MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Chiranjeevi: మెగాస్టార్ సినిమాను చావు దెబ్బ కొట్టిన ఆర్ నారాయణమూర్తి, ఒకే టైటిల్ తో రిలీజ్ అయిన రెండు సినిమాలేంటి?

Chiranjeevi: మెగాస్టార్ సినిమాను చావు దెబ్బ కొట్టిన ఆర్ నారాయణమూర్తి, ఒకే టైటిల్ తో రిలీజ్ అయిన రెండు సినిమాలేంటి?

Chiranjeevi: టాలీవుడ్ హిస్ట్రీలోనే ఓ సారి విచిత్రమైన పోరు జరిగింది. ఇద్దరు స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు కామన్ గా జరిగేదే. కానీ చిరంజీవి లాంటి కమర్షియల్ స్టార్ హీరోతో ఆర్ నారాయణమూర్తి పోటీ పడ్డాడు. అది కూడా ఒకే రకమైన టైటిల్స్ తో, చివరికి ఏమైంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 17 2026, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు
Image Credit : Asianet News

స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు

స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు కామన్. ఇండస్ట్రీలో పోటా పోటీగా సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అభిమాను మధ్య యుద్దాలు జరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఇదంతా పెద్ద హీరోల మధ్య మాత్రమే సాధ్యమయ్యేది. కమర్షియల్ సినిమాల మధ్య మాత్రమే పోటీ జరిగేది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో మొదటి సారి చిరంజీవి లాంటి స్టార్ కమర్షియల్ హీరోను తన సినిమాతో చావు దెబ్బ కొట్టాడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. ఈ ఇద్దరి మధ్య పోటీ అంటేనే విచిత్రం.. అటువంటిది చిరంజీవి మీద నారాయణ మూర్తి విజయం ఎలా సాధ్యం అయ్యిందంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టాలీవుడ్ చరిత్రలో విచిత్రమైన పోటీ..
Image Credit : Asianet News

టాలీవుడ్ చరిత్రలో విచిత్రమైన పోటీ..

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో రకాల బాక్సాఫీస్ పోటీలు జరిగాయి. కానీ, ఒక అగ్ర కమర్షియల్ హీరో సినిమాకు, ఒక విప్లవాత్మక ప్రజా నాయకుడి సినిమాకు మధ్య జరిగిన అరుదైన పోటీ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ పోటీయే.. మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి. ఒకే సమస్య అది కూడా రిక్షా కార్మికుల కష్టాల నేపథ్యంలో ఇద్దరు భిన్నమైన హీరోలు తలపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Related Articles

Related image1
Toilets: ఫారెన్ టాయిలెట్స్‌లో వాటర్ బదులు టిష్యూస్ ఎందుకు వాడతారో తెలుసా? అసలు కారణాలు ఇవే
Related image2
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా?
36
గురుశిష్యుల సవాల్‌
Image Credit : Asianet News

గురుశిష్యుల సవాల్‌

కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'రిక్షావోడు' సినిమా భారీ అంచనాలతో రూపొందింది. దీనికి పోటీగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి 'ఒరేయ్ రిక్షా' సినిమాను తెరకెక్కించారు. దాసరి, కోడి రామకృష్ణలు గురుశిష్యులు కావడంతో ఈ పోటీ కేవలం హీరోల మధ్యే కాకుండా, గురుశిష్యుల సవాల్‌గా కూడా మారింది. 'రిక్షావోడు' షూటింగ్ ప్రారంభమైన రెండు నెలలకే 'ఒరేయ్ రిక్షా' చిత్రీకరణ మొదలైంది].

46
చావు దెబ్బ తిన్న చిరంజీవి సినిమా..
Image Credit : Asianet News

చావు దెబ్బ తిన్న చిరంజీవి సినిమా..

టాలీవుడ్ లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న చిరంజీవి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, సినిమా విడుదలయ్యాక ఫలితం మాత్రం పూర్తిగా తలకిందులైంది. చిరంజీవి 'రిక్షావోడు' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి మెగాస్టార్‌ను ఎంతగానో కలచివేసింది. ఎంతలా అంటే, ఈ సినిమా తర్వాత ఆయన దాదాపు ఎనిమిది నెలల పాటు మేకప్ వేసుకోకుండా సినిమాలకు దూరంగా ఉండిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

56
బాక్సాఫీస్ రేసులో విజేతగా నారాయణమూర్తి
Image Credit : Asianet News

బాక్సాఫీస్ రేసులో విజేతగా నారాయణమూర్తి

మరోవైపు, నారాయణమూర్తి 'సూర్యం' అనే రిక్షా కార్మికుడి పాత్రలో నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ, గుండెలకు హత్తుకునే పాటలతో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ సినిమాను చావుదెబ్బ కొట్టింది. గురువు దాసరి చేతిలో శిష్యుడు కోడి రామకృష్ణ పరాజయం పాలవగా, బాక్సాఫీస్ రేసులో నారాయణమూర్తి విజేతగా నిలిచారు. ఈ సినిమా థియేటర్లలో ఏకంగా 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.

66
హుందాగా తీసుకున్న చిరంజీవి..
Image Credit : Asianet News

హుందాగా తీసుకున్న చిరంజీవి..

అయితే, ఈ ఓటమిని చిరంజీవి ఎంతో హుందాగా స్వీకరించారు. 1996 మే 4న చెన్నైలో జరిగిన 'ఒరేయ్ రిక్షా' విజయోత్సవ సభకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సభలో చిరంజీవి మాట్లాడుతూ.. "మా రెండు రిక్షాల మధ్య జరిగిన పోటీలో నారాయణమూర్తి రిక్షానే ముందుకు దూసుకుపోయింది" అని బహిరంగంగా తన ఓటమిని అంగీకరిస్తూ నారాయణమూర్తిని అభినందించారు]. మెగాస్టార్ చూపించిన ఈ స్ఫూర్తి తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Toilets: ఫారెన్ టాయిలెట్స్‌లో వాటర్ బదులు టిష్యూస్ ఎందుకు వాడతారో తెలుసా? అసలు కారణాలు ఇవే
Recommended image2
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved