- Home
- Entertainment
- Krishna Mukunda Murari: మురారిని టార్చర్ పెడుతున్న ముకుంద.. భర్తకి తనను పట్టుకునే అర్హత లేదంటున్న కృష్ణ!
Krishna Mukunda Murari: మురారిని టార్చర్ పెడుతున్న ముకుంద.. భర్తకి తనను పట్టుకునే అర్హత లేదంటున్న కృష్ణ!
Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని దోచుకుంటుంది. పెళ్లయినప్పటికీ తన ప్రేమికుడిని తన వశం చేసుకోవాలనుకుంటున్న ఒక స్త్రీ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రిలాక్స్డ్ గా కూర్చున్న భర్తని స్టేషన్ కి వెళ్ళరా అని అడుగుతుంది కృష్ణ. ఇప్పుడు వెళ్తాను అంటూ కృష్ణకి థాంక్స్ చెప్తాడు మురారి. ఎందుకు అంటుంది కృష్ణ. అంతా మర్చిపోయి నాతో మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నందుకు అంటాడు మురారి. జరిగింది తలుచుకొని ఏం సాధిస్తాను అంటుంది కృష్ణ. మురారి వెళ్ళిపోయిన తర్వాత మీరు నేర్పిన విలువలే ఈరోజు ఈ ఇంట్లో నా అస్తిత్వాన్ని నిలబెట్టింది అంటూ తండ్రికి చెప్పుకుంటుంది. నాకు మీ ఆశీస్సులు కావాలి ఆశీర్వదించండి అంటుంది కృష్ణ. మరోవైపు జరిగిందాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు భవాని, ఈశ్వర్, ప్రసాద్. నందిని ప్రేమవ్యవహారం అందరికీ తెలిసిపోతుందని కోపాన్ని అనుచుకున్నాను అంటాడు ఈశ్వర్. ఇది నా జీవితంలోనే ఊహించని సంఘటన.
ఒక ప్రేక్షకురాలిగా చూడాల్సి రావటం ఇదే మొదటిసారి. ఒకరకంగా ఇది నా ఓటమి లాంటిది అంటుంది భవాని. నా కనుసన్నల్లో కూడా నిలబడటానికి అర్హత లేని వాడు నన్నే అత్తగారు అని పిలవడానికి సాహసించాడంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అంటుంది భవాని. కృష్ణతో అతనికి ఉన్న చనువు చూస్తే నందిని గురించి చెప్పాడు అనిపిస్తుంది అంటాడు ఈశ్వర్. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను మీరు తొందరపడకండి అంటుంది భవాని. మరోవైపు నీతో ఇలా ఉండటం నా వల్ల కావడం లేదు అని కృష్ణకి మెసేజ్ పెడతాడు మురారి. ఒక్కసారి నన్ను క్షమించు అంటూ రిక్వెస్ట్ మెసేజ్ పెడతాడు. క్షమించకపోతే ఆఫీస్ కి కూడా వెళ్ళను అంటాడు. కృష్ణ తన దగ్గరికి వస్తుందా రాదా అని ఆలోచనలో పడతాడు మురారి.
ఇంతలో ముకుంద వచ్చి మురారి భుజం మీద చేయి వేస్తుంది. వచ్చింది ఎవరో తెలియకుండా నువ్వు వస్తావని నాకు తెలుసు అంటాడు మురారి. నిజంగా నేను రావాలనే కోరుకున్నావా అంటుంది ముకుంద. ఆ వాయిస్ కి వెనక్కి తిరిగి ముకుందని చూసి షాక్ అవుతాడు మురారి. మన ప్రేమ సంగతి ఏం చేశావు అని అడుగుతుంది ముకుంద. దేవుడికి తెలుసు అంటాడు మురారి. మరి నా సంగతి అంటుంది ముకుంద. నీకు పెళ్లి అయింది అంటాడు మురారి. ఆదర్శ్ లేడు రాడు అంటుంది ముకుంద. నాకు పెళ్లయింది అంటాడు మురారి. తను కూడా వెళ్ళిపోతుంది అంటుంది ముకుంద. వెళ్లనివ్వను అంటాడు మురారి. అంటుంది ముకుంద. ఎందుకు మాకు కాపురం జోక్యం చేసుకుంటున్నావు అంటాడు మురారి. ఎందుకు మన మధ్యలోకి కృష్ణ నీ లాగుతున్నావు అంటుంది ముకుంద.
నేను చేసిన పనికి కృష్ణకి కోపం వచ్చింది అందుకే సారీ చెప్పాలనుకుంటున్నాను అంటాడు మురారి. అలా అంటే నాకు పంతం పెరుగుతుంది ఇక్కడే ఉంటాను అంటుంది ముకుంద. అంతలోనే కృష్ణ అక్కడికి వస్తుంది మీ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్నారు అంటూ వెనక్కి వెళ్ళిపోబోతుంటే ఆమె చేయి పట్టుకుంటాడు మురారి.మీకు నా చేయి పట్టుకునే అర్హత లేదు వదలండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. ముకుంద మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి. నాకు మాటిమాటికి సిద్దు గుర్తొస్తున్నాడు చూడాలనిపిస్తుంది పదా వెళ్దాం అని కృష్ణతో అంటుంది నందిని. అప్పుడే అక్కడికి భవాని రావటం గమనించి సిద్ధూ అంటే బొమ్మ కాదు కదా అడగ్గానే తెచ్చి ఇవ్వటానికి.
వెళ్లి పడుకో కలలో కనిపిస్తాడు బోలెడన్ని కబుర్లు చెప్పుకో అంటుంది కృష్ణ అలాగే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నందిని. మరోవైపు తనని కోపంగా చూసున్నా భవానిని చూసి మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు కానీ నేను కూడా మీకులాగే బయటపడను అనుకుంటుంది కృష్ణ. నందినితో ఏం మాట్లాడుతున్నావ్ అంటుంది భవాని. సిద్దు కావాలని పదే పదే అడుగుతుంది అంటుంది కృష్ణ. దీనికి నిజంగానే నిజం తెలియదా లేకపోతే తెలియనట్లుగా నటిస్తుందా అనుకుంటుంది భవాని. సిద్దు ఎవరు అంటూ అమాయకంగా అడుగుతుంది కృష్ణ. అతను ఎవరో మీకు తెలుసా అని కృష్ణ అంటే నా కూతురికి మతిస్థిమితం లేక బాల్యంలోకి వెళ్ళిపోయి అప్పుడు తనతో ఆడుకున్న తోటి నేస్తాన్ని గుర్తు చేసుకుంటుందని నాకు తెలుసు అంటుంది భవాని.
మరి నందినికి మతి స్థిమితం లేకపోవటానికి కారణమేంటి అని అడుగుతుంది కృష్ణ. మా తలరాత, మా కర్మ అన్ని నీకే కావాలి వెళ్లి పని చూసుకో అంటూ కసరుకుంటుంది భవాని. మరోవైపు కృష్ణ మాటలు గురించి ఆలోచనలో పడతాడు మురారి. ఎన్నిసార్లు నీకు క్షమాపణ చెప్పినా మనసు కరగటం లేదు అనుకుంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కృష్ణ టెన్షన్ గా ఉన్నట్టున్నారు టీ తీసుకుంటారా అని అడుగుతుంది. కృష్ణ అంటూ ఆనందంగా పిలుస్తాడు మురారి. కృష్ణ కాదు సార్ నా పేరు రామకృష్ణ మీరు టెన్షన్ గా కనబడుతున్నారు టీ తీసుకు రమ్మంటారా అంటూ అడుగుతాడు కానిస్టేబుల్. ఇంకా భ్రమలోనే ఉన్న మురారి తీసుకురమ్మని చెప్తాడు. అతను టీ తీసుకురావడంతో గ్లాస్ అందుకున్న మురారికి టీ ఒలిగి చేయి కాలుతుంది. అప్పుడు బ్రమలోంచి బయటికి వచ్చిన మురారి నువ్వెందుకు టీ తీసుకొచ్చావు అని అడుగుతాడు మురారి.
మీరే కదా టీ తీసుకురమ్మన్నారు అంటాడు కానిస్టేబుల్. నేనెప్పుడూ టీ తీసుకు రమ్మన్నాను అక్కర్లేదు పట్టుకుపో అంటూ కేకలు వేస్తాడు. తరువాయి భాగంలో మా నాన్నని చంపింది మీరే అని కళ్ళారా చూసి కూడా ఏమీ చేయలేకపోయాను. కొన్నాళ్ల తర్వాత మీ జీవితం మీది నా ఒంటరితనం నాది అంటుంది కృష్ణ. మరోవైపు మురారిని రెస్టారెంట్ కి వెళ్దామా అని అడుగుతుంది ముకుంద. నేను ప్రేమించిన వాడి మనసు బాగోకపోతే పట్టించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది అంటుంది ముకుంద.