సిల్క్ చీర జబ్బల జాకెట్ లో కిక్ ఇస్తున్న నిహారిక... సన్నజాజి సోయగాలు ఓహ్ కేక!
ఇటీవల జరిగిన అన్నయ్య వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకకు నిహారిక హాజరయ్యారు. డిజైనర్ శారీలో లావణ్య సూపర్ గ్లామరస్ గా కనిపించారు.

Niharika Konidela
హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో జూన్ 9 రాత్రి వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. చిత్ర ప్రముఖులకు ఎలాంటి పిలుపు లేదు. పెళ్లి మాత్రం చిత్ర ప్రముఖుల సమక్షంలో ఘనంగా చేసుకోనున్నారట.
Niharika Konidela
ఈ వేడుకకు వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక సైతం హాజరయ్యారు. ఆమె వదిన లావణ్య, అన్నయ్య వరుణ్ తో ఫోటోలకు ఫోజిచ్చారు. వరుణ్, లావణ్యలతో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిహారిక ఓ కామెంట్ చేశారు. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.
Niharika Konidela
వరుణ్-లావణ్యల పెళ్లి నిహారికకు ఇష్టమే అని ఆమె కామెంట్ తో అర్థం అవుతుంది. కాబట్టి లావణ్యను వదినగా నిహారిక మనస్ఫూర్తిగా అంగీకరించారు. వరుణ్-లావణ్య రిలేషన్ లో ఉన్నట్లు నిహారికకు ముందే తెలుసు. ఇటీవల ఆమె నటించిన డెడ్ ఫిక్సెల్స్ సిరీస్ విడుదలైంది. అప్పుడు మీడియా నిహారికను వరుణ్-లావణ్యల పెళ్లి గురించి అడగ్గా ఆమె మాట దాటవేశారు.
Varun Tej - Lavanya Tripathi engagement
భర్త వెంకట చైతన్యతో నిహారిక విడిపోయిన విషయం తెలిసిందే. ఇక వరుణ్ ఎంగేజ్మెంట్ కి కూడా వెంకట చైతన్య హాజరు కాలేదు. దీంతో నిహారికతో ఆయన విడాకులు లాంఛనమే అంటున్నారు.
అన్నయ్య నిశ్చితార్థం వేడుకకు ధరించి చీరలో నిహారిక ఫోటో షూట్ చేసింది. సన్నజాజి తీగలా స్లిమ్ గా ఉన్న నిహారిక జబ్బల జాకెట్ లో కిక్ ఇచ్చారు. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.