- Home
- Entertainment
- జైల్‌కి వెళ్లడంతో అల్లాడిపోయిన సుమన్ మదర్.. ఆ దెబ్బని తలుచుకుంటూ సంచలన వ్యాఖ్యలు..
జైల్‌కి వెళ్లడంతో అల్లాడిపోయిన సుమన్ మదర్.. ఆ దెబ్బని తలుచుకుంటూ సంచలన వ్యాఖ్యలు..
సుమన్ తనకు జరిగిన అన్యాయం గురించి అడపాదడపా చెబుతూనే ఉన్నాడు. కానీ తాజాగా ఆయన ఓ సంచలన కామెంట్ చేశారు. అమ్మ ఏడ్చిందంటూ ఎమోషనల్ అయ్యారు.

సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. దేవుడి పాత్రలకే కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఆయన ఒక స్టార్ స్టేటస్‌లో ఉండాల్సిన సుమన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం వెనుక పెద్ద కథ ఉంది. పెద్ద బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ఉంది. ఆయన్ని ఓ కేసులో ఇరికించి ఆరు నెలలు జైల్లో పెట్టిన ఘటన ఉంది. సుమన్ కెరీర్‌లో అదొక చేయని మచ్చలా మిగిలింది. అదే సుమన్ లైఫ్‌ని తలకిందులు చేసింది. లేదంటే ఇప్పుడు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌ల తరహాలో మంచి స్థానంలో ఉండేవాడు సుమన్.
తనకు జరిగిన అన్యాయం, తాను ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి తరచూ ఓపెన్ అవుతూనే ఉన్నాడు సుమన్. తాజాగా ఆయన ఓ కొత్త విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఇందులో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన అమ్మగారు పడ్డ ఇబ్బందులను పంచుకుంటున్నారు. అంతేకాదు కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే అంటూసంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎవరో కుట్ర చేశారని అంటుంటారు, అది ఎవరనది తనకు కూడా తెలియదని, కానీ ఎవరైనా దాని ఫలితాలు అనుభవించాల్సిందే అంటూ హాట్ కామెంట్ చేశారు.
ఈ ఘటన వల్ల తాను ఇప్పుడు పెద్దగా బాధపడటం లేదని, కానీ ఆ సమయంలో దారుణమైన పరిస్థితులు ఫేస్ చేశానని చెప్పారు సుమన్. ఆరు నెలలు చాలా కష్టంగా ఉండిందని, కానీ ఇప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. అయితే అమ్మ విషయంలో తనకు చాలా బాధగా ఉందన్నారు. ఆ సమయంలో అమ్మ ఏడ్చింది, చాలా స్ట్రగుల్ అయ్యింది. ఆ ఘటన తనకంటే అమ్మకే ఎక్కువగా దెబ్బకొట్టిందని, ఆమె ఎంతో కుంగిపోయిందని, ఆమె బాధ, నాకు బాధ కలిగిస్తుందని వెల్లడించారు సుమన్.
ఇక్కడ ఎవరు చేశారనేది తెలియదు, నేను దేనికో ఈ కర్మ అనుభవించాను. అలాగే తనకు ఎవరు చేసినా వాళ్లు కర్మ అనుభవిస్తారు, అది ఎవరినీ వదిలిపెట్టదు అంటూ షాకిచ్చాడు సుమన్. ప్రస్తుతం చాలా మందిని చూశాం, ఇలా అనుభవిస్తున్నాడు, ఇలా చనిపోయాడు, అలా చనిపోయాడు, ఆసుపత్రిలో ఇలాంటి స్థితిలో ఉన్నాడు, లేదంటే ఫ్యామిలీ విషయంలో ఇలా అయ్యిందనేది చూస్తుంటాం, వింటుంటాం. అది వాళ్ల కర్మ ఫలం అని, దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని వెల్లడించారు సుమన్.
తాను ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నా భయపడతానని, సుమన్ భోళాశంకరుడేం కాదు, లోపల వేరే సుమన్ ఉన్నాడు. ఇతరులను శిక్షించడానికి, అనడానికి నేను ఎవరిని అంటూ ప్రశ్నించారు. ఎవరైనా తప్పు చేస్తే చెబుతాను, ఒకటికి రెండు మూడు సార్లు చెబుతాను, వినకపోతే పంపిస్తాను. మా స్టాఫ్ విషయంలోనూ అంతే, వాళ్లకి చెబుతాను, ఆ తర్వాత వాళ్లే సరిచేసుకుంటారు. అంతేకాని ఇతరులను శిక్షించడానికి నేను ఎవరినీ? అంటూ ప్రశ్నించారు సుమన్. అప్పట్లో బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్‌ని ఇరికించారు. ఇందులో తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్, డీజీపీ, ఓ రౌడీషీటర్ ప్రమేయం ఉందని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సాగర్ చెప్పిన విషయం తెలిసిందే.