- Home
- Entertainment
- Krishna Mukunda Murari: పెంచిన ప్రేమకు లొంగిపోయిన భవాని.. మురారి ప్రవర్తనకి కన్నీరు పెట్టుకున్న ముకుంద!
Krishna Mukunda Murari: పెంచిన ప్రేమకు లొంగిపోయిన భవాని.. మురారి ప్రవర్తనకి కన్నీరు పెట్టుకున్న ముకుంద!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉండే కష్టసుఖాలని తెలిపే కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కేక్ కటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది కృష్ణ. అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి ఏడి మీ ఏసిపి సర్ అని అడుగుతుంది. స్నానం చేయించి వచ్చాను బట్టలు వేసుకొని వస్తారు అంటుంది కృష్ణ. అంతలోనే మురారి కిందికి రావడంతో ఎవరు లేకపోవడం చూసి అతనికి బర్త్డే విషెస్ చెప్తుంది రేవతి. అంతలోనే ముకుంద రావటం చూసి వెళ్లి అన్ని అక్కయ్య కి మోసేస్తుంది అని తిట్టుకుంటుంది రేవతి.
ముకుంద, మురారి కి బర్త్ డే విషెస్ చెప్తుంది. నువ్వు పెద్దమ్మ లేకుండా ఎప్పుడూ కేక్ కట్ చేయలేదు నేను వెళ్లి అక్కయ్యని పిలుచుకు వస్తాను అంటుంది రేవతి. వద్దమ్మా నాకోసం నువ్వు మాటలు పడొద్దు అంటాడు మురారి. పెద్ద అత్తయ్య తప్పకుండా వస్తారు అంటుంది కృష్ణ. నీకెలా తెలుసు నీకు చెప్పిందా అంటాడు మురారి. చెప్పలేదు కానీ అలా అనిపిస్తుంది అంటుంది కృష్ణ. మా అక్కయ్య సంగతి నీకన్నా మాకే బాగా తెలుసు అంటుంది రేవతి.
అంతలోనే బొకే తీసుకుని కిందికి వస్తున్న భవాని ని చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు జరిగింది తలుచుకుంటుంది కృష్ణ. తన రూమ్ లో బాధపడుతూ కూర్చొని ఉంటుంది భవాని. అప్పుడే కృష్ణ వచ్చి గోడకి ఉన్న ఒక ఫోటో తీసేసి యశోద కృష్ణుల ఫోటో పెడుతుంది. మీరు పెంచిన మీ బాలకృష్ణుడు పుట్టిన రోజు మీరు వస్తే ఆయన సంతోషిస్తారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి బాగా ఎమోషనల్ అవుతుంది భవాని.
జరిగింది తలుచుకుని నవ్వుకుంటుంది కృష్ణ. భలే గడుసు దానివే మా అక్కని అన్ని మెట్లు దిగేలాగా చేసావు అంటూ మెచ్చుకుంటుంది రేవతి. కృష్ణకి థాంక్స్ చెప్తాడు మురారి. భవాని కిందికి వచ్చి బొకే మురారి కి ఇచ్చి బర్త్డే విషెస్ చెప్తుంది. అందరూ ఆశ్చర్యపోయి తర్వాత ఆనందపడతారు. ఉత్తి బొకేయేనా గిఫ్ట్ ఏమీ లేదా అంటుంది కృష్ణ. మీ అందరితో మాట్లాడుతున్నాను అదే పెద్ద గిఫ్ట్ అంటుంది భవాని.
కానీ ఈ క్రెడిట్ మొత్తం నాకే అంటుంది కృష్ణ. నువ్వు పెంచిన దూరాన్ని నువ్వే తగ్గించావు అంటూ నవ్వుతుంది భవాని. నిజంగానే మీరు మాట్లాడటం చాలా పెద్ద గిఫ్ట్ అంటారు మురారి, కృష్ణ. భవాని కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటాడు మురారి. కన్నతల్లిని నా దగ్గర కూడా ఆశీర్వచనం తీసుకోలేదు ముందు పెద్దమ్మ దగ్గరే ఆశీర్వచనం తీసుకున్నావు అని ఉడుక్కుంటుంది రేవతి.
అప్పుడు రేవతి దగ్గర కూడా ఆశీర్వచనం తీసుకుంటాడు మురారి. మురారి కేక్ కట్ చేసి అందరికీ తినిపిస్తాడు. ముకుంద కి మాత్రం కేక్ పీస్ చేతిలో పెడతాడు. అందుకు చాలా బాధపడుతుంది ముకుంద. ఎప్పుడూ అర్ధరాత్రి 12 గంటలకే విషెస్ చెప్పేవారు ఈసారి విషెస్ చాలా లేట్ గా చెప్పినట్టు ఉన్నారు అని భవానీతో అంటుంది రేవతి. చెప్పకుండా ఉంటానని ఎందుకనుకుంటున్నావు అంటూ రాత్రి జరిగిన విషయం చెప్తుంది భవాని. అందరూ ఆనందిస్తారు.
కృష్ణ, మురారి కి ఒక గిఫ్ట్ ఇస్తుంది ఇప్పుడు కాదు ఒంటరిగా ఉన్నప్పుడు ఓపెన్ చేయండి అంటుంది. అందరం గుడికి వెళ్దాము అటు నుంచి అటే లంచ్ కి వెళ్దాం అంటుంది భవాని. భగవంతుని సాక్షిగా నేను ఆ గుడిలోనే మురారికి ఉంగరాన్ని తొడుగుతాను అనుకుంటుంది ముకుంద. ఆ తర్వాత తన గదిలో కూర్చొని మా పెద్దమ్మ నాతో మాట్లాడింది నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటాడు మురారి.
మీ సంతోషమే నా సంతోషం అంటుంది కృష్ణ. ఇద్దరూ కలిసి ఆనందంగా డాన్స్ చేస్తారు. అక్కడ గిఫ్ట్ ఓపెన్ చేయబోతుంటే ఇప్పుడు వద్దు ఒంటరిగా ఉన్నప్పుడు ఓపెన్ చేయండి అనటంతో గిఫ్ట్ ని పక్కన పెట్టేస్తాడు మురారి. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.