MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నెపోటిజంపై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.. ఒకవేళ అలా జరిగితే అడ్డుకుంటారా ?

నెపోటిజంపై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.. ఒకవేళ అలా జరిగితే అడ్డుకుంటారా ?

నాగ చైతన్య మరోసారి కెరీర్ పై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చింది. చైతు చివరగా నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 23 2022, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నాగ చైతన్య మరోసారి కెరీర్ పై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చింది. చైతు చివరగా నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. లాల్ సింగ్ చద్దా పూర్తిగా చైతు చిత్రం కానప్పటికీ అతడి బాలీవుడ్ ఆశల్ని నీరుగార్చింది. ఇక థాంక్యూ చిత్రంపై అక్కినేని ఫాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా ఇంటర్వ్యూలో నాగ చైతన్య ఇండస్ట్రీలో నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో కంటే సౌత్ లో నెపోటిజం ప్రభావం తక్కువ అని అన్నారు. అసలు దీని గురించి ఎందుకు పదే పదే చర్చ జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని నాగ చైతన్య తెలిపారు. నెపోటిజం వల్ల తనకు అవకాశాలు వచ్చిన మాట వాస్తవమే అని చైతు అన్నారు. కానీ ఇందులో తప్పు పట్టాల్సిన అంశం ఏముందో అర్థం కావడం లేదు. 

36

మా తాత నాగేశ్వర రావుగారు నటులు.. మా నాన్నగారు కూడా నటులే. చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగాను. వారి ప్రభావం నాపై తప్పకుండా ఉంటుంది. వారి స్పూర్తితో నేను కూడా యాక్టర్ కావాలని ఆశపడ్డాను. వారు ఇండస్ట్రీలో నాకంటూ ఒక దారి చూపించారు. ఆ దారిలో పయనిస్తున్నాను. 

46

ఒక వేల నేను నటించిన సినిమా.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో సినిమా ఒకే రోజు విడుదలయ్యాయి అనుకుందాం. నా సినిమా 10 కోట్లు సాధించి.. అతడి సినిమా 100 కోట్లు రాబడితే.. దర్శక నిర్మాతలు అతడి వద్దకే వెళతారు. నెపోటిజం వల్ల అవకాశాలు సులభంగా రావచ్చేమో కానీ చివరగా ఆడియన్స్ చూసేది కంటెంట్ మాత్రమే అని చైతు తెలిపాడు. 

56

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఓ హీరో రాణిస్తే.. ఫ్యూచర్ లో అతడి కొడుకు హీరో కాకుండా అడ్డుకుంటారా అని నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్ చేశారు. 

66

నెపోటిజం పక్కన పెడితే ఇండస్ట్రీలో పోటీ సమానంగా ఉంటుంది అని నాగ చైతన్య అన్నారు. ఏ హీరో నటించిన సినిమా అయినా కంటెంట్ బలంగా ఉంటేనే విజయం సాధిస్తారు. బాక్సాఫీస్ వద్ద అందరూ సమానమే అని చైతు అన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dridam Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న 'దృఢం'.. ఏమి ట్విస్టులు బాబోయ్, అదరహో అంతే
Recommended image2
Disha Patani NetWorth: రూ.500తో ముంబైకి వచ్చి ఇప్పుడు కోట్లు సంపాదించిన `కల్కి` హీరోయిన్‌.. దిశా పటానీ స్టోరీ
Recommended image3
OTT Movie: ఓటీటీలోకి సూపర్‌హిట్‌ ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ఒక్క కేసు చుట్టూ మూడు సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved