#Thandel: ‘తండేల్’అడ్వాన్స్ స్లోగానే...కారణం అదేనా?
#Thandel: ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తొలి రోజు భారీ కలెక్షన్లతో మంచి ఓపెనింగ్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో అడ్వాన్స్ బుక్కింగ్ ల పరిస్దితి ఏమిటో చూద్దాం.

Sai Pallavi starrer Thandel film
యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మరోసారి జోడీగా నటించిన చిత్రం తండేల్. ఈ చిత్రం మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రాన్ని మేకర్స్ తీసుకొస్తున్నారు. ఆ మేరకు ప్రమోషన్స్ కూడా భారీగానే జరుపుతున్నారు.
నిఖిల్ కార్తీకేయ 2 లాంటి బంపర్ హిట్ కొట్టిన చందూ మొండేటి.. తండేల్ చిత్రానికి దర్శకత్వం వహించటంతో నార్త్ లో కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తొలి రోజు భారీ కలెక్షన్లతో మంచి ఓపెనింగ్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో అడ్వాన్స్ బుక్కింగ్ ల పరిస్దితి ఏమిటో చూద్దాం.
Sai Pallavi starrer Thandel film update out
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు తండేల్ చిత్రం అడ్వాన్స్ బుక్కింగ్ లు డీసెంట్ గా ఉన్నాయి కానీ అద్బుతంగా, ఎక్సార్డనరీగా అయితే లేవు. అందుకు నాగ చైతన్య గత చిత్రాల రిజల్ట్ లు కారణం కావచ్చు. సినిమాకు టాక్ వచ్చాక ఒక్కసారిగా బుక్కింగ్స్ రైజ్ అవుతాయని భావిస్తున్నారు.
అలాగే ఆడియో కనెక్ట్ అయ్యిన రీతిలో ట్రైలర్ కనెక్ట్ కాకపోవటం కూడా ఓ కారణం కావచ్చని చెప్తున్నారు. అయినా నాగచైతన్యకు ఉండే ఆడియన్స్ మాస్ లో తక్కువ. సాయి పల్లవి ఉంది కాబట్టి క్లిక్ అయితే ఫ్యామిలీలతో థియేటర్స్ నిండుతాయి. ఇంక్ లవ్ ట్రైలర్ వదిలితే యూత్ వస్తారు.
Sai Pallavi starrer Thandel film update out
ఈ చిత్రం కథాంశం విషయానికి వస్తే...2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు.
ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో దేశభక్తి, లవ్ స్టోరీ రెండు బలంగా ఉంటాయని టీజర్ ద్వారానే అర్థమైంది. ఈ స్టోరీలైన్ కూడా తండేల్‍పై ఆసక్తి మరింత పెంచేసింది.