- Home
- Entertainment
- Krishna Mukunda Murari: డైరీ చదివి కుప్ప కూలిన ముకుంద.. భర్త మనసు అర్థం చేసుకోలేకపోతున్న కృష్ణ!
Krishna Mukunda Murari: డైరీ చదివి కుప్ప కూలిన ముకుంద.. భర్త మనసు అర్థం చేసుకోలేకపోతున్న కృష్ణ!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి పోటీగా నిలబడుతుంది. కొడుకు కాపురం ప్రమాదంలో ఉందని తెలుసుకుని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కృష్ణ వెళ్ళిపోతుంది అప్పుడు మురారి ఒంటరి వాడైపోతాడు అని ముకుంద మనస్సాక్షి హెచ్చరిస్తుంది. నిజమే నేను ఎంత పొరపాటు చేయబోయాను అనుకుంటుంది ముకుంద. ఇలాంటి ఆలోచనలు చేయటం మానేసి ఇంటికి వెళ్ళు వెళ్లి ప్రేమని సాధించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళు.
నీ ప్రయత్నంలో నువ్వు చేస్తున్నది తప్పని కానీ పాపం అని కానీ అనుకోకు ఒకవేళ ఎవరైనా అలా అన్నా పట్టించుకోవద్దు అని తన మనసాక్షి చెప్పడంతో రియలైజ్ అయిన ముకుంద ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు అలేఖ్య హారతి తీసుకువచ్చి భర్తని కళ్ళకి అద్దుకోమంటుంది. నేను బిజీగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకూడదని తెలియదా అంటూ పెద్ద బిల్డప్ ఇస్తాడు మధుకర్.
నిన్న ఇచ్చిన కోటింగ్ మర్చిపోయావా అలాంటిదే మళ్లీ కావాలా అని అడుగుతుంది అలేఖ్య. నిన్న పెళ్ళాం కొట్టిన దెబ్బలు గుర్తు చేసుకుని వద్దమ్మా నీకు వైలెంట్ అంత బాగా సూట్ అవ్వదు అని చెప్పి బుద్ధిగా హారతి కళ్ళకి అద్దుకుంటాడు మధుకర్. మరోవైపు లంచ్ చేసి బయటకు వస్తున్న మురారి దంపతులని ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అని ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంది. ముందుగా కృష్ణని చెప్పమంటుంది యాంకర్.
ప్రేమ గొప్పది. ఎందుకంటే ప్రేమించడం అనేది మనస్పూర్తిగా జరుగుతుంది అది చాలా స్వచ్ఛంగా పుడుతుంది. ఇందులో బలవంతం ఉండదు. అదే పెళ్లి విషయానికి వస్తే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసేస్తారు ఇదే సంఘటన నా ఫ్రెండ్ జీవితంలో కూడా జరిగింది. తను బలవంతపు పెళ్లికి బలైపోయింది అందుకే నా దృష్టిలో ప్రేమ గొప్పది అంటుంది కృష్ణ. ఇదేమిటి తను ఎలా చెప్తుంది మా పెళ్లి గురించే మాట్లాడుతుందా అనుకుంటాడు మురారి.
ఇప్పుడు అదే ప్రశ్న మురారిని అడుగుతుంది యాంకర్. నా దృష్టిలో పెళ్లి గొప్పది. ప్రేమకి ఇద్దరు వ్యక్తులు ఉంటే చాలు కానీ పెళ్ళికి అలా కాదు రెండు కుటుంబాలు కలవాలి. వేదమంత్రాలు సాక్షిగా మంచి ముహూర్తంలో పెళ్లి చేస్తారు అలాంటి బంధానికి ఎక్కువ విలువ ఉంటుంది అంటాడు కృష్ణ. అదేంటి ఈయన డైరీ అమ్మాయిని ప్రేమిస్తున్నారు కదా పెళ్లి గురించి గొప్పగా చెబుతున్నారు ఏంటి ఈయన మనసులో ఏముందో అసలు అర్థం కావడం లేదు అనుకుంటుంది కృష్ణ.
మళ్లీ మురారి మాట్లాడుతూ ప్రేమ లేకుండా పెళ్లి లేదు పెళ్లి లేకుండా ప్రేమ లేదు రెండిట్లో ఏది గొప్ప అనుకోవటానికి లేదు. రెండు కవల పిల్లలు లాంటివి అని చెప్పటంతో అక్కడున్న వాళ్ళందరూ చాలా బాగా చెప్పారు అంటూ చప్పట్లు కొడతారు. మరోవైపు ఏడుస్తూ మురారి గదిలోకి వస్తుంది ముకుంద. అక్కడ చుట్టూ చూస్తుండగా సోఫా కింద డైరీ కనిపిస్తుంది.
ముందు పేపర్లను చదివిన ముకుంద ఇవి మా పాత జ్ఞాపకాలే అంటే మురారి ఇంకా మా ప్రేమని మర్చిపోలేదు అని సంతోషపడుతుంది. అలా పుస్తకాన్ని తిరగేస్తూ ఉంటే ఆఖరి పేజీలు కనబడటంతో వాటిని చదువుతుంది ముకుంద అందులో కృష్ణని ప్రేమిస్తున్నట్లుగా ఉండటంతో బాధతో కుప్పకూలిపోతుంది. ఇది చీటింగ్ నాకు మాట ఇచ్చి తప్పవు ఒకసారి కాదు చాలాసార్లు తప్పావు.
అయినా నన్ను ప్రేమించిన మనసుతో మరొకరిని ఎలా ప్రేమిస్తావు ఇన్నాళ్లు నీ గురించి చాలా సాఫ్ట్ గా ఆలోచించాను అని మనసులో అనుకుంటూ ఆ డైరీ తీసుకొని ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద. మరోవైపు స్టేషన్కు వచ్చిన మురారి తాళాలు కానిస్టేబుల్ కి ఇచ్చేసి మళ్ళీ తన కారులో తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. కారులో కృష్ణ మాట్లాడుతూ ఇందాక యాంకరింగ్ చేసిన అమ్మాయి చాలా చలాకీగా ఉంది కదా నేను కూడా కాలేజీలో ఉండేటప్పుడు అలాగే గలగల మాట్లాడే దాన్ని అందరూ నన్ను మైక్ మింగేసావా అని ఆట పట్టించేవారు అని గలగల మాట్లాడుతుంది.
నేనే మాట్లాడుతున్నాను మీరు ఏమి మాట్లాడటం లేదు అని తిరిగి భర్తని ప్రశ్నిస్తుంది.. నువ్వు ఖాళీ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను ఇందాకట్నుంచి ఏమాత్రం గ్యాప్ లేకుండా లొడలోడా మాట్లాడుతున్నావు అయినా మీ భార్యలు అందరూ ఇంతేనా అని కృష్ణని ఆటపట్టిస్తాడు మురారి. ఆ మాటలకి మూతి ముడుచుకుంటుంది కృష్ణ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.