ఫస్ట్ టాక్: ''లవ్ స్టొరీ'' స్టోరీ బాగుంది కానీ, ఆ సీన్సే....
శేఖర్ కమ్ముల చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులకు కొన్ని ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది ఇక సాయి పల్లవి వంటి నటి, నాగ చైతన్య వంటి హీరోతో శేఖర్ కమ్ముల వస్తున్నాడు.. అది కూడా ఓ ప్రేమ కథ చిత్రమైతే అందరూ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన లవ్ స్టోరీ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్24న అంటే ఈ రోజు ప్రేక్షకల ముందుకు వచ్చింది. లవ్‌స్టోరీతో థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని సినీ ప్రేమిఖులు, ప్రముఖులు భావిస్తున్నారు.లవ్‌స్టోరీ సినిమా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కులం, పరువు హత్య లాంటి సెన్సిటివ్ అంశాలను తెరపై ఎలా చూపించారన్నది చాలామందిలో ఉన్న క్యూరియాసిటీ. ఈ నేపధ్యంలో లవ్‌స్టోరీ సినిమా చూసేందుకు సినిమా లవర్స్ చూపిస్తున్న ఉత్సాహంతో వీకెండ్ మొత్తం అడ్వాన్స్ బుక్కింగ్ లు ఫిల్ అయ్యాయి. మరి సినిమా ఎలా ఉంది..స్టోరీ లైన్ ఏమిటి, టాక్ ఏమిటో చూద్దాం.
యుఎస్ ప్రిమీయర్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో జుంబా డ్యాన్సర్‌గా నాగ చైతన్య కనిపించారు. నిజామాబాద్ లోని ఆర్మూర్ విలేజ్ నుంచి రేవంత్, మౌనిక హైదరాబాద్ సిటీకు వస్తారు. రేవంత్ జుంబా డాన్స్ సెంటర్ నడుపుతూంటారు. మౌనిక అదే విలేజ్ లోని డబ్బున్న అమ్మాయి. ఆమె బిటెక్ కంప్లీట్ చేసి జాబ్ ట్రైల్స్ లో ఉంటుంది. సాప్ట్ వేర్ ఫీల్డ్ లో తను అనుకున్న జాబ్ రాదు. దాంతో రేవంత్ కు చెందిన డాన్స్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనర్ గా చేరుతుంది. ఇక రేవంత్ దళిత క్రిష్టియన్. మౌనిక పటేల్. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ వేర్వేరు కులాలు వారి మధ్య అంతరంగా మారతాయి. ఈ క్రమంలో వారిద్దరు ఎలా లవ్ జర్నీతో పాటు కెరీర్ జర్నిని పూర్తి చేసారన్నది తెరపై చూడగలిగే కథ.
ఈ సినిమా కథగా బాగుంది కానీ చివరి అరగంట బాగా డార్క్ టోన్ లో ఉందని అంటున్నారు. అయితే చాలా మందికి ఈ సినిమా తెగ నచ్చేస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి ఈ సినిమా కోసం తొలిసారి నటించారు. ట్రైలర్‌లో చూపించినట్లుగా ఇద్దరి మధ్యా వచ్చే డైలాగ్స్, కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా వర్కవుట్ అయ్యాయని చెప్తున్నారు.
అలాగే ఈ సినిమాలో నాగ చైతన్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది అతను చేసిన డ్యాన్స్. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఈ సినిమాలో సాయి పల్లవి కంటే నాగ చైతన్య డ్యాన్స్ పైనే ఫోకస్ పెరిగింది. ఈ సినిమాలో చైతూ జుంబా డ్యాన్సర్‌గా కనిపించడం, తెలంగాణ యాస టచ్ చేయడంతో కలిసివచ్చింది.
ఇక సాయి పల్లవికి నటిగానే కాకుండా, మంచి డ్యాన్స్‌ర్‌గానూ పేరుంది. ఆ విషయం మరో సారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలో ఢిపరెంట్ డ్యాన్స్ స్టెప్స్‌తో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. సాయిపల్లవికి సమానంగా నాగ చైతన్య డ్యాన్స్ ఉంది. ముఖ్యంగా సారంగధరియా పాటకు ఓ రేంజిలో తెరపై రెస్పాన్స్ వస్తోంది.
ప్రీ క్లైమాక్స్ లో వచ్చే డార్క్ షేడ్స్ సినిమా కథకు అవసరం కానీ సినిమాని డల్ చేసాయంటన్నారు. పస్టాఫ్ పూర్తిగా ఎంటర్టైన్ చేసింది. సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని ఫీల్ గుడ్ మామెంట్స్ ఉన్నాయి. అయితే మౌనిక బ్యాక్ స్టోరీ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉందని, కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక లొకేషన్స్ అద్బుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓ రేంజిలో ఉన్నాయి. ఏదైమైనా శేఖర కమ్ముల ధైర్యం చేసి కొన్ని విషయాలను ధైర్యంగా తెరపై చర్చించాడని మెచ్చుకుంటున్నారు.