- Home
- Entertainment
- నాగ చైతన్యకి అగ్ని పరీక్ష.. 'తండేల్' బడ్జెట్ ఎంతో తెలుసా, థియేటర్ ద్వారా అంత రాబట్టడం సాధ్యమేనా
నాగ చైతన్యకి అగ్ని పరీక్ష.. 'తండేల్' బడ్జెట్ ఎంతో తెలుసా, థియేటర్ ద్వారా అంత రాబట్టడం సాధ్యమేనా
అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ చందూ ముండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది.
రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాల వేగం పెంచుతున్నారు. ఇప్పటి వరకు తండేల్ చిత్రంపై మంచి బజ్ ఉంది. సాయి పల్లవి, చైతు మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేస్తున్నారు. అయితే ఒక్క విషయంలో ఈ చిత్రం కలవరపెడుతోంది. అదే బడ్జెట్. ఈ చిత్రానికి ఏకంగా 85 కోట్ల బడ్జెట్ ఖర్చయినట్లు టాక్. డిజిటల్, శాటిలైట్, హిందీ హక్కుల ద్వారా నిర్మాతలకు 50 కోట్లు రికవరీ అయింది.
ఇక మిగిలిన 35 కోట్లు మొత్తం థియేటర్ బిజినెస్ ద్వారానే రావాలి. నాగ చైతన్య సినిమా కాబట్టి బయ్యర్లు 85 కోట్లు పెట్టి కొనుక్కోరు. ఎందుకంటే చైతు మార్కెట్ పరిమితం కొన్ని చోట్ల నిర్మాతలే ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారట. అంటే ఈ చిత్రం బయ్యర్లకి రావాల్సిన మొత్తం పోను 35 కోట్లు పైగా లాభాలు వస్తే నిర్మాతల బడ్జెట్ రికవరీ అవుతుంది. ఇది చాలా పెద్ద టాస్క్. మరి అల్లు అరవింద్ ఎలాంటి ప్లాన్ తో రిలీజ్ చేస్తారు ? సినిమా ఎంత అద్భుతంగా వచ్చింది అనేదానిపై తండేల్ సక్సెస్ ఆధారపడి ఉంది.