- Home
- Entertainment
- Custody Review: నాగ చైతన్య 'కస్టడీ' ప్రీమియర్ టాక్.. ఈ కథతో హిట్ సాధ్యమేనా, పెద్ద మైనస్ ఏంటంటే..
Custody Review: నాగ చైతన్య 'కస్టడీ' ప్రీమియర్ టాక్.. ఈ కథతో హిట్ సాధ్యమేనా, పెద్ద మైనస్ ఏంటంటే..
అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో యాక్షన్, థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు.

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో యాక్షన్, థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు. కృతి శెట్టి హీరోయిన్ గా మరోసారి నాగ చైతన్యతో ఈ చిత్రంలో రొమాన్స్ పండించింది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఇద్దరూ ఈ చిత్రానికి సంగీత దర్శకులు.
వెంకట్ ప్రభు గత చిత్రాల్లో కథలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో మనకి తెలుసు. దీనితో కస్టడీ చిత్రాన్ని అయన ఎలా తెరకెక్కించారు.. నాగ చైతన్యని ఎలా చూపించారు అనే ఆసక్తి ఉంది. చైతు ఈ చిత్రంలో కానిస్టేబుల్ గా నటించిన సంగతి తెలిసిందే. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నాగ చైతన్య, చిత్ర యూనిట్ మొత్తం కస్టడీపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆల్రెడీ యుఎస్ లో ప్రీమియర్ షోలు మొదలు కావడంతో ఈ చిత్ర టాక్, విశేషాలు బయటకి వస్తున్నాయి.
147 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 1996 బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలతో చిత్రం మొదలవుతుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు కస్టడీ చిత్రం నెమ్మదిగా పాటలు, సాధారణ సన్నివేశాలతో సాగుతుంది. మొదటి ట్విస్ట్, విలన్ పత్రాలు పరిచయం అయిన తర్వాత కథ వేగం పెరుగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది కానీ సన్నివేశాలు అబ్బుపరరిచేలా అయితే ఉండవు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది.
యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఇంటర్వెల్ నుంచి కథపై కాస్త ఆసక్తి కలిగించగలిగారు కానీ.. ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. సినిమా మొత్తం పాటలు టైం గడపడానికి మాత్రమే పెట్టినట్లు ఉంది. కొన్నిసన్నివేశాలు కన్విన్సింగ్ గా అనిపించవు. నాగ చైతన్య, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, అరవింద్ స్వామి నటన ఆకట్టుకుంటుంది. నాగ చైతన్య ఈ చిత్రం కోసం శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. కొన్ని సన్నివేశాల్లో చైతు లుక్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి.
ఇంటర్వెల్ కి ముందు పోలీస్ స్టేషన్ లో వచ్చే సింగిల్ షాట్ యాక్షన్ ఎపిసోడ్ పై ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ ఈ చిత్రాన్ని నిలబెట్టడానికి అదొక్కటే సరిపోదు. ఎప్పుడూ కథతో, స్క్రీన్ ప్లే తో కట్టిపడేసే వెంకట్ ప్రభు ఈసారి నిరాశపరిచారు.
ఫస్ట్ హాఫ్ బాగా బోరింగ్ గా అనిపించడంతో ఆడియన్స్ సెకండ్ హాఫ్ లో పెద్ద మిరాకిల్ జరగాలని కోరుకుంటారు. కానీ అది జరగలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి. దీనితో కొన్ని ట్విస్ట్ లు పడ్డప్పటికీ ఆసక్తి ఉండదు.
ఓవరాల్ గా నాగ చైతన్య కస్టడీ యావరేజ్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ఎడిటింగ్, బిజియం, సినిమాటోగ్రఫీ లాంటి టెక్నికల్ వర్క్ బ్రిలియంట్ గా ఉంది. కానీ ఇవన్నీ హైలైట్ అయ్యేది సినిమా కథ కథనాలు ఎంగేజింగ్ గా ఉన్నప్పుడు మాత్రమే. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమేరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.