- Home
- Entertainment
- మెగా ఫ్యామిలీలో కొత్త వివాదం.. పరాయి మగాడితో నిహారిక వీడియో... మామ వార్నింగ్ తో ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్!
మెగా ఫ్యామిలీలో కొత్త వివాదం.. పరాయి మగాడితో నిహారిక వీడియో... మామ వార్నింగ్ తో ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్!
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. ఆమె చర్యకు ఫ్యాన్స్, చిత్ర వర్గాలు విస్మయం చెందుతున్నారు. ఏదైనా రాంగ్ ఫోటో, వీడియో పోస్ట్ చేస్తే అవి మాత్రమే డిలీట్ చేస్తారు.నిహారిక ఏకంగా అకౌంట్ డిలీట్ చేయడం వెనుక కారణం ఏమిటని పరిశీలిస్తే, ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. a

హీరోయిన్ గా ఎదిగాలన్న ఆశలతో నటిగా నిహారిక ఎంట్రీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు అరడజను పైగా ఉన్న పరిశ్రమలో నిహారిక స్టార్ హీరోయిన్ కావడం పెద్ద విషయం కాదు. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పట్ల ప్రజల్లో ఉండే అభిప్రాయం దృష్టిలో ఉంచుకొని వారు ఆమెను ప్రోత్సహించలేదు.
'ఒక మనసు' సినిమాతో వెండితెరకు పరిచయమైన నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలు నటించారు. ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి. మెగా ఫ్యామిలీ తలచుకుంటే ఆమెకు ఆఫర్స్ వచ్చేలా చేయడం విషయం కాదు. మరోవైపు మెగా డై హార్డ్ ఫ్యాన్స్ కి నిహారిక హీరోయిన్ కావడం అసలు ఇష్టం లేదు.
ఇచ్చిన ఛాన్స్ నిహారిక సద్వినియోగం చేసుకోలేదనే వంకతో నిహారికకు నాగబాబు(Nagababu) పెళ్లి ఏర్పాట్లు చేశారు. తమ ఫ్యామిలీకి చాలా కాలంగా తెలిసిన పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. 2020 డిసెంబర్ 9వ తేదీన నిహారిక-చైతన్య వివాహం చాలా ఘనంగా రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలస్ లో జరిగింది.
పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు గుడ్ బై చెబుతుందనుకుంటే అత్తమామలు, భర్త అనుమతితో కెరీర్ మరలా మొదలుపెట్టింది. ఓ వెబ్ సిరీస్ తో పాటు సినిమాకు నిహారిక సైన్ చేశారు. అయితే ఆమెకు వెంకట చైతన్య కుటుంబం కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నిహారిక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు.
సడన్ గా నిహారిక ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటని ఆరా తీయగా.. ఆమె చేసిన ఓ ఇంస్టాగ్రామ్ పోస్ట్ అత్తమామలకు ఆగ్రహం తెప్పించిందట. నిహారిక తన జిమ్ ట్రైనర్ వీపుపై కూర్చొని ఉండగా.. అతడు పుష్ అప్స్ ట్రై చేశాడు. ఈ వీడియో నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిమిషాల్లో వైరల్ గా మారింది.
తమ కోడలు పరాయి మగాడి వీపుపై కూర్చొని వ్యాయామాలు చేయడం అసలు నచ్చని మామయ్య ప్రభాకర్ రావు నిహారికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఓ కోడలిగా పద్ధతిగా ఉండాలంటూ గట్టిగా చెప్పడంతో చేసేదేమీ లేక నిహారిక ఏకంగా అకౌంట్ డిలీట్ చేసినట్లు సమాచారం. నిహారికకు అత్తింటివారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆమె కాస్తా దానిని మిస్ యూజ్ చేయడంతో అసలుకే మోసం వచ్చినట్లు వినికిడి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో నిహారిక పుట్టింట్లో కంటే అత్తింట్లోనే తనకు ఎక్కువ స్వేచ్ఛ ఉందని చెప్పడం విశేషం. ఇంట్లో ఉదయాన్నే నిద్రలేవాలని అమ్మ ఇబ్బంది పెట్టేదని, అత్తయ్య మాత్రం నిద్ర లేచే వరకు బెడ్ రూమ్ వైపు రారంటూ చెప్పుకొచ్చారు. ప్రచారం అవుతున్న కథనాల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలేట్ చేయడం సంచలనంగా మారింది.