- Home
- Entertainment
- Krishna Mukunda Murari: ముకుంద ప్రవర్తనకి ఇబ్బంది పడుతున్న మురారి.. కృష్ణ చేసిన పనికి షాకైన ఏసిపి!
Krishna Mukunda Murari: ముకుంద ప్రవర్తనకి ఇబ్బంది పడుతున్న మురారి.. కృష్ణ చేసిన పనికి షాకైన ఏసిపి!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. ఆడపడుచు జీవితాన్ని నిలబెట్టడం కోసం అత్తతోనే పోటీ పడుతున్న ఒక కోడలి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో పెళ్లి చీరలో తయారయ్యి ముకుంద తన గదిలో ఉంటుంది ఇంతలో మురారి ఇంత రాత్రి సమయంలో ఫోన్ మిస్డ్ కాల్ చేసింది మెసేజ్ చేసి గది దగ్గరికి రమ్మంది ఎందుకు అని వెళ్తాడు అక్కడికి వెళ్లిన మురారి ముకుంద ముస్తాబు అయి ఉండడం చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు ముకుంద వెనక్కి వచ్చి నాకు తెలుసు నేను ఇలా ముస్తాబై నిన్ను పిలవడం పద్ధతి కాదు.
నువ్వు రావడం కూడా పద్ధతి కాదు అని కానీ నేను ఉండలేకపోతున్నాను నువ్వు ఈ మధ్య నాకు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు సంవత్సరంలో వెళ్లిపోయే కృష్ణని చూసినంతలా కూడా నన్ను చూడడం లేదు ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు మురారి ఇది నందిని కోసం కొన్న చీర కదా నువ్వు కట్టుకోవడం ఏం బాలేదుఇంక కృష్ణ విషయానికొస్తే ఇది మనిద్దరి చేతిలో లేని విషయం.
మనం సాంప్రదాయాలకు కట్టుబాటులకు బానిసలం అని అంటాడు. నేను ఉండలేకపోతున్నాను మురారి ద్వేషం, జలసి ఇవన్నీ నా క్యారెక్టర్ కాదు కానీ కృష్ణ మనిద్దరి మధ్య గోడలా అనిపిస్తుంది ఎప్పుడు తొలగిపోతుందా అని ఆలోచిస్తున్నాను. ఇలా ఉండడం నావల్ల కావడం లేదు అని అంటుంది ఇలా అనుకోవడం వల్ల స్థానాలు మారిపోవు అంటాడు.
అయినా ఈ సమయంలో ఇంట్లో ఎవరైనా మనల్ని ఇక్కడ చూస్తే బాగోదు అంటాడు మురారి. బాధపడిన ముకుంద లోపలికి వెళ్తూ ఈ చీర నువ్వు ఎంచినదే కానీ ఇది నేను నా కోసం తీసుకున్నాను నందినికి ఇలాంటిదే తీసుకున్నాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది మరోవైపు మురారి తన గదిలోకి వచ్చి పడుకుంటాడు కృష్ణ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు.
భవాని చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకొని అక్కడ పెద్దమ్మ నందిని పెళ్లి చేయాలనుకుంటుంది మరోవైపు కృష్ణ, గౌతమ్ పెళ్లి చేయాలనుకుంటుంది. పెద్దమ్మ మాట కాదనలేను కృష్ణను ఒప్పిద్దాము పెళ్లి పోస్ట్ ఫోన్ చేయడానికి అనుకునే లోగా కృష్ణ నిద్రలో నుంచి లెగిసి మీరు పెద్ద బుడింగి అనుకున్నాను కానీ పెళ్లి పోస్టపోన్ చేస్తారు అనుకోలేదు.
ఇంత పిరికి వాళ్ళు నాకు ఇచ్చిన మాట తప్పారు అని ఏవేవో మాట్లాడుతూ కాలర్ పట్టుకుని కచ్చితంగా పెళ్లి చేయాలి అని చెప్పి పడుకుండిపోతుంది. మురారి భయపడతాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి కృష్ణ లేచి నాకు కలొచ్చింది ఎసిపి సర్ అని అనగా అది కల కాదు నిజమే భద్రకాళి లాగ తయారయ్యావు అని అంటాడు మీరు పెళ్లి పోస్ట్పోన్ చేసినట్టు నాకు కల వచ్చింది సర్ భయపడిపోయాను సారీ అంటుంది కృష్ణ.
నేను ఎందుకు పెళ్లి పోస్ట్పోన్ చేస్తాను కచ్చితంగా అనుకున్న సమయానికే పెళ్లి చేస్తాను అని అంటాడు మురారి. ఆ తర్వాత రోజు ఉదయం భవాని హాల్ దగ్గరికి వస్తుంది అదే సమయంలో ముకుంద కూడా వస్తుంది. పెళ్లి ఏర్పాట్లు చేయమన్నాను ఏం జరుగుతున్నట్టు కనిపించడం లేదు అని అనగా కృష్ణకు తెలియకుండా చేయమన్నారు కదా అత్తయ్య. అందుకే అన్ని గప్చుప్ గా చేస్తున్నాము అని అంటుంది ముకుంద.
సరే గుడ్ అని చెప్పి అక్కడ నుంచి భవాని వెళ్ళిపోతుంది. ఇంతలో కృష్ణ, మురారి మెట్లు దిగి వస్తున్నప్పుడు కృష్ణ కాలుజారి పడిపోతే మురారి కృష్ణను గట్టిగా పట్టుకుంటాడు ఈ దృశ్యం చూస్తుంది ముకుంద. తరువాయి భాగంలో మురారి, కృష్ణని గౌతమ్ ని కూర్చోబెట్టి కృష్ణుడు అభిమన్యుడికి శశిరేఖతోనే కదా పెళ్లి చేస్తాడు అంటాడు. ఆ మాటలకి నవ్వుకుంటారు గౌతమ్, కృష్ణ.
ఎపిసోడ్ ప్రారంభంలో ఇప్పటివరకు నువ్వు ఏం చేసినా ఈ కుటుంబం మంచి కోసమే చేశావు కానీ నందిని విషయంలో పెద్దమ్మతో పంతానికి పోవద్దు అంటాడు మురారి. నందిని విషయంలో పెద్దత్తయ్యదే పంతం. నేను ఏమి చేసినా నందిని ఆరోగ్యం బాగు చేయటం కోసమే చేశాను. ఆ సీనియర్ డాక్టర్ని ఇంటికి పిలుస్తున్నాను. నందిని విషయంలో ఏం జరిగిందో ఎవరు ఏం చేశారు. అందరికీ అన్ని విషయాలు తెలిసేలాగా చేస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. గౌతమ్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది.నీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అంటాడు గౌతమ్. మీరు నా గురించి ఆలోచించకండి నేను చెప్పింది చెప్పినట్లుగా చెప్పండి చాలు అంటుంది కృష్ణ. నువ్వు చెప్పినట్లే చేస్తాను ఒకసారి పిరికితనంతో వెనక్కి వెళ్ళటం వల్ల నందినిని పిచ్చిదాన్ని చేశారు.