MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సమంత, చైతూల లవ్‌స్టోరి ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా? చూపులు కలిసింది అక్కడే.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ క్రష్‌

సమంత, చైతూల లవ్‌స్టోరి ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా? చూపులు కలిసింది అక్కడే.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ క్రష్‌

నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేండ్లలోనే విడాకులు తీసుకుంది. ఈగోలు, కెరీర్‌, ఫ్యామిలీ ఒత్తిడి వంటి వాటి మధ్య నలిగిపోయి ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నారని టాక్‌. తాజాగా సమంత తమ లవ్‌ స్టోరీ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 02 2021, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నాగచైతన్య, సమంత కలిసి మొదట `ఏం మాయ చేసావె` చిత్రంలో నటించారు. సమంతకిది డెబ్యూ మూవీ కాగా, చైతూకిది రెండో సినిమా. తొలి చిత్రం `జోష్‌` అనే విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే చైతూ, సమంతల చూపులు కలిశాయని, చూపులు స్నేహానికి దారితీసి, అనంతరం ప్రేమగా మారి, ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం రెండేళ్ల పాటే రిలేషన్‌లో ఉండి ఎట్టకేలకు ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2017లో మ్యారేజ్‌ చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రేమని పెద్ద సమక్షంలో అరెంజ్‌ మ్యారేజ్‌గా చేసుకుని బెస్ట్ కపుల్‌ అని నిరూపించుకున్నారు చై-సామ్‌ జోడి. కానీ కరెక్ట్ గా నాలుగేళ్లకే విడిపోయారు. మరో నాలుగు రోజుల్లో మ్యారేజ్‌ డే ఉన్న నేపథ్యంలో గాంధీ జయంతిని విడాకుల ప్రకటనకు వేదికగా మార్చుకున్నారు. చైతూ, సమంత పరస్పరం అంగీకారంతో, స్నేహా భావ హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. పదేళ్లస్నేహం మున్ముందు కూడా కొనసాగుతుందని వెల్లడించారు. 

38

అయితే ఈ సందర్భంగా వీరి లవ్‌ స్టోరి వైరల్‌ అవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఎక్కడ పుట్టింది. ఎలా పుట్టిందనే విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ లవ్‌ స్టోరికి సంబంధించి సమంత చెప్పిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. 

48

`ఏం మాయ చేసావె` సినిమా లుక్‌ టెస్ట్ సమయంలో ఈ ఇద్దరు కలిశారట. మొదట సెలూన్‌లో వీరి పరిచయం జరిగిందని చెప్పింది సమంత. సెలూన్‌లో రెడీ అవుతున్న సమయంలో చైతన్యని చూసి చిన్న కుర్రాడనుకుందట. ఫస్ట్ లుక్‌ కోసం రెడీ అవుతున్నప్పుడు తన వద్దకు వచ్చాడని, ఆ సమయంలో చైతన్య నర్వస్‌గా ఫీలవుతున్నాడట. ఆయనలో టెన్షన్‌ ఉన్నట్టు గమనించిందట. కానీ చాలా స్వీట్‌గా అనిపించాడని చెప్పింది సమంత. 

58

అతని నర్వస్‌ని చూసి తనే హాయ్‌ అని పలకరించిందట. అందుకు చై కూడా నర్వస్‌గానే హాయ్‌ అని చెప్పాడని తెలిపింది సమంత. ఫస్ట్ టైమ్‌ కలిసినప్పుడే తమలో ప్రేమ పుట్టలేదని, తమ లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదని చెప్పింది. `ఏం మాయ చేసావె` పూర్తయ్యేలోపు తమ మనసులు కలిశాయని చెప్పింది. సుదీర్ఘంగా తమ లవ్‌ స్టోరీ సాగిందని వెల్లడించింది. చై దొరకడం అదృష్టమని చెప్పింది. 

68
Samantha Naga Chaitanya divorce

Samantha Naga Chaitanya divorce

`ఏం మాయ చేసావె` చిత్రం తర్వాత సమంత, చైతూ కలిసి `ఆటోనగర్‌ సూర్య`, `మనం`, `మజిలి` చిత్రాల్లో నటించారు. ఇందులో `ఆటోనగర్‌ సూర్య` పరాజయం చెందగా, మిగిలిన అన్ని సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. అలాగే `ఓ బేబీ`లోనూ చైతూ గెస్ట్ రోల్‌ చేశారు. 

78

సమంత ప్రస్తుతం తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటించింది. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. దీంతోపాటు తమిళంలో నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటించింది. నయన్‌ ప్రియుడు విఘ్నేష్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 
 

88

మరోవైపు నాగచైతన్య ఇటీవల `లవ్‌ స్టోరి` చిత్రంలో విజయాన్ని అందుకున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఆయన విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హిందీలో ఆమిర్‌ ఖాన్‌తో కలిసి `లాల్‌ సింగ్‌ చద్దా` సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు చైతూ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved