- Home
- Entertainment
- డబుల్ డోస్‌తో వస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. మిర్రర్‌లో నభా నటేష్ మతిపోయే గ్లామర్ ట్రీట్..
డబుల్ డోస్‌తో వస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. మిర్రర్‌లో నభా నటేష్ మతిపోయే గ్లామర్ ట్రీట్..
`ఇస్మార్ట్ శంకర్` బ్యూటీ నభా నటేష్ కొంత గ్యాప్‌తో ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో వస్తుంది. అయితే ఆమె రెట్టింపు ఎనర్జీతో, డబుల్ డోస్‌తో వస్తున్నట్టు తెలుస్తుంది.

నభా నటేష్ `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో టాలీవుడ్‌లో బిగ్ సక్సెస్‌ని అందుకుంది. అంతకు ముందు నుంచే గ్లామర్ షోలో హద్దులు చెరిపేసి సోషల్ మీడియాలో దుమారం రేపింది. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు తెలుగులో నిలబడేందుకు ప్లాన్ చేసుకుంది.
తెలుగులోకి సుధీర్‌బాబు `నన్ను దోచుకుందువటే` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా జస్ట్ యావరేజ్‌గా ఆడింది. ఆ తర్వాత రవిబాబు `అదుగో`లో మెరిసింది. అది అలా వచ్చి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఈ హాట్ బాంబ్‌కి `ఇస్మార్ట్ శంకర్` పడింది. రామ్‌తో అంతే ఎనర్జీగా నటించింది.
పూరీ జగన్నాథ్ ఇందులో నభానీ ఎంత హాట్‌గా, ఎంతటి గ్లామరస్‌గా చూపించాలో అంతగా చూపించారు. ఈ మూవీకి ఆమె అందాలు హైలైట్‌గా నిలిచాయి. అదే సమయంలో అంతే ఎనర్జీగానూ కనిపించి మెప్పించింది. `ఇస్మార్ట్ శంకర్` హిట్‌తో నభా కెరీర్ టర్న్ తీసుకున్నట్టే అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
ఆ తర్వాత నభా నటేష్ చేసిన సినిమాలు బోల్తా కొట్టాయి. `డిస్కోరాజా`, `సోలో బ్రతుకే సో బెటర్`, `అల్లుడు అదుర్స్` చిత్రాలు పరాజయం చెందాయి. `మ్యాస్ట్రో` కూడా పెద్దగా ప్రభావం చూపించలేపోయింది. దీంతో నభా కెరీర్ రివర్స్ అయ్యింది. అవకాశాలు తగ్గిపోయాయి.
అయితే వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య కారణాలతో ఆమె కొంత కాలం బ్రేక్ తీసుకుందట. మధ్యలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు నెమ్మదిగా మళ్లీ వస్తుంది. ప్రియదర్శితో కలిసి కమ్ బ్యాక్ అవుతుంది నభా నటేష్. ఇటవలే `డార్లింగ్` అనే చిత్రాన్ని ప్రకటించారు. `హనుమాన్`నిర్మాతలు ఈ మూవీని నిర్మించడం విశేషం.
ఈ క్రమంలో నభా నటేష్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. రెచ్చిపోతూ హాట్ షో చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మిర్రర్‌లో అందాలు చూపిస్తుంది. టాప్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంది. చూడబోతుంటే, డబుల్ డోస్‌తో ఇస్మార్ట్ బ్యూటీ కమ్ బ్యాక్ కాబోతుందని అంటున్నారు నెటిజన్లు. ఆమె అందాలపై హాట్ కామెంట్లు చేస్తున్నారు.
ఇక టాప్ షో చేస్తూ బ్లాక్ టైట్ ఫిట్లో నభా నటేష్ అందాల ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇలా గ్లామర్ ట్రీట్‌తో మేకర్స్ కి ఎరవేస్తుంది నభా. మరి దర్శకులు ఈ బ్యూటీకి ఆఫర్లిస్తారేమో చూడాలి.
`ఇస్మార్ట్ శంకర్` బ్యూటీ నభా నటేష్ కొంత గ్యాప్‌తో ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో వస్తుంది. అయితే ఆమె రెట్టింపు ఎనర్జీతో, డబుల్ డోస్‌తో వస్తున్నట్టు తెలుస్తుంది.