- Home
- Entertainment
- సావిత్రి దెబ్బకి ఆమె కాళ్ళు పట్టుకున్న టాలీవుడ్ హీరో..మహానటిని తక్కువగా అంచనా వేస్తే అంతే
సావిత్రి దెబ్బకి ఆమె కాళ్ళు పట్టుకున్న టాలీవుడ్ హీరో..మహానటిని తక్కువగా అంచనా వేస్తే అంతే
Mahanati Savitri: మహానటి సావిత్రి జీవితం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ కీర్తిని సొంతం చేసుకున్న సావిత్రి ఆ తర్వాత అదే స్థాయిలో కష్టాలు కూడా అనుభవించారు. ప్రస్తుతం ఉన్న మెగాస్టార్ చిరంజీవి, మురళి మోహన్ లాంటి ప్రముఖులు సావిత్రితో కలసి నటించిన వారే.

Savitri
Mahanati Savitri: మహానటి సావిత్రి జీవితం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ కీర్తిని సొంతం చేసుకున్న సావిత్రి ఆ తర్వాత అదే స్థాయిలో కష్టాలు కూడా అనుభవించారు. ప్రస్తుతం ఉన్న మెగాస్టార్ చిరంజీవి, మురళి మోహన్ లాంటి ప్రముఖులు సావిత్రితో కలసి నటించిన వారే. అప్పటికి ఆమె కెరీర్ చివరి దశలో ఉంది.
Savitri
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో భారతంలో ఒక అమ్మాయి అనే చిత్రంలో మురళి మోహన్, చంద్ర మోహన్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో మురళి మోహన్ తల్లి దండ్రులుగా సావిత్రి, కాంతారావు నటించారు. మురళి మోహన్ సావిత్రితో తొలిసారి నటించడం ఇదే. అప్పటికి సావిత్రి సత్తా ఏంటో మురళి మోహన్ కి తెలియదు. అందరూ ఆమెని మహానటి అని కీర్తిస్తుంటే విన్నాడట.
ఆ చిత్ర ఫస్ట్ డే షూటింగ్ లో మురళి మోహన్.. సావిత్రిని తక్కువగా అంచనా వేశారు. మొదట మురళి మోహన్ డైలాగ్ చెప్పాలి. ఆ తర్వాత సావిత్రి మెట్లపై నుంచి దిగుతూ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. ముందుగా రిహార్సల్స్ చేశారు. రిహార్సల్స్ లో సావిత్రి వేగంగా డైలాగ్ చెప్పి వెళ్లిపోయారు. సన్నివేశంలో కూడా ఇలాగే వేగంగా డైలాగ్ చెబుతారేమో అని మురళి మోహన్ అనుకున్నారట. డైరెక్టర్ స్టార్ట్ యాక్షన్ చెప్పగానే మురళి మోహన్ డైలాగ్ చెప్పారు. ఆ తర్వాత సావిత్రి డైలాగ్ చెప్పాలి. కానీ ఆమె చెప్పడం లేదు అలాగే చూస్తూ ఉంది.
Savitri
ఏంటి డైలాగ్ మరచిపోయిందా ? సైలెంట్ గా ఉంది ఏంటి ? ఈమె ఏమి మహానటి అంటూ మురళి మోహన్ తక్కువగా అంచనా వేశారట. ఆలస్యంగా సావిత్రి డైలాగ్ చెప్పింది. డైరెక్టర్ షాట్ ఒకే అన్నారు.. అందరూ చప్పట్లు కొట్టారు. సావిత్రి వెళ్లిపోయారు. తనకేమి అర్థం కాలేదు అని మురళి మోహన్ అన్నారు. వెళ్లి డైరెక్టర్ దాసరిని మురళి మోహన్ అడిగారట. దాసరి గారు.. సావిత్రి గారు చాలా లేట్ గా డైలాగ్ చెప్పారు. ఆమెకి డైలాగ్ వెంటనే గుర్తుకు వచ్చినట్లు లేదు. మీరెందుకు ఒకే చేశారు. ఇంకో షాట్ చేయాల్సింది అని అడిగారట.
దాసరి సమాధానం ఇస్తూ.. వెళ్లి రష్ చూడు నీకు అర్థం అవుతుంది అని చెప్పారు. రష్ చూడడంతో నా మైండ్ బ్లాక్ అయింది. ఆమె డైలాగ్ చెప్పే గ్యాప్ లో ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు.. అదిరిపోయింది. అందుకే ఆమె డైలాగ్ లేటుగా చెప్పారు. నేను డైలాగ్ చెప్పిన తర్వాత దానికి రియాక్షన్ గా ఆమె ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలి. అది సావిత్రి గారికి తెలుసు. ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలి, డైలాగ్ ఎంత గ్యాప్ లో చెప్పాలి లాంటివి ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆమె మహానటి అయ్యారు అని మురళి మోహన్ అన్నారు.
Murali Mohan
వెంటనే వెళ్లి సావిత్రి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశా. అమ్మా మీరు నిజంగానే మహానటి అని చెప్పా. ఆ విధంగా సావిత్రితో తనకి మరచిపోలేని ఎక్స్పీరియన్స్ ఉందని మురళి మోహన్ అన్నారు.