నాగ చైతన్యపై ప్రేమ భారం, మిగిలిన ఆ రెండు బాధ్యతలు ఎలా ?.. బర్త్ డే రోజున ఫ్యాన్స్ కోరుతున్నది అదే..
లెజెండ్రీ నటుడు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా, కింగ్ నాగార్జున తనయుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
లెజెండ్రీ నటుడు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా, కింగ్ నాగార్జున తనయుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14 ఏళ్ల క్రితం చైతు జోష్ చిత్రంతో హీరోగా మారాడు. అప్పటి నుంచి నాగ చైతన్య కొన్ని విజయాలు అందుకున్నాడు. అలాగే పరాజయాలు కూడా ఉన్నాయి.
కానీ అక్కినేని ఫ్యాన్స్ కోరుకునేలా ఇంకా బలమైన ముద్ర పడలేదనేది వాస్తవం. కానీ రోజు రోజుకి నాగ చైతన్య నటనలో రాటుదేలుతున్నాడు. ప్రతి చిత్రంలో వేరియషన్స్ కనిపిస్తున్నాయి. ఒక్క బలమైన చిత్రం పడితే ఫాన్స్ కోరుకున్నది జరుగుతుంది. నేడు నాగ చైతన్య తన 37వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు.
దాదాపు 14 ఏళ్ల కెరీర్ లో చైతు ఎన్నో విజయాలు, ఒడిదుడుకులు ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఎదుర్కొన్నాడు. జోష్ చిత్రం నిరాశపరిచింది. దీనితో తన లవర్ బాయ్ లుక్స్ కి తగ్గట్లుగా ఏమాయచేశావే చిత్రంలో నటించి విజయం సాధించాడు. ఈ చిత్రంతోనే చైతూకి సమంతతో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత వీరిమధ్య స్నేహం పెరుగుతూ వచ్చి ప్రేమగా మారింది. ఈ క్రమంలో చైతు వరుసగా సినిమాలు చేయడం ప్రారంభించాడు. అయితే ఫ్యాన్స్ కోరుకునేలా సాలిడ్ మాస్ హిట్ అయితే పడలేదు. కొన్ని ప్రేమ చిత్రాలు మాత్రం సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలో చైతు 2017లో సమంతని వివాహం చేసుకున్నాడు. మూడేళ్ళ మ్యారేజ్ లైఫ్ తర్వాత విభేదాలు రావడం వీరిద్దరూ విడిపోవడం ఒక సంచలనం అయింది.
అయితే పర్సనల్ లైఫ్ సమస్యలు చైతు కెరీర్ పై పడకూడదని ఫ్యాన్స్ భావించారు. నాగ చైతన్య కూడా అభిమానులని అలరించేందుకే పూనుకున్నాడు. ప్రస్తుతం చైతు సింగిల్ గానే ఉంటున్నాడు. చైతు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తండేల్' . నిన్ననే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన చందు ముండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదటి నుంచి ఈ చిత్రంపై హైప్ పెంచుతున్నారు. చైతు ఈ చిత్రంలో బోట్ నడిపే మత్స్యకారుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చైతు నడి సముద్రంలో రగ్గడ్ లుక్ లో బోట్ పై కనిపిస్తున్నాడు.
టైటిల్ లోగోలో 'తన సిబ్బందిని, తన ప్రేమని, తన ప్రజలని నడిపించే వ్యక్తి అతను. తన జీవితాన్ని త్యాగం చేసేందుకు కూడా వెనుకాడడు అని ఉంది. చూస్తుంటే ఈ చిత్రంలో ప్రేమతో పాటు బలమైన యాక్షన్ అంశాలు కూడా ఉన్నాయి. ప్రేమ భారాన్ని మోస్తూ మిగిలిన బాధ్యతలని కూడా నెరవేర్చే జాలరిగా చైతు నటించబోతున్నాడు.
Naga Chaitanya
తండేల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే.. చైతుకి కెరీర్ లో తొలిసారి సరైన చిత్రం పడుతోంది. ఈ మూవీతో చైతు టాలీవుడ్ లో నెక్స్ట్ లెవల్ కి చేరుకోవాలి అని కోరుకుంటున్నారు. ఒక వైపు అఖిల్ నటిస్తున్న చిత్రాలు కూడా నిరాశపరుస్తున్న తరుణంలో ఫ్యాన్స్ అంతా తండేల్ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కోసం చైతు బాడీ ట్రాన్స్ఫర్ మేషన్, గడ్డం లుక్ నెక్స్ట్ లెవల్ లో ఉంది.