MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'మనం' రీరిలీజ్ షోకి హాజరైన చైతు..సమంతతో పెళ్లి సీన్ రాగానే చిరాకు పడ్డ అక్కినేని హీరో, ఫ్యాన్స్ గోల

'మనం' రీరిలీజ్ షోకి హాజరైన చైతు..సమంతతో పెళ్లి సీన్ రాగానే చిరాకు పడ్డ అక్కినేని హీరో, ఫ్యాన్స్ గోల

పదేళ్ల క్రితం అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. నాగార్జున, ఏఎన్నార్, నాగ చైతన్య కలసి నటించిన ఈ చిత్రం క్లాసిక్ గా నిలిచింది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ పునర్జన్మల తో ప్రేమని మిక్స్ చేస్తూ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 24 2024, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పదేళ్ల క్రితం అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. నాగార్జున, ఏఎన్నార్, నాగ చైతన్య కలసి నటించిన ఈ చిత్రం క్లాసిక్ గా నిలిచింది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ పునర్జన్మల తో ప్రేమని మిక్స్ చేస్తూ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు రీరిలీజ్ అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ చిత్రంలో నాగార్జునకి జోడిగా శ్రీయ, నాగ చైతన్యకి జంటగా సమంత నటించారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్. ఈ చిత్రంలో నాగార్జునకి తండ్రిగా నాగ చైతన్య నటించారు. ఏఎన్నార్ కి తండ్రిగా నాగార్జున నటించారు. 

36

క్లైమాక్స్ లో అఖిల్ కూడా చిన్న కామియో రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాగ చైతన్య దేవి థియేటర్ లో స్పెషల్ షోకి హాజరయ్యారు. ఫ్యాన్స్ ఇప్పటికీ మనం చిత్రాన్ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత మధ్య సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్ దగ్గరకి వెళ్లి మరీ హంగామా చేస్తున్నారు. 

46

సమంతతో నాగ చైతన్య పెళ్లి సన్నివేశం రాగానే ఫ్యాన్స్ సీట్లలోనుంచి లేచి గంతులేస్తూ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య ముందే ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. పెళ్లి సీన్ కి ఫ్యాన్స్ హంగామా చేస్తుండడంతో చైతు వారిని కూర్చోమని చెబుతూ చిరాకు పడ్డ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

56

దేవి థియేటర్ కి నాగ చైతన్య వస్తున్నప్పుడు అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. ఈ స్పెషల్ షోకి నాగ చైతన్యతో పాటు డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా హాజరయ్యారు. 

66

నాగ చైతన్య, సమంత నటించిన హిట్ చిత్రాల్లో మనం మూవీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ మూవీలో నటించే సమయంలో చై, సామ్ ప్రేమలో ఉన్నారు. 2017లో వివాహం చేసుకున్న చై, సామ్ ఫ్యాన్స్ కి షాకిస్తూ 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: బేబీ బంప్ తో సమంత సాహసం, ప్రెగ్నెంట్ గా ఉన్నా జిమ్ముని వదలని స్టార్ హీరోయిన్..
Recommended image2
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ క్రేజీ హీరోయిన్‌, ఎలా మిస్‌ అయ్యింది?.. అసలు నిజం చెప్పిన దర్శకుడు
Recommended image3
Aamir Khan: అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే..పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved