- Home
- Entertainment
- అందుకే అనిరుథ్ అంతలా వాయిస్తున్నాడా..? మ్యూజిక్ విషయంలో మనోడి క్వాలిఫికేషన్ తెలిస్తే షాక్ అవుతారు..?
అందుకే అనిరుథ్ అంతలా వాయిస్తున్నాడా..? మ్యూజిక్ విషయంలో మనోడి క్వాలిఫికేషన్ తెలిస్తే షాక్ అవుతారు..?
నిండా ముప్పై ఏళ్ళు లేవు.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడవు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. అంతే కాదు ఏ సినిమా చేసినా.. వాయించి వదిలిపెడతాడు స్టార్ మ్యూజిషియన్. ఇంతకీ అనిరుధ్ క్యాలిఫికేషన్ ఏంటో తెలుసా..? అందుకే ఆయన ఇలా వాయించి వదిలిపెడుతున్నాడా..?

anirudh
ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ.. ఆకట్టుకుంటున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. చాలా చిన్నవయస్సులోనే స్టార్ హీరోలకు పనిచేసే అవకాశంసాధించడం ఒక ఎత్తయితే.. ఆ సినిమాలను తన మ్యూజిక్ తో ఎక్కడికో తీసకెళ్ళాడు అనిరుధ్. ఇక ఈ మ్యూజిక్ సెన్సేషనర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంతో పాటు.. తెలుగులో కూడా అదరగొడుతున్నారు.
తెలుగులో కూడా ఊరకొట్టుడుకొట్టి... సినిమాలకు.. హీరోలకు అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చిన అనిరుధ్ తాజాగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాడు. ఇక తమిళనాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కు జైలర్ తో మ్యూజిక్ మ్యాజిక్ చేశాడు అనిరుధ్. ఈమూవీ హిట్ అవ్వడానికి అనిరుధ్దే కారణం అని తలైవానే పబ్లిక్ గా చెప్పేశాడు.
చిన్న వయసులోనే ఇప్పటికే 50 సినిమాలకు పైగా మ్యూజిక్ చేసిన అనిరుధ్ చేతిలో ప్రస్తుతం మరో డజన సినిమాలు ఉన్నాయి. పెద్ద సినిమాలకు ఆయన దాదాపు 10 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈయన సినిమా చేశారు అంటే సినిమాల్లో పాటలకు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇస్తాడని పేరు ఉంది.
మ్యూజిక్ విషయంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనిరుద్ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంత పర్ఫెక్ట్ గా.. హిట్ మ్యూజిక్ ఇచ్చే అనిరుధ్ క్యాలిఫికేషన్ ఏంటి...? ప్రస్తుతం చాలా మంది డౌట్ ఇదే. ఆయన ఏం చదువుకున్నారు అనే విషయానికి వస్తే అనిరుద్ రవిచంద్రన్ కూడా ఓ పక్క సంగీతం నేర్చుకుంటూనే మరోపక్క డిగ్రీ కూడా చదివాడు. అనంతరం లండన్ లో ఫేమస్ మ్యూజిక్ కాలేజీ ట్రినిటీ లో పియానో నేర్చుకొని, అక్కడ ఫ్యూజన్ బ్యాండ్ లో కూడా పనిచేసాడు.
చెన్నై తిరిగి వచ్చినటువంటి అనిరుద్ ఇక్కడ సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేశారు. ఏ సౌండ్ ఎక్కడ కరెక్ట్ గా వాడాలో, ఎంత లెవల్లో వాడాలో అనిరుధ్ కి బాగా తెలుసు. దీంతో కేవలం పాటలకు సంగీతం మాత్రమే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై పట్టు సాధించి ఇప్పుడు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు