నాగచైతన్య సెకండ్ మ్యారేజ్ వార్తలపై క్లారిటీ.. శోభితతోనే డేటింగ్.. త్వరలోనే అంతా బహిర్గతం..?
నాగచైతన్య.. సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు కావస్తుంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడనే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా సోర్స్ నుంచి తెలుస్తున్న సమాచారం ఆశ్చర్యపరుస్తుంది.
నాగచైతన్య.. సమంతకి విడాకులు ఇచ్చాక ఒంటరిగానే ఉంటున్నారు. తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే వరుస పరాజయాలు ఆయన్ని వెంటాడుతున్నాయి. అయితే గత కొంత కాలంలో ఆయన శోభితాతో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఒకటి రెండు సార్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పనిచేశారు. సోషల్ మీడియా ద్వారా వారు పంచుకునే ఫోటోల్లో ఈ ఇద్దరు కనిపించడం విశేషం. దీంతో ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని సమాచారం.
అయితే మధ్యలో ఈ ఇద్దరు విడిపోయినట్టు సమాచారం. శోభిత విపరీతమైన స్కిన్ షో, బోల్డ్ సీన్లు చేయడం నచ్చని చైతూ ఆమెకి బ్రేకప్ చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఈ ఇద్దరు విడిపోయారని వినిపించింది. ఇంతలో రెండో పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. ఓ వ్యాపార వేత్త కూతురుని చైతూ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని, సినిమాకి సంబంధం లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అని అంటున్నారు. నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ వార్తలు గత కొన్ని రోజులుగా ఇటు నెట్టింట, అటు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా నాగచైతన్యకి సంబంధించిన దగ్గరి సోర్స్ దీనిపై రియాక్ట్ అయ్యింది. నాగచైతన్య రెండో పెళ్లి వార్తల్లో నిజం లేదని తెలిపింది. అలాంటి చర్చలేమీ జరగలేదని తెలిపినట్టు `ఇండియా టుడే` ఓ కథనాన్ని పోస్ట్ చేసింది. ఇందులో చైతూ సన్నిహితలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారట. ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారనే వార్తల్లో నిజం లేదని, అవి ఉట్టి పుకార్లు మాత్రమే అని వారు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇంకో షాకింగ్ విషయం వెల్లడించారు. ఇప్పటికీ నాగచైతన్య.. శోభితతోనే రిలేషన్‌లో ఉన్నాడట. ఈ ఇద్దరి రిలేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పారు. అంతేకాదు ఓ డేరింగ్ డెసీషన్ తీసుకున్నారట. త్వరలోనే తమ రిలేషన్‌షిప్‌ని బహిర్గతం చేయబోతున్నారట. ఆ దిశగా ఆలోచన చేసినట్టు చెబుతున్నారు. తమ రిలేషన్ అందరికి తెలిసేలా చేయాలని అనుకుంటున్నారట. దీంతో రకరకాల రూమర్స్ కి చెక్ పెట్టినట్టు అవుతుందని చైతూ భావిస్తున్నట్టు సమాచారం. మరి ఆ సాహసం చేస్తారా? ఇది కూడా పుకారుగానే మిగిలిపోతుందా? చూడాలి.
ఇక నాగచైతన్య.. సమంతని `ఏం మాయ చేసావె` చిత్రం నుంచి ఇష్టపడుతున్నారు. ఈ ఇద్దరు ఏడేళ్లు ప్రేమించుకుని 2017 అక్టోబ్ 6,7 తేదీల్లో హిందీ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. 2021 అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు ఇద్దరూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక చైతూ శోభితతో బిజీగా ఉండగా, చందూ మొండేటితో ఓ సినిమా చేస్తున్నాడు. సమంత మాత్రం సింగిల్‌గానే ఉంది. ఆమె ఆరోగ్యం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేని నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంది. ఇటీవల సమంత `ఖుషి` చిత్రంలో మెరిసింది. ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది.