రాజశేఖర్ చేసింది తప్పు, చిరంజీవి మంచి మాట చెప్పినా కూడా.. మురళి మోహన్ కామెంట్స్
మెగా ఫ్యామిలీతో రాజశేఖర్ కుటుంబానికి చాలా కాలంగా విభేదాలు ఉన్న మాట ఇండస్ట్రీలో బహిరంగ రహస్యం. చాలా సందర్భాల్లో వీరి మధ్య విమర్శలు జరిగాయి.

మెగా ఫ్యామిలీతో రాజశేఖర్ కుటుంబానికి చాలా కాలంగా విభేదాలు ఉన్న మాట ఇండస్ట్రీలో బహిరంగ రహస్యం. చాలా సందర్భాల్లో వీరి మధ్య విమర్శలు జరిగాయి. ప్రజారాజ్యం పార్టీ సమయం నుంచి చిరంజీవి, రాజశేఖర్ కుటుంబం మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి.
అయితే కొన్నేళ్ల క్రితం మా అసోసియేషన్ మీటింగ్ జరిగినప్పుడు చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు, కృష్ణం రాజు, జయసుధ లాంటి వాళ్లంతా పాల్గొన్నారు. మా అసోసియేషన్ లో చెలరేగిన విభేదాలని పరిష్కరించేందుకు వీళ్లంతా ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పటికే రాజశేఖర్ కూడా మా అసోసియేషన్ లో జరుగుతున్న కొన్ని అంశాలని వ్యతిరేకిస్తున్నారు.
చిరంజీవి, కృష్ణ, మోహన్ బాబు లాంటి వారంతా కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇంతతో అసంతృప్తితో రగిలిపోతున్న రాజశేఖర్ వేదికపైకి వచ్చి పరుచూరి గోపాలకృష్ణ దగ్గర మైక్ లాక్కుని విమర్శలు చేయడం మొదలు పెట్టారు.
మంచి విషయాన్ని అందరితో పంచుకుందాం.. ఏవైనా విభేదాలు చెడు విషయాలు ఉంటె చెవిలో చెప్పుకుని చర్చించుకుందాం అని చిరంజీవి అన్నారు. అయినా పట్టించుకోకుండా రాజశేఖర్ విమర్శిస్తూనే ఉన్నారు. దీని గురించి మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆరోజు రాజశేఖర్ చేసింది తప్పు అని అన్నారు.
మంచి అందరితో చెబుదాం.. చేదు చెవిలో చెప్పుకుందాం అని చిరంజీవి అద్భుతమైన మాట అన్నారు. కానీ రాజశేఖర్ పట్టించుకోలేదు. రాజశేఖర్ ఆవేశపరుడు, చెడ్డ వ్యక్తి కాదు. కానీ ఆరోజు చేసింది మాత్రం తప్పు అని మురళి మోహన్ అన్నారు.
ఆర్టిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ రోజుల్లో తాను పూనుకుని చిరంజీవి, కృష్ణ ఇలా పెద్దవారందరిని ఒప్పించి మా అసోసియేషన్ స్థాపించినట్లు మురళి మోహన్ తెలిపారు. కానీ ఇప్పుడు మా అసోసియేషన్ లో ఆధిపత్యం కోసం అంతా విమర్శలు చేసుకుంటున్నారు అని మురళి మోహన్ బాధపడ్డారు.