MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • `కల్కి 2`లో కల్కిగా కనిపించేది ఎవరు? క్రేజీ లీక్‌ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. పాండవులు, కమల్‌ హాసన్‌ పాత్ర గురించి

`కల్కి 2`లో కల్కిగా కనిపించేది ఎవరు? క్రేజీ లీక్‌ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. పాండవులు, కమల్‌ హాసన్‌ పాత్ర గురించి

ప్రభాస్‌ హీరోగా రూపొందిన `కల్కి 2898 ఏడీ` పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు `కల్కి 2`కి సంబంధించిన క్రేజీ విషయాలను పంచుకున్నారు నాగ్‌ అశ్విన్‌. కల్కి పాత్ర లీక్‌ చేశారు.   

5 Min read
Author : Aithagoni Raju
Published : Jan 06 2025, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Kalki 2898 AD

Kalki 2898 AD

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా గతేడాది విడుదలై భారీ విజయం సాధించింది. ఈ మూవీ 1200కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని మైథలాజికల్‌ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందించారు. మైథలాజికల్ అంశాలకు, సైన్స్ ఫిక్షన్‌ జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్‌ భైరవ పాత్రలో నటించారు. అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్రలో కనిపించారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రలో కమల్‌ హాసన్‌ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మొదటి భాగంగా పెద్ద విజయం సాధించడంతో ఇప్పుడు రెండో భాగంపై వర్క్ చేస్తున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. స్క్రిప్ట్ లో మార్పులతోపాటు స్క్రిప్ట్ ని ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు. దీంతోపాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ స్టార్ట్ కావడానికి మరో ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా `కల్కి 2`పై నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. క్రేజీ విషయాలను పంచుకున్నారు. 

read more: `కల్కి`లో కర్ణుడిని గొప్పగా చూపించడం చూసి సిగ్గుపడుతున్నా.. ప్రభాస్‌ సినిమాపై స్టార్‌ రైటర్‌ సంచలన వ్యాఖ్యలు

36

`కల్కి 2` సినిమాలో పాండవులు ఉండరని, ప్రస్తుతంంలో పాండవుల పాత్రలు కూడా కనిపించవు అని తెలిపారు. కాకపోతే కురుక్షేత్రానికి సంబంధించిన సీన్లు ఉంటాయని చెప్పారు. ఈ లెక్కన కురుక్షేత్రంలోని కర్ణుడి పాత్ర, అర్జునుడు, అశ్వత్థామ, కృష్ణుడి పాత్రలు ఉంటాయని చెప్పొచ్చు.

ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం రివీల్‌ చేశాడు నాగ్‌ అశ్విన్‌. కృష్ణుడి పాత్ర గురించి రియాక్ట్ అయ్యారు. ఆ పాత్రలో మహేష్‌ బాబు నటిస్తే అదిరిపోయేదని, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేసేవారని, సినిమా రెండు వేల కోట్లు వసూలు చేసేదన్నారు నాగ్‌ అశ్విన్‌. 

46

ఇంకోవైపు `కల్కి 2`లో కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై ఆయన స్పందించారు. కల్కిగా కొత్త ఫేస్‌ ఉంటుందని వెల్లడించారు. నోటెడ్‌ వాళ్లు కాకుండా, సినిమాల్లో నటిస్తున్న వాళ్లు కాకుండా కొత్త యాక్టర్‌ని కల్కిగా చూపించబోతున్నట్టు తెలిపారు నాగ్‌ అశ్విన్‌.

ఇప్పటి వరకు కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారనే క్యూరియాసిటీ ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని రివీల్‌ చేశాడు నాగ్‌ అశ్విన్‌. అయితే ఆ యాక్టర్‌ ఎవరనేది ఇంకా ఫైనల్‌ కాలేదని, ఆలోచిస్తున్నట్టు తెలిపారు దర్శకుడు. 
 

56
Kalki 2898 AD

Kalki 2898 AD

`కల్కి 2898 ఏడీ`లో క్లైమాక్స్ లో కమల్‌ హాసన్‌ పాత్రతో ముగించారు. సుప్రీం యాస్కిన్‌గా ఆయన సీరం చుక్క తన లోకి ఎక్కడంతో మామూలు మనిషి అవుతాడు యాస్కిన్‌. దీంతో ఆయన ఇక రంగంలోకి దిగబోతున్నట్టు చూపించారు.

దీపికా పదుకొనె తప్పించుకున్న నేపథ్యంలో ఆమెని పట్టుకుని మిగిలిన సీరం పొంది, ఆమెలో పెరుగుతున్న కల్కిని చంపేసేందుకు యాస్కిన్‌ బయలు దేరబోతున్నట్టు చూపించారు. ఈ క్రమంలో శ్రీశ్రీ రాసిన `భూ మార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా` అనే డైలాగ్‌ చెబుతాడు. యాస్కిన్‌ ఆ డైలాగ్‌ చెప్పడం ఆసక్తికరంగా మారింది. 
 

66

శ్రీ శ్రీ రాసిన ఆ డైలాగ్‌ యాస్కిన్‌ చెప్పడమేంటి? అనేది క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. దీనిపై నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. ఇది చెప్పడానికి రెండు కారణాలున్నాయని, ఒకటి యస్కిన్‌ మైండ్‌ సెట్‌ అని, ఆయన కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి బయలు దేరుతున్నాడు. రెండోది అది కేవలం కమల్‌ సర్‌ స్పెషాలిటీ. ఆయన ఇది చెబితే బాగుంటుందనిపించింది. డబ్బింగ్‌ దశలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం.

అందులో శ్రీ శ్రీ కి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. డబ్బింగ్‌ చెప్పి వెళ్తున్నప్పుడు ఆయన ఒకటి చెప్పారు, ఇది చేద్దామా? సర్‌ అన్నాను, చేద్దామా అని ఆయన అన్నాడు, అప్పటికప్పుడు అనుకుని చేశాం అది.  ప్రేమతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.                                                                                                                  

read more:చిరంజీవి, మోహన్‌బాబులకు దిమ్మతిరిగే కౌంటర్‌, తనకు తాను `లెజెండ్‌`గా ప్రకటించుకున్న బాలకృష్ణ

also read:    ఎన్టీఆర్‌ సినిమా నుంచి నన్ను తీసేశారు, ఐరన్‌ లెగ్‌ ముద్ర వేస్తారని కుంగిపోయా.. చిరంజీవి కామెంట్స్                                                                                                                                   

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
నాగ్ అశ్విన్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved