- Home
- Entertainment
- Thandel Twitter Review: నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీకి మించి హైలైట్ అదే.. పెద్ద మైనస్ ఏంటంటే
Thandel Twitter Review: నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీకి మించి హైలైట్ అదే.. పెద్ద మైనస్ ఏంటంటే
Thandel Twitter Review: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.

Thandel Twitter Review
Thandel Twitter Review: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. నాగ చైతన్య కెరీర్ లో ఇదే హైయెస్ట్ బడ్జెట్. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆల్రెడీ యుఎస్ లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీనితో ప్రేక్షకుల నుంచి తండేల్ చిత్రానికి రెస్పాన్స్ వస్తోంది.
Thandel
మాస్ యాక్షన్ సన్నివేశంతో నాగ చైతన్య ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ సీన్స్ తర్వాత నాగ చైతన్య కొత్త తండేల్ గా ఎలా మారాడు అనే సన్నివేశాలు వస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఓం నమో నమః శివాయ సాంగ్ హైలైట్ గా నిలిచింది. ఈ సాంగ్ లో సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. ఈ సాంగ్ తర్వాత కథ ఎమోషనల్ గా మారుతుంది.
Thandel
ఫస్టాఫ్ లో కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్, పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ సన్నివేశం హైలైట్ అని చెప్పొచ్చు. అయితే మొదటి గంట మాత్రం సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి కథ పికప్ అవుతుంది. కథలో డ్రామా పండలేదు. ఇటీవల కాలంలో దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన చిత్రం ఇదే అని చెప్పొచ్చు. నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీకి మించి దేవిశ్రీ సంగీతం హైలైట్ అయింది.
Thandel
దర్శకుడు చందూ ముండేటి రైటింగ్ ఆశించిన స్థాయిలో లేదు. ఆర్టికల్ 370, ఇండియా పాకిస్తాన్ సన్నివేశాలని బాగా చిత్రీకరించారు. సెకండ్ హాఫ్ లో దేశభక్తికి సంబందించిన సన్నివేశాలు బావున్నాయి. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే మరికొన్ని సీన్స్ ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. అంతగా ఎంగేజింగ్ గా లేవు.
Thandel
సెకండ్ హాఫ్ లో వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలు చాలా బావున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి చివరి వరకు ఈ చిత్రాన్ని మోస్తూ వచ్చారు. కానీ నేరేషన్ సహకరించకపోవడంతో చాలా చోట్ల సాగదీసినట్లు అనిపిస్తుంది. నాగ చైతన్య కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన తండేల్ చిత్రం కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్, చివరి 20 నిమిషాల సన్నివేశాలు, పాటలతో ఆకట్టుకుంటుంది. మిగిలిన సన్నివేశాలు డల్ గా ఉండడం వల్ల పర్వాలేదనిపించే చిత్రంగా నిలుస్తుంది.
Thandel
ప్రమోషన్స్ గ్రాండ్ గా చేయడంతో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. డైరెక్టర్ చందూ ముండేటి కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా సముద్రం, మత్స్యకారుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ చైతన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రాణం పెట్టేశాడు.