- Home
- Entertainment
- నాగచైతన్యని వెంటాడుతున్న `విడాకులు`.. చిన్నప్పుడు అమ్మానాన్నలు.. ఇప్పుడు తను.. చైతూకే ఎందుకిలా..?
నాగచైతన్యని వెంటాడుతున్న `విడాకులు`.. చిన్నప్పుడు అమ్మానాన్నలు.. ఇప్పుడు తను.. చైతూకే ఎందుకిలా..?
నాగచైతన్య, సమంత విడిపోవడం టాలీవుడ్ జీర్ణించుకోలేకపోతుంది. వీరి నుంచి ఇలాంటి ఒక అనౌన్స్ మెంట్ వస్తుందని అర్నెళ్ల ముందు ఎవరూ ఊహించి ఉండరు. కానీ చైతూ జీవితాన్ని `విడాకులు` అంశం వెంటాడుతుంది.

నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 2010లో నటించిన `ఏం మాయ చేసావె` చిత్రంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన ఫ్రెండ్‌షిప్ క్రమంగా ప్రేమగా మారుతూ వచ్చింది. మధ్యలో ట్రాక్ తప్పినా, `మనం`సినిమాతో మరోసారి వీరిద్దరు లైన్‌లోకి వచ్చారు. ప్రేమలో ఉన్నట్టు చెప్పుకున్నారు. ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. అండగా నిలిచారు. దాదాపు రెండేళ్ల రిలేషన్ అనంతరం ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి 2017లో వివాహం చేసుకున్నారు.
అక్టోబర్ 6,7 తేదీల్లో వీరి వివాహం జరిగింది. సరిగ్గా నాలుగేళ్లకి నాలుగు రోజుల ముందు తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించి యావత్ తెలుగు ప్రేక్షకులకు షాకిచ్చారు. అభిమానులను కలవరానికి గురి చేశారు. ఎంతో మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉండే వీరిద్దరు డైవర్స్ తీసుకోవడమనేది నమ్మలేని నిజంగా నిలిచిపోయింది.
కానీ నాగచైతన్య విషయంలో అటు అభిమానులు, నెటిజన్లు సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయనకు మోరల్ సపోర్ట్ నిస్తున్నారు. చైతూ విషయంలో జరిగినదాన్ని తలచుకుని ఆవేదన చెందుతున్నారు. చైతూకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆవేదన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నాగచైతన్య.. నాగార్జున, లక్ష్మీ దగ్గుబాటిలకు జన్మించారు. లక్ష్మీ దగ్గుబాటు.. రామానాయుడు కూతురు. వెంకటేష్‌కి సోదరి. అయితే నాగ్, లక్ష్మీ మధ్య ఏర్పడిన డిఫరెన్సెస్, ఇద్దరిది డిఫరెంట్ ఫీల్డ్స్ కావడం వంటి కారణాలతో వీరిద్దరు విడిపోయారు. 1984లో నాగ్-లక్ష్మీ మ్యారేజ్ చేసుకోగా, రెండేళ్లకి అంటే 86లో చైతూ జన్మించారు. ఆ తర్వాత నాలుగేండ్లకే 1990లో వీరిద్దరు విడిపోయారు.
దీంతో చిన్నప్పటి నుంచే చైతూ జీవితంలో విడాకుల అంశం భాగమైపోయింది. లక్ష్మీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చైతూ తండ్రి నాగార్జునతోనే ఉండిపోయాడు. అక్కినేని వారసత్వాన్ని అందుకుని హీరోగా ఎదిగాడు. తండ్రి అడుగుజాడలో నడుస్తున్నాడు.
ఇక తన ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఇప్పుడు తనని వదిలేసి వెళ్లిపోయింది. ఫ్యామిలీ, ప్రొఫేషనల్ రంగాల మధ్య ఏర్పడిన తేడాల కారణంగా వీరిద్దరు విడిపోయారనే టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజాలేంటనేది తెలియాల్సి ఉంది. కానీ జీవితాన్ని మరోసారి విడాకులు వెంటాడటం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చైతూకే ఎందుకిలా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కఠిన సమయంలో ఆయనకు సపోర్ట్ గా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.
యాదృశ్చికమో ఏమోగానీ తాను జన్మించిన నాలుగేండ్లకి అమ్మానాన్నలు విడిపోతే, తాను పెళ్లి చేసుకున్న నాలుగేండ్లకే చైతూ, సమంత విడిపోవడం విచారకరం.