MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన శంకర్.. గేమ్ ఛేంజర్ లో అందరూ ఆశపడ్డ పాటనే లేపేశాడు

రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన శంకర్.. గేమ్ ఛేంజర్ లో అందరూ ఆశపడ్డ పాటనే లేపేశాడు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. శుక్రవారం తెల్లవారు జాము నుంచి ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. శంకర్ రేంజ్ సినిమా కాదు, కానీ పర్వాలేదు అనే టాక్ వస్తోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 10 2025, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. శుక్రవారం తెల్లవారు జాము నుంచి ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. శంకర్ రేంజ్ సినిమా కాదు, కానీ పర్వాలేదు అనే టాక్ వస్తోంది. ముఖ్యంగా అప్పన్న పాత్రలో రాంచరణ్ జీవించాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో చూడాలి. 

25

గేమ్ ఛేంజర్ చిత్రానికి బాలయ్య డాకు మహారాజ్, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో కాంపిటీషన్ ఉంది. ఇదిలా ఉండగా శంకర్ ఇటీవల తెరకెక్కించిన చిత్రాలతో పోల్చితే గేమ్ ఛేంజర్ చాలా బెటర్ అని అంటున్నారు. శంకర్ వల్ల ఫ్యాన్స్ నిరాశ పడ్డ అంశాలు కూడా గేమ్ ఛేంజర్ లో ఉన్నాయి. 

35

గేమ్ ఛేంజర్ చిత్రంలో అన్నింటికంటే బాగా సూపర్ హిట్ అయిన సాంగ్ నానా హైరానా. శ్రేయ ఘోషల్, కార్తీక్ ఎంతో మధురంగా పాడిన ఆ మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ అందరిని ఆకట్టుకుంది. పాట అద్భుతంగా ఉంది కాబట్టి ఇక శంకర్ స్టైల్ లో చిత్రీకరణ ఇంకా క్రేజీగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. స్క్రీన్ పై ఈ పాట విజువల్ ఫీస్ట్ లా ఉంటుందని అంతా భావించారు. 

45

కానీ శంకర్ చివరి నిమిషంలో  హ్యాండ్ ఇచ్చారు. నానా హైరానా సాంగ్ మొత్తాన్ని ఫైనల్ అవుట్ పుట్ నుంచి తొలగించారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రం ఆ సాంగ్ లేకుండానే ప్రదర్శించబడుతోంది. టెక్నికల్ కారణాల వల్ల మాత్రమే నానా హైరానా సాంగ్ ని తొలగించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇన్ఫ్రారెడ్ దృశ్యాల వల్ల సమస్య వచ్చిందట. దీనితో సాంగ్ ని ఎడిట్ చేయాల్సి వచ్చింది అని చిత్ర యూనిట్ పేర్కొంది. 

55

జనవరి 14 నుంచి ఆ సాంగ్ ని మూవీలో యాడ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. గేమ్ ఛేంజర్ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, సూర్య, జయరామ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక మందన్న కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. 250 కోట్లకు పైగా వసులు చేసిన 5 మూవీస్ ఏంటో తెలుసా?
Recommended image2
స్టార్ హీరోయిన్ కొడుకు కోసం డ్రీమ్ రూమ్.. అందులో ఏమున్నాయంటే? 6 ఫోటోలు వైరల్
Recommended image3
Virosh Wedding: పెళ్లిలో విజయ్ రష్మికతో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి ఎవరు? వైరల్ అవుతున్న కొత్త ఫొటోలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved