- Home
- Entertainment
- Krishna Mukunda Murari: మురారిని ఎంకరేజ్ చేస్తున్న కమిషనర్.. అసలు నిజం తెలుసుకున్న ముకుంద?
Krishna Mukunda Murari: మురారిని ఎంకరేజ్ చేస్తున్న కమిషనర్.. అసలు నిజం తెలుసుకున్న ముకుంద?
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకుని ఇప్పుడు శాశ్వతంగా భార్యాభర్తలు గా ఉండాలని తపన పడుతున్న ఒక జంట కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో టైం అయింది త్వరగా రండి అని మురారిని పిలుస్తుంది కృష్ణ. వచ్చేస్తున్నాను అంటూ గబగబా రూమ్ లోకి వచ్చిన మురారి వాచ్ వైపు చూసి టైం అయిపోయింది నువ్వు ఫాస్ట్ గా వచ్చేయ్ ఈలోపు నేను కార్ తీసి పెడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సార్ మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని కేకలు వేస్తుంది కృష్ణ. ఎప్పుడు తిండి గోలేనా బయట తిందాంలే ఫాస్ట్గా వచ్చేయ్ అంటాడు మురారి.
ఈ మాటలు ముకుంద వింటుంది. వెళ్ళిపోతున్న కృష్ణని ఆపి లంచ్ కి బయటికి వెళ్తున్నారా అని అడుగుతుంది. అవును అని చెప్పి వెళ్ళిపోతుంది కృష్ణ. నేను కూడా వాళ్ళతో వెళ్తాను అనుకుంటుంది ముకుంద. ఆ తర్వాత కారులో కూర్చున్న మురారి ఒక భార్యగా కృష్ణ ఎలా ఉండబోతుంది తనలో ఆ చిలిపితనం అల్లరి అలాగే ఉంటుందా అని మనసులో అనుకుంటాడు.
కృష్ణ కూడా అలాగే అనుకుంటుంది ఎసిపి సార్ భర్తగా మారితే ఇలా ఫ్రెండ్లీ గానే ఉంటారా లేకపోతే అధికారం చెలాయిస్తారా అని అనుకుంటుంది. ఇంట్లో గ్రోసరీస్ అయిపోయాయి పేరుకి మాత్రం పెద్ద ఆఫీసర్ అంటూ నిష్టూరంగా మాట్లాడుతుంది కృష్ణ. తను ఎందుకు అలా మాట్లాడుతుందో అనుకుని ముందు మురారి ఆశ్చర్యపోతాడు మళ్ళీ ఓహో భార్య పాత్రలోకి ప్రవేశించిందా అని అనుకుంటాడు.
తను కూడా భర్త పాత్రలోకి ప్రవేశించి గ్రోసరీ సంగతి పక్కన పెట్టు ముందు ఆ వంట ఏంటి కారం ఉంటే ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే కారం ఉండదు రెండూ ఉంటే కూర ఉండదు అంటూ ఒక భర్త లాగా మాట్లాడుతాడు మురారి. అయితే ఇకమీదట మీరే వంట చేసుకోండి అంటుంది కృష్ణ. ఏం మాకు చేతకాదు అనుకున్నావా పెళ్ళికి ముందు నేను వంట చేస్తే ఆ వాసనకి వీధి వీదంతా చచ్చిపోయేది అంటాడు మురారి.
ఏం వంటలో నూనె కి బదులు పురుగుల మందు వాడేవారా అని నవ్వుతుంది కృష్ణ. మురారి కూడా నవ్వుతాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా పిలవడం టాపిక్ వస్తుంది. భార్యని అండీ గిండీ అని పిలవకూడదు కావాలంటే ఏమే కృష్ణ అని పిలవచ్చు అంటుంది కృష్ణ. ఆ మాటలు విన్న మురారి ఎన్నాళ్ళ నుంచి కంటున్నా కల ఇప్పుడే నిజం అయిపోయినట్లుగా ఉంది అనుకుంటాడు మురారి.
ఇంతలో హాస్పిటల్ రావడంతో కృష్ణని దించేసి లంచ్ సంగతి గుర్తు చేసి వెళ్లిపోతాడు మురారి. మరోవైపు కృష్ణ దంపతుల గురించి ఆలోచిస్తూ వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ గురించి మర్చిపోయి చాలా అన్యోన్యంగా ఉన్నారు. అలా శాశ్వతంగా ఉండిపోవాలంటే వాళ్ళిద్దరిలో ఉన్న ప్రేమని వెలికి తీయాలి ఆ బాధ్యత నాదే అనుకుంటుంది రేవతి. మరోవైపు ఆకలి వేయడంతో భార్యకి ఫోన్ చేస్తాడు మురారి బయటే ఉన్నాను రమ్మంటుంది కృష్ణ.
బయటికి వచ్చేసరికి కృష్ణతో పాటు కమిషనర్ కూడా ఉండడంతో ఆశ్చర్యపోతాడు మురారి. నేను హాస్పిటల్ కి వెళ్ళాను మురారి.. తను కూడా ఇక్కడికే వస్తోంది అని తెలిసి డ్రాప్ చేశాను అని చెప్పి లంచ్ కి బయటికి వెళ్తున్నారా అని మురారిని అడుగుతాడు కమిషనర్. అవును అంటాడు మురారి. నీ ప్రేమ విషయం ఏం చేశావు అని అడుగుతాడు కమిషనర్. ఇప్పుడు అందుకే బయటికి వెళ్తున్నాను సార్ అంటాడు మురారి.
వెరీ గుడ్ ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ లేట్ చేయకూడదు ఈసారి కలిసేటప్పుడు నీ మనసులో ఉన్నది ఏంటో తనకి చెప్పడమే కాదు తన మనసులో ఉన్నది ఏంటో కూడా కనుక్కో అంటాడు కమిషనర్. అలాగే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నా మురారిని ఇలాగే వెళ్తావా ఏంటి చక్కగా ఫార్మల్ వేసుకుని వెళ్ళు అప్పుడు లవర్ బాయ్ లాగా ఉంటావు అని చెప్పటంతో ఫార్మల్ వేసుకుని వస్తాడు మురారి.
ఇప్పుడు బావున్నావు అయినా కారులో వెళ్తావా ఏంటి అని అడుగుతాడు కమిషనర్. అవును సార్ అంటాడు మురారి. నువ్వెక్కడ దొరికావయ్యా నీలో రొమాంటిక్ యాంగిల్ బయటకు తీయవయ్యా చక్కగా బండి మీద వెళ్ళండి బ్రేకులు వేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ భలే ఉంటుంది అంటాడు కమిషనర్. ఇంకేం చెప్పొద్దు సార్ అంతా అర్థం అయిపోయింది ఇంక చూసుకోండి అంటాడు మురారి.
కమిషనర్ కానిస్టేబుల్ దగ్గర బైక్ కీస్ తీసుకొని మురారిని ఎంజాయ్ చేయమని పంపిస్తాడు. ఫార్మల్ లో బయటకు వచ్చిన మురారిని చూసి ఎందుకైనా మీ కమిషనర్ గారు లోపలికి రమ్మన్నది అని అడుగుతుంది కృష్ణ. తరువాయి భాగంలో హోటల్లో తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ కృష్ణని ప్రేమిస్తున్న విషయం ఇంట్లో చెప్పాలంటే ముకుందా వింటుందని భయం అంటాడు మురారి. ఆ మాటలు విన్న ముకుంద.. మురారి కృష్ణ ని ప్రేమిస్తున్నాడా అంటూ షాక్ అయిపోతుంది.