తప్ప ఆమె లేటెస్ట్ లుక్ ఏంటో ఎవరికీ తెలియదు. అక్కినేని ఫ్యామిలీతో ఆమె టచ్ లో లేరు. ఇటీవల అక్కినేని నేషనల్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈసారి అక్కినేని నేషనల్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి అందించారు.
ఈ కార్యక్రమానికి లక్ష్మి దగ్గుబాటి కూడా హాజరయ్యారని.. అక్కినేని ఫ్యామిలీతో కలసి ఫోటో కూడా దిగారని సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఆమె నాగార్జున పక్కనే కూర్చుని మాట్లాడినట్లు కూడా వీడియోలో చూపిస్తూ థంబ్ నెయిల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత నాగార్జున, అతని మాజీ భార్య లక్ష్మి మాట్లాడు కున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. కానీ అది వాస్తవం కాదు. నాగార్జున పక్కన కూర్చున్న వ్యక్తిని చాలా మంది లక్ష్మి దగ్గుబాటి అని పొరపాటుగా అనుకుంటున్నారు.
ఆమె ఎవరో కాదు.. నాగార్జున వదిన అక్కినేని జ్యోత్స్న. ఏఎన్నార్ పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ సతీమణి ఆమె. అక్కినేని వెంకట్, జ్యోత్స్న కూడా పెద్దగా మీడియాకి కనిపించరు. దీనితో నెటిజన్లు పొరపాటుగా ఆమెని లక్ష్మి దగ్గుబాటి అనుకుంటున్నారు.
అక్కినేని వెంకట్, జ్యోత్స్న లకి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీళ్లంతా అక్కినేని నేషనల్ అవార్డుల వేడుకలో సందడి చేశారు. అక్కినేని కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో దిగారు. ఈ సంబర్భంగా అక్కినేని జ్యోత్స్న తన మరిది నాగార్జునతో సరదాగా మాట్లాడారు. ఆ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.